breaking news
Nicholas Sarkozy
-
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి మూడేళ్ల జైలు శిక్ష
పారిస్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి ఆ దేశ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆర్థిక విషయాలపై కోర్టులో ఉన్న సమాచారాన్ని అందించేందుకు బదులుగా మొనాకోకు చెందిన న్యాయమూర్తి గిల్బర్ట్ అజిబర్ట్‌కి పదోన్నతి కల్పించారన్న ఆరోపణల నేపథ్యంలో సర్కోజీకి ఈ శిక్ష పడింది. సర్కోజీపై ఆరోపణలతో ఏకీభవించిన ఫ్రెంచ్ న్యాయస్థానం సోమవారం అతన్ని దోషిగా తేల్చింది. సర్కోజీకి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ.. ఆ దేశ నిబంధనల ఏడాది మాత్రమే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాగా, ఈ తీర్పుపై అపీల్ చేసుకునేందుకు ఆయనకు కోర్టు పది రోజుల గడువు ఇచ్చింది. నికోలస్ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2007 ఎన్నికల ప్రచారంలో ఆయన భారీ ఆర్థిక సహాయం పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిబియా నుంచి ఆర్థిక సహాయం పొందారన్న ఆరోపణలపై దర్యాప్తు సందర్భంగా సర్కోజీ, ఆయన న్యాయవాది థియరీ హెర్జోగ్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలు అప్పట్లో సంచలనం రేపాయి. (చదవండి: 2024లో మళ్లీ వస్తా: ట్రంప్) -
మాజీ ప్రెసిడెంట్‌కు ఎదురుదెబ్బ
పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీకి ఎదురుదెబ్బ తగిలింది. 2017 మే లో జరిగనున్న ఎన్నికల్లో మరోసారి ప్రెసిడెంట్ పదవిపై కన్నేసిన ఆయన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. యాంటీ ఇమ్మిగ్రేషన్ అంశాన్ని నమ్ముకొని ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన ఆయనకు ఊహించని షాక్ తగిలింది. ప్రైమరీ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఫ్రాంకోయిస్ ఫల్లాన్ చేతిలో నికొలస్ సర్కోజీ ఓటమి పాలయ్యారు. ఓటమి అనంతరం తదుపరి రౌండ్లో తాను ఫిల్లాన్ను సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఓటమిపై ఎలాంటి బాధ లేదని ఆయన ప్రకటించారు. రెండో రౌండ్లో మరో మాజీ ప్రధాని అలైన్ జుప్పీతో ఫిల్లాన్ తలపడనున్నారు. వీరిలో విజయం సాధించిన వారు మే లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి మరైన్ లీ పెన్‌తో తలపడే అవకాశం ఉంది.