breaking news
not close
-
ఒకటీ రెండు కేసులకే మూసేయొద్దు
న్యూఢిల్లీ: కంపెనీలు, సంస్థలు ఒకటీ రెండు కరోనా కేసులు బయటపడిన సందర్భాల్లో తమ కార్యాలయ భవనం లేదా పని ప్రాంతాన్ని మొత్తాన్ని మూసివేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. భవనాన్ని శానిటైజ్ చేసి కార్యకలాపాలను ప్రారంభించవచ్చని తెలిపింది. భారీగా కేసులు నిర్ధారణ అయితే ఆ భవనాన్ని 48 గంటలపాటు మూసి ఉంచాలని సూచించింది. భవనాన్ని శానిటైజ్ చేసి, సురక్షితమని ధ్రువీకరించుకున్నాకే ప్రారంభించాలని, సిబ్బంది ‘వర్క్ ఫ్రం హోమ్’విధానంలో పనిచేయాలని పేర్కొంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. కార్యాలయ సిబ్బంది ఎవరైనా ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడే వారు ఆఫీసులకు రావద్దని, స్థానిక ఆరోగ్య శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరింది. ఒక గదిలో లేదా ఆఫీసు ప్రాంతంలో ఎవరైనా కోవిడ్–19 సోకిన లక్షణాలతో బాధపడుతుంటే వారిని మరో చోట ఒంటరిగా ఉంచి, వైద్యుని సలహా తీసుకోవాలని సూచించింది. అటువంటి వ్యక్తులు, కోవిడ్–19 అనుమానిత లేక పాజిటివ్ అని తేలితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. ‘50 శాతం జూనియర్ స్టాఫ్ విధులకు హాజరు కావాలి’ డిప్యూటీ సెక్రెటరీ కంటే తక్కువ స్థాయి పోస్టుల్లో ఉన్న జూనియర్ ఉద్యోగుల్లో 50 శాతం మంది కార్యాలయాల్లో విధులకు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటిదాకా 33 శాతం మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ఇకపై జూనియర్ ఉద్యోగులు రోజు విడిచి రోజు ఆఫీసులకు వచ్చేలా అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు రోస్టర్‌ను రూపొందించాలని కేంద్రం ఆదేశించింది. కోవిడ్ కారణంగా తీవ్రమైన హృద్రోగ సమ స్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రక్తం గడ్డకట్టడం లాంటి సమస్యలకు కోవిడ్ కారణమౌతోందని, కోవిడ్ మందుల వల్ల హృద్రోగులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని అమెరికాలోని వర్జీనియా వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
కొలిక్కిరాని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం
-
బడులు మూసివేయం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణలో భాగంగా పాఠశాలలు మూసివేసే ప్రసక్తేలేదని, ఈ నిబంధన తొలగిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు రేషనలైజేషన్‌కు సవరణ చేస్తామన్నారు. మంగళవారం సచివాలయంలో రేషనలైజేషన్ ఉత్తర్వులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. 19 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, 75 మంది లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు, ఇంగ్లిష్ మీడియం సక్సెస్ స్కూళ్లను పక్కస్కూళ్లలో విలీనం చేసేలా విద్యాశాఖ జారీ చేసిన రేషనలైజేషన్ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘా లు వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను ఉపసంహరించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ (టీటీజేఏసీ), ఇతర సంఘాల నేతలు మంగళవారం జగదీశ్‌రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్షించి, స్కూళ్ల మూసివేత నిబంధనను తొల గించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలి సింది. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. నిబంధనలు సవరించి టీచర్ల రేషనలైజేషన్ వేసవి సెలవుల్లో చేపడతామన్నారు. స్కూళ్ల మూసివేత ప్రభుత్వ విధానం కాదన్నారు. గత ఏడాది బదిలీ అయినా, పాతస్థానాల్లోనే కొనసాగుతున్న టీచర్లను రిలీవ్ చేస్తే స్కూళ్లు మూతపడతాయనే ఉద్దేశంతోనే వారిని రిలీవ్ చేయలేదన్నారు. అలాంటిది ఇపుడు రేషనలైజేషన్ పేరు తో స్కూళ్లను ఎందుకు మూసివేస్తామన్నారు. ఉత్తర్వుల జారీ విషయంలో ఏదో జరిగిందని, దానిని వెంటనే సవరిస్తామన్నారు. గిరిజనతండాల్లో 10 మందే విద్యార్థులుంటారని, అక్కడ స్కూల్ మూసివేస్తే విద్యార్థులు విద్యకు దూరం అవుతారని చెప్పారు. హేతుబద్ధీకరణ ఎప్పుడనేది విద్యాశాఖ నిర్ణయిస్తుందన్నారు. దీంతో సంఘాలకు సంబంధం లేదన్నారు. రేషనలైజేషన్ తర్వాతే ఎంతమంది కొత్తటీచర్లు అవసరమనేది తేలుతుందన్నారు. మంగళవారం సాయంత్రం విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్‌తో మంత్రి మరోసారి సమీక్ష నిర్వహించారు. సవరణ ఉత్తర్వులు జారీ చేసి, ఇప్పుడే రేషనలైజేషన్ చేయాలనే ఆలోచన చేసినట్టు తెలిసింది. బుధవారం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జీవోనే ఇవ్వలేదన్నారు ప్రభుత్వం హేతుబద్ధీకరణ ఉత్తర్వులు ఇవ్వలేదని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. మంగళవారం సచివాలయంలో మంత్రిని కలసిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 27నే జీవో వచ్చిందని తాము పేర్కొనగా, స్కూళ్ల మూసివేత నిబంధనను తొలగిద్దామని మంత్రి చె ప్పినట్టు నేతలు వెల్లడించారు.