breaking news
nizam college hostel students
-
ప్రభుత్వ ఉత్తర్వులపై నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్థుల ఆగ్రహం ..
-
నిజాం హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ : నిజాం కళాశాల హాస్టల్ విద్యార్థులు రోడ్డెక్కారు. నాసిరకం భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు మంగళవారం ఉదయం రోడ్డుపై బైఠాయించారు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదంటూ విద్యార్థులు ఆరోపించారు. దీంతో భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన విరమించాలని విద్యార్థులకు నచ్చచెబుతున్నారు. మరోవైపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగటంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.