breaking news
ntr vydyaseva
-
మల్టీకేర్‌లో ఘరానా మోసం
పాలకోడేరు : నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవగా పేరుమార్చి అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామానికి చెందిన పొదిలాపు రాంబాబు ఎఫ్‌సీఐలో హమాలీగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి నెలలో సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి మోటార్ సైకిలిస్ట్ ఢీకొట్టాడు. ఫలితంగా మెడ భాగంలో గట్టిగా దెబ్బ తగిలింది. మెడ కదల్చలేని స్థితిలో విశాఖ పట్టణంలోని ఆదిత్య మల్టికేర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి మెడ భాగంలో పూసలు కొద్దిగా తప్పుకున్నాయని, ఫలితంగా నరాలు దెబ్బతిన్నాయని ఆపరేషన్ ద్వారా సరిచేయవచ్చని చెప్పారు. అందుకు రాంబాబు సరేనన్నారు. ఇక అక్కడ నుంచి శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా మొదలైంది. న్యూరో సర్జన్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గొల్లా రామకృష్ణ ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆపరేషన్ చేసి మందులిచ్చి పంపించేశారు. మందులు ప్రభావంతో కొద్ది రోజులు తగ్గినా మరలా పరిస్థితి మామూలుగా తయారయింది. రెండోసారి వెళ్లినప్పుడు కూడా మందులిచ్చి పంపేంచేశారు. ఈసారి పరిస్థితి సీరియస్‌గా మారింది. కాళ్లు, చేతులకు రక్త ప్రసరణ తగ్గి కదలికలు లేకుండా స్తంభించిపోయాయి. కేవలం ద్రవ ఆహారంపైనే ఆధారపడటంతో శరీరం క్షీణించి పోయింది. దాంతో విషయం తెలిసిన ఆర్టీఐ ప్రొటెక్షన్ కౌన్సిల్ జిల్లా కోఆర్డినేటర్ కె.శ్రీనివాస్ భీమవరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో స్కానింగ్ తీయించగా ఆశ్చర్యకరమైన విషయం బహిర్గతమైంది. అసలు రాంబాబుకు ఆపరేషనే జరగలేదని పరీక్షల్లో తేలింది. ఇదే విషయమై విశాఖలోని ఆస్పత్రి వర్గాలను ప్రశ్నించినా స్పందన లేదని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం మరో చోట వైద్యం చేయించుకుందామన్నా వైద్యసేవ కార్డు ఆస్పత్రి వర్గాల్లో క్లెయిమ్ చేయించుకున్నారని దాంతో పనికి రాకుండా పోయిందన్నారు. ప్రభుత్వమే స్పందించి బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. -
‘దారి’ తప్పిన విజి‘లెన్స్’!
- ‘ఎన్టీఆర్ వైద్య సేవ’పై విచారణలో కొరవడిన నిజాయితీ అనంతపురం మెడికల్ : ఆరోగ్య శ్రీ... నిరుపేదలు సైతం కార్పొరేట్ వైద్యం అందుకోవాలన్న ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పురుడుపోసుకున్న పథకం. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దీన్ని ‘ఎన్టీఆర్ వైద్యసేవ’గా మార్చారు. జిల్లాలో ప్రభుత్వ సర్వజనాస్పత్రి, కదిరి ఏరియా ఆస్పత్రితో పాటు 20కి పైగా నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ పథకం కింద వైద్యసేవలు అందిస్తున్నారు. 2014 - 15లో రూ.17 కోట్లు, 2015 - 16లో రూ.28 కోట్లను ప్రైవేట్ ఆస్పత్రులకు కట్టబెట్టారు. 15 వేలకు పైగా శస్త్ర చికిత్సలు జరిగాయి. ఈ క్రమంలో పలు ఆరోపణలు రావడంతో పథకం అమలు తీరు ఎలా ఉందో తెలుసుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా విజిలెన్స్ అధికారులు నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఈ రెండేళ్ల వ్యవధిలో శస్త్ర చికిత్సలు, లబ్ధిదారుల వివరాలు తీసుకున్నారు. శుక్రవారం సర్వజనాస్పత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవ కో-ఆర్డినేటర్ సౌజన్యకుమార్ను విజిలెన్స్ సీఐ జీవన్ గంగనాథ్‌బాబు కలిశారు. ఆరోగ్య మిత్రను, సర్వజనాస్పత్రికి చెందిన వైద్యులు నారాయణ, రమేష్‌లను తోడుగా తీసుకుని శనివారం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 20 మంది వివరాలు రాబట్టారు. అయితే ఆపరేషన్ చేయించుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సిన అధికారులు కొందరి విషయంలో అలా విచారించలేదని తెలుస్తోంది. మధ్యాహ్నం నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ అధికారి కార్యాలయం పక్కన పార్కింగ్ ప్రదేశంలో వినాయక్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి (ఆపరేషన్ చేయించుకున్న వారి కుటుంబ సభ్యుడు)ని పిలిపించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ విషయం తెలిసి మీడియా అక్కడకు వెళ్లడంతో డాక్టర్లు, విజిలెన్స్ అధికారులు జారుకున్నారు. లోటుపాట్లను పట్టుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన విజిలెన్స్ అధికారులు ఇలా ‘పక్కదారి’ పట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా మరో నాలుగు రోజుల పాటు విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత తాము కలిసిన వారికి సంబంధించి కేస్షీట్లను ఆస్పత్రుల నుంచి తీసుకుని ఆన్లైన్లో పరిశీలించనున్నట్లు సమాచారం.