breaking news
Nikolas Cruz
-
‘ఆ స్కూల్లో 20 మందిని చంపేస్తా’
వాషింగ్టన్: ఫ్లోరిడాలోని పార్క్‌లాండ్ పాఠశాలపై ఫిబ్రవరిలో కాల్పులకు తెగబడి 17 మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్న ఉన్మాది నికోలస్ క్రూజ్ ఆ ఘటనకు ముందు తీసిన వీడియోలు బుధవారం బయటపడ్డాయి. వాటిల్లో పలు విస్మయకర విషయాలు వెల్లడయ్యాయి. మరికొద్దిసేపట్లో తాను ఏం చేయబోతున్నాడో నికోలస్ ఒక వీడియోలో పేర్కొన్నాడు. ‘నేను 2018లో మరో నరహంతకున్ని కాబోతున్నాను. నేను చదువుకున్న మర్జోరీ స్టోన్మాన్ డగ్లస్ పాఠాశాలలో నరమేధం సృష్టించబోతున్నాను. నరమేధం వల్ల నాకు ఎంతో పేరొస్తుంది. గతంలో కాల్పులకు తెగబడి ఉన్మాదం సృష్టించిన వారిని అనుసరించబోతున్నాను. వార్తల్లో నన్ను చూశాక తెలుస్తుంది ఈ ప్రపంచానికి నేనెవరినో..! కనీసం 20 మందిని చంపడమే నా లక్ష్యం. నా వద్ద గల ఏఆర్-15 గన్‌తో రెండు రౌండ్లలో పని ముగించేస్తా. మీరంతా నా చేతుల్లో చావబోతున్నారు’ అంటూ నికోలస్ వికృత దరహాసం చేశాడు. కాగా, నికోలస్ హత్యాకాండకు పాల్పడటానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. నికోలస్ ప్రవర్తన సరిగా లేదని, తుపాకి కూడా కలిగి ఉన్నాడని ఘటనకు ముందు పలు సందర్భాల్లో పోలీసుల అతనిపై అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. వారి అనుమానాలు నిజమయ్యాయి. ఫిబ్రవరి 14న దర్జాగా స్కూల్లోకి ప్రవేశించిన నికోలస్ 17 విద్యార్థులను తన గన్‌తో పిట్టల్ని కాల్చినట్టు కాల్చాడు. మరో 17 మందిని తీవ్రంగా గాయపరిచాడు. అభం శుభం తెలియని పిల్లలను బలితీసుకుని ఉరికంభం ఎక్కబోతున్నాడు. బ్రోవార్డ్ కౌంటీ న్యాయవాదులు నికోలస్‌కు మరణ శిక్ష పడేలా చూస్తామని అన్నారు. కాగా, ఈ వీడియోని బహిర్గతం చేయొద్దని బాధిత కుటుంబాలు మీడియా చానెళ్లను కోరాయి. The Voice of Evil #NikolasCruz pic.twitter.com/2N5mjqVPGn — Carl Stresing (@CarlStresing) May 30, 2018 -
'దెయ్యాలే నాతో ఆ పని చేయించాయి..'
వాషింగ్టన్ : 'నా తలలో ఏవేవో అరుపులు వినిపించేవి. అవి దెయ్యాల అరుపులనుకుంటా. అవే నాకు కాల్పులు ఎలా జరపాలో చెప్పాయి' ఈ మాటలు ఫ్లోరిడా స్కూల్లో కాల్పులకు తెగబడిన ఉన్మాది పోలీసులకు చెప్పాడు. ఫ్లోరిడాలోని హైస్కూల్లో అదే స్కూల్లో గతంలో చదివిన నికోలస్ క్రజ్ అనే యువకుడు ఉన్మాదిగా మారి కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు స్కూల్ సిబ్బంది సహా 17మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు పాల్పడిన నికోలస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు పోలీసులకు పై విధంగా సమాధానం చెప్పాడు. తన మానసిక పరిస్థితి ఎప్పుడూ చాలా ఆందోళనగా ఉండేదని, ఎవరో తనను పిలిచినట్లుగా అనిపిస్తుండేదని, తనకు పుర్రెల్లో రకరకాల శబ్దాలు వినిపిస్తుండేవని పోలీసులకు చెప్పాడు. వాటిని తాను దెయ్యాలుగా భావిస్తున్నానని, అవే తనకు ఆదేశాలు చేశాయని ఆ క్రమంలోనే కాల్పులకు తెగబడినట్లు అతడు పోలీసులకు చిత్ర విచిత్రమైన సమాధానాలు చెబుతున్నాడు.