breaking news
nivin Polly
-
దొంగను పట్టిస్తాడా?
...లేక దొంగకు సాయం చేస్తారా మోహన్‌లాల్. దొంగ ఎవరు? అయినా మోహన్‌లాల్ సాయం చేయడం ఏంటీ అనుకుంటున్నారా? ఆ విషయంలోకి వస్తే... రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో నివిన్ పౌలీ, ప్రియా ఆనంద్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కాయాకులమ్ కొచ్చున్నీ’. హైవేపై రాబరీ చేసే దొంగ పాత్రను నివిన్ చేస్తున్నారు. ఓ కీలక పాత్రను మోహన్‌లాల్ చేస్తున్నారు. ఇటీవల ఈ షూటింగ్లో పాల్గొన్న మోహన్‌లాల్ తన లుక్‌ను రివీల్ చేశారు. మరి మోహన్‌లాల్‌కు, దొంగకు ఉన్న లింకేంటీ అనేది తెలియాలంటే థియేటర్స్‌లో బొమ్మ పడేంత వరకు ఆగాల్సిందే. ఈ సినిమా నైన్టీన్త్ సెంచరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. -
కొత్త సంవత్సరం... కొత్త భాష... కొత్త అభిమానులు!
పదిహేనేళ్లు.. యాభై తొమ్మిది సినిమాలు. కానీ, ఇప్పుడే కొత్తగా సినిమాల్లోకొచ్చిన అమ్మాయిలా ఇంకా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు త్రిష. మంచి పాత్రలొస్తే... మరో దశాబ్దం పాటు కథానాయికగా కొనసాగేలా ఉన్నారు. ‘‘కెరీర్‌వైజ్‌గా నేను ఇప్పటికీ సంతృప్తి పడడం లేదు. చేసింది గోరంత.. చేయాల్సింది కొండంత అనే ఫీలింగ్ ఉంది. ‘ఇక చాలు.. ఫుల్‌గా శాటిస్ఫై అయిపోయాం. సినిమాలు మానేద్దాం’ అనే ఫీలింగ్ రాలేదు. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు త్రిష. పదిహేనేళ్లల్లో యాభై తొమ్మిది సినిమాలు చేసిన త్రిష తొలిసారి మలయాళంలో ఓ సినిమా అంగీకరించారు. సూపర్ హిట్ మూవీ ‘ప్రేమమ్’ కథానాయకుడు నివిన్ పాలీ సరసన ఆమె ఓ చిత్రంలో నటించనున్నారు. ఆల్రెడీ నివిన్ హీరోగా ‘ఇవిడె’, ‘ఇంగ్లిష్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్యామ్‌ప్రసాద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. మామూలుగా మలయాళ సినిమాలంటే కథానాయికలకు కూడా కథలో ప్రాధాన్యం ఉంటుంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలు దక్కుతాయి. ఇన్నేళ్లల్లో నటిగా తనను నిరూపించుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోని త్రిష ఈ తొలి మలయాళ చిత్రంలో శక్తిమంతమైన పాత్ర పోషించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది. సో... కొత్త సంవత్సరంలో కొత్త భాషలో కనిపించి, కొత్త అభిమానులను సొంతం చేసుకోనున్నారన్న మాట.