breaking news
new managing directors appointments
-
ఎస్బీఐ ఎండీలుగా స్వామినాథన్, తివారీ బాధ్యతలు
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్లు్లగా(ఎండీ) గురువారం స్వామినాథన్ జే, అశ్వినీ కుమార్ తివారీ బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లపాటు వీరు ఈ బాధ్యతల్లో కొనసాగుతారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్‌లోనే స్వామినాథన్, తివారీల నియామకానికి బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) సిఫారసు చేసింది. ఎస్బీఐ చైర్మన్‌కు నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు సహాయ సహకారాలను అందిస్తారు. సీఎస్ శెట్టి, అశ్వినీ భాటియాలు ప్రస్తుతం ఎండీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజా బాధ్యతలకు ముందు స్వామినాథన్ ఎస్బీఐ ఫైనాన్స్ విభాగంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇక తివారీ ఇప్పటి వరకూ ఎస్బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహించారు. -
ఏడు ప్రభుత్వ బ్యాంకులకు కొత్త సారథులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్లను, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను నియమించింది. క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ నియామకాలకు ఆమోదం తెలిపింది. వివరాలు... ► ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న రాజ్‌కిరణ్ రాయ్ తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ఈయన పదవీకాలం మూడేళ్లు. ► కార్పొరేషన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న సునీల్ మెహతా తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఉన్న ఉషా అనంత సుబ్రమణియన్ తాజాగా అలహాబాద్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ఈమె 2018, ఆగస్ట్ 31 వరకు పదవిలో కొనసాగనున్నారు. ► ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న సుబ్రమణియ కుమార్ అదే బ్యాంక్ ఎండీ, సీఈవోగా 2019 జూన్ 30 వరకూ పదవిలో కొనసాగనున్నారు. ► కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న దీనబంధు మొహపత్ర ఇకపై బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపడతారు. ► సిండికేట్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఎం.ఒ.రెగో నియమితులయ్యారు. ఈయన ఇప్పటిదాకా బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్‌గా ఉన్నారు. ► ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న ఆర్.ఎ.శంకర నారాయణన్ తాజాగా విజయా బ్యాంక్ ఎండీ, సీఈవోగా వ్యవహరించనున్నారు.