జర్నలిస్టు వెంకటనారాయణకు పురస్కారం | Award to journalist venkatanarayana | Sakshi
Sakshi News home page

జర్నలిస్టు వెంకటనారాయణకు పురస్కారం

Mar 19 2017 3:06 AM | Updated on Oct 8 2018 3:56 PM

జర్నలిస్టు వెంకటనారాయణకు పురస్కారం - Sakshi

జర్నలిస్టు వెంకటనారాయణకు పురస్కారం

అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ సొసైటీ చెన్నై, చందూర్‌ కుటుంబసభ్యులు, స్నేహితుల ఆధ్వర్యంలో

చెన్నైలో ప్రదానం చేసిన జస్టిస్‌ నూతి రామ్మోహనరావు

కొరుక్కుపేట (చెన్నై): అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ సొసైటీ చెన్నై, చందూర్‌ కుటుంబసభ్యులు, స్నేహితుల ఆధ్వర్యంలో 2017 సంవత్సరానికి ‘ఎన్‌ఆర్‌ చందూర్‌–జగతి పురస్కారం–2017’ను న్యూఢిల్లీకి చెందిన సీనియర్‌ జర్నలిస్టు ఎస్‌.వెంకటనారాయణకు ప్రదానం చేశారు. చెన్నైలో శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహనరావు ఈ పురస్కారాన్ని అందజేశారు.

వెంకటనారాయణ ప్రస్తుతం సౌత్‌ ఏషియా బ్యూరో చీఫ్, ఫారిన్‌ కరస్పాండెంట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సౌత్‌ ఏషియా అధ్యక్షుడిగా ఉన్నారు. అవార్డు కింద రూ.50 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని బహూకరించారు. కార్యక్రమంలో కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు ఎంవీనారాయణ గుప్తా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement