breaking news
Nivea
-
శరీర దుర్వాసనను గుర్తించే యాప్
న్యూయార్క్: సాధారణంగా మన శరీరం నుంచి వచ్చే దుర్వాసనను, చెమట కంపును మనం గుర్తించలేం. ఆ వాసనకు మన ముక్కు అలవాటుపడటమే అందుకు కారణం. దీంతో చుట్టుపక్కలవారు ఇబ్బంది పడుతుంటారు. ఈసమస్యను తీర్చే యాప్‌ను చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారుచేసే సంస్థ నివియా తయారు చేసింది. ‘నోస్’ అనే పేరున్న ఆ యాప్ మన శరీర దుర్వాసనను గుర్తించి మనల్ని హెచ్చరిస్తుంది.యాప్‌ను మరింత పరీక్షించి, త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. -
ఇండియాలోకి అడుగుపెట్టిన నివియా!
రూ.850 కోట్ల పెట్టుబడులతో గుజరాత్లో ప్లాంట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జర్మన్ ఎఫ్ఎంసీజీ కంపెనీ అయిన బైర్స్డోర్ఫ్ ఏజీ కంపెనీ ఇండియాలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ కంపెనీ నివియా బ్రాండ్ పేరుతో బాడీ, ఫేస్, లిప్ వంటి చర్మ సంబంధిత క్రీములను ఉత్పత్తి చేస్తోంది. జర్మన్ అంబాసిడర్ మిచెల్ స్టెన్నర్ గుజరాత్‌లోని సనంద్ ప్రాంతంలో తొలి తయారీ ప్లాంట్‌ను ప్రారంభించారు. రూ.850 కోట్ల పెట్టుబడులతో పెట్టిన ఈ ప్లాంట్‌కు ఏటా 100 మిలియన్ల చర్మ సంబంధిత క్రీములను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని నివియా ఇండియా ప్రై.లి. ఎండీ రక్షిత్ హర్గేవి ఓ ప్రకటనలో తెలిపారు. సమీప భవిష్యత్తులో ఈ ప్లాంట్ నుంచి సబ్బులు, డియోడ్రెంట్లను కూడా ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు.