ఆయిల్ ట్యాంకర్ బోల్తా
గోపాలపురం : పామాయిల్ లారీ ట్యాంకర్ బోల్తాపడి డ్రై వర్ తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం తెల్లవారుజామున స్థానిక పొగాకు బోర్డు సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ నుంచి హైదరాబాద్ పామాయిల్ లోడుతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ గొల్లగూడెం దాటి పొగాకు బోర్డు సమీపం వద్ద మలుపులో అదుపు తప్పి రోడ్డు మార్జిన్లో బోల్తా పడింది. దీంతో లారీ డ్రై వర్ కె. రమేష్ కాలు, తలకు గాయాలు కావడంతో అతనిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారుతున్న ఆయిల్‌ను వేరే ట్యాంకులోకి ఎక్కించడానికి యత్నాలు చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.