breaking news
Non-Life Insurance Premium
-
నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.23,422 కోట్లు
న్యూఢిల్లీ: జీవితేతర బీమా (నాన్ లైఫ్) కంపెనీల ప్రీమియం ఆదాయం జూన్‌లో రూ.23,422 కోట్లుగా ఉంది. 2024 జూన్ నెల ప్రీమియం ఆదాయంతో పోల్చి చూస్తే 5.2 శాతం వృద్ధి చెందింది. కానీ, 2024 జూన్ నెలలో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల ప్రీమియం ఆదాయం 8.4 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ‘‘1/ఎన్ నిబంధనకు మారాల్సి రావడం పరిశ్రమ పనితీరుపై ప్రభావం చూపించింది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్‌లో వృద్ధి సింగిల్ డిజిట్‌కు నిదానించింది. ప్యాసింజర్ వాహన బీమా వృద్ధి ఆగిపోయింది. ఈ ప్రభావాన్ని బీమా సంస్థలు ఇతర వాణిజ్య మర్గాల రూపంలో కొంత వరకు తగ్గించుకోగలిగాయి’’అని కేర్ఎడ్జ్ రేటింగ్స్ తన నివేదికలో వివరించింది. ప్రీమియం వృద్ధి మోస్తరుగానే ఉన్నప్పటికీ 2024–25లో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.3 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించినట్టు గుర్తు చేసింది. నియంత్రణపరమైన మద్దతు, ఇన్సూర్టెక్కు ఆమోదం (టెక్నాలజీ ఆధారిత బీమా సంస్థలు), డిజిటలైజేషన్ వేగవంతం కావడం, మధ్యతరగతి ప్రజలు పెరగడం అనుకూలించినట్టు తెలిపింది. వృద్ధి వేగం ‘‘బీమా ట్రినిటీకి ప్రభుత్వ పరమైన మద్దతుతో నాన్‌లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో వృద్ధి వేగాన్ని అందుకోనుంది. రిటైల్ హెల్త్ విభాగంలో స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు (ఒక్క ఆరోగ్య బీమా సేవలు అందించేవి) తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి’’అని కేర్ఎడ్జ్ తెలిపింది. మోటారు బీమా వృద్ధి విషయమై రానున్న రోజుల్లో వాహన అమ్మకాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, థర్డ్ పార్టీ బీమా టారిఫ్‌ల సవరణను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రతిపాదిత కాంపోజిట్ లైసెన్స్ అమల్లోకి వస్తే మధ్య కాలానికి ఈ రంగంలో పోటీతత్వం పూర్తిగా మారిపోతుందని అభిప్రాయపడింది. 1/ఎన్ నిబంధన అన్నది పాలసీలకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ఆరంభంలోనే కాకుండా.. కాలవ్యవధి మొత్తానికి సమానంగా వెల్లడించడానికి సంబంధించినది. -
నాన్-లైఫ్ బీమా ప్రీమియం వసూళ్లు 86% అప్
న్యూఢిల్లీ: నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల స్థూల ప్రీమియం వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరపు సెప్టెంబర్ నెలలో 86.2% పెరుగుదలతో రూ.14,950 కోట్లకు ఎగసాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో ఈ కంపెనీల ప్రీమియం వసూళ్లు రూ. 8,030 కోట్లుగా ఉన్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏ గణాంకాల ప్రకారం.. మొత్తం ప్రీమియం వసూళ్లలో ప్రభుత్వ రంగ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల వాటా రూ.9,164 కోట్లుగా, ప్రైవేట్ కంపెనీల వాటా రూ.5,786 కోట్లుగా ఉంది. ప్రభుత్వ రంగంలోని యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రీమియం వసూళ్లు రూ.1,797 కోట్లు (105% వృద్ధి)గా, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ ప్రీమియం వసూళ్లు రూ.1,332 కోట్లు (78% వృద్ధి), నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం వసూళ్లు రూ.945 కోట్లు(8% వృద్ధి)గా, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ప్రీమియం వసూళ్లు రూ.1,554 కోట్లు (27% వృద్ధి) ఉన్నాయి. ఇక 23 ప్రైవేట్ కంపెనీల్లో.. హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ప్రీమియం వసూళ్లు రూ.976 కోట్లు (3 రెట్లు వృద్ధి)గా, ఐసీఐసీఐ లంబార్డ్ ప్రీమియం వసూళ్లు రూ.998 కోట్లు (58% వృద్ధి)గా నమోదయ్యాయి. ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ కొత్త ప్రీమియం ఆదాయం రూ.2,000 కోట్లు దక్షిణ సెంట్రల్ జోన్‌కు సంబంధించి ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం అక్టోబర్‌లో 67% వృద్ధితో రూ.2,035 కోట్లకు చేరింది. దక్షిణ సెంట్రల్ జోన్ పరిధిలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు వస్తాయి. ఎల్ఐసీకి దేశంలో ఉన్న 8 జోన్లలోనూ మొత్తం ప్రీమియం ఆదాయంపరంగా దక్షిణ సెంట్రల్ జోన్ 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు జోనల్ మేనేజర్ టి.సి. సుశీల్‌కుమార్ తెలిపారు.