breaking news
in nidamarru
-
సాధికార సర్వేకు సహకరించండి
నిడమర్రు : సాధికార సర్వే నూరుశాతం పూర్తయ్యేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని మండల ప్రత్యేక అధికారి, డ్వామా పీడీ వై. ఆనంద్ కుమారి చెప్పారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో స్మార్ట్ పల్స్ సర్వేపై ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఆనంద్‌కుమారి మాట్లాడుతూ ఈనెల 13 వరుకూ ఈ స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు ఎం.సుందర్రాజు, ఎంపీడీవో డి.దామోదరావు, డీటీ ఎస్ఎం ఫాజిల్, ఎంపీపీ నిమ్మల మాణిక్యాలరావు, జెడ్పీటీసీ సభ్యులు వి.దివాకరరావు, వైస్ ఎంపీపీ టి.నక్షత్రం తదితరులు పాల్గొన్నారు. -
జయహో సింధు
బావాయిపాలెం (నిడమర్రు): రియో ఒలిపింక్స్‌లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో విద్యార్థులు అక్షరాభివందనం చేశారు. జయహో సింధు ఇంగ్లిష్ అక్షరాకృతిలో ఒదిగి నీరాజనాలు పలికారు. పతకం సాధించి సోమవారం స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా సింధు విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని సాధన స్కూల్ ప్రిన్సిపాల్ కంభంపాటి ప్రసాద్ తెలిపారు.