breaking news
NAVYANDRA
-
నవ్యాంధ్ర నవరసాల రాజధాని కావాలి
గజల్ శ్రీనివాస్ ఆకాంక్ష కొత్తపేట : నవ్యాంధ్రలో వివిధ కళా సంస్థలు ఏర్పాటు చేసి నవరసాల రాజధానిగా రూపుదిద్దాలని గజల్ గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతి అభివృద్ది ఎంత అవసరమో కళలకు ప్రోత్సాహం కూడా అంతే అవసరమన్నారు. శాస్త్రీయ సంగీతం, నాట్యం, శిల్పం తదితర కళలను ప్రోత్సహించాలని కోరారు. ప్రముఖ వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పంచలోహ విగ్రహాన్ని నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) సౌజన్యంతో గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళంపల్లి స్వగ్రామమైన రాజోలు నియోజకవర్గం శంకరగుప్తంలో నెలకొల్పనున్నారు. కొత్తపేటలో ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్‌వుడయార్ రూపొందిస్తున్న విగ్రహం నమూనాను గురువారం సాయంత్రం శ్రీనివాస్ పరిశీలించారు. అచ్చం బాలమురళీకృష్ణ సంగీతం ఆలపిస్తున్నట్టుగానే విగ్రహాన్ని మలిచారని రాజ్‌కుమార్‌ను అభినందించారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పర్యవేక్షణలో మార్చి 3న జరిగే మంగళంపల్లి గుడి, విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, నాట్స్ అధ్యక్షుడు మోహ¯ŒS మన్వా ముఖ్యఅతిథులుగా పాల్గొంటారని శ్రీనివాస్ విలేకరులకు చెప్పారు. అదే రోజు నాట్స్–గజల్ శ్రీనివాస్ కళాపరిషత్‌ల ఆధ్వర్యంలో బాలమురళీకృష్ణ సంగీత ఆరాధనోత్సవాలు నిర్వహిస్తామన్నారు. మార్చి 5న వకుళమాత ఆలయ శంకుస్థాపన తిరుపతి సమీపంలోని పేరూరులో వెంకటేశ్వరస్వామి తల్లి వకుళమాత ఆలయం పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ తెలిపారు. ఆ దిశగా 40 ఎకరాలు సేకరించగా టీటీడీ రూ.4 కోట్ల విడుదలకు సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. మార్చి 5న పరిపూర్ణానందస్వామి పర్యవేక్షణలో జరిగే శంకుస్థాపనలో ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పీఠాధిపతులు పాల్గొంటారన్నారు. ర్యాలి ప్రసాద్‌కు పురస్కారద్వయం కాకినాడ కల్చరల్ : ప్రముఖ కవి, ‘నవరసం’ వెబ్ పత్రిక సంపాదకుడు ర్యాలి ప్రసాద్ రెండు పురస్కారాలు అందుకోనున్నారు. ఆయన రాసిన ‘అతను’ కవిత విజయవాడ నుంచి వెలువడే ‘ఉపాధ్యాయ’ మాసపత్రిక వార్షిక కవితా పురస్కారానికి ఎంపిక కాగా..‘పరివర్తనం’ కవిత హైదరాబాద్ ఏజీ ఆఫీస్ ఏటా జాతీయస్థాయిలో నిర్వహించే వచన కవితా పోటీల్లో పురస్కారానికి ఎంపికైంది. ప్రసాద్ గతంలో ‘పునాసనీడ, తదనంతరం, కుంకుమరేఖ, మట్టి’ వంటి కవితా సంకలనాలు వెలువరించారు. అక్షరానికి పసనూ, పరిమళాన్నీ సంతరిస్తూ ఆయన రాసిన అనేక కవితలు ఎన్నో పోటీల్లో బహుమతులను అందుకున్నాయి. ప్రశంసలు పొందాయి. తాజాగా మరో రెండు పురస్కారాలు అందుకోనున్న సందర్భంగా ఆయనను పలువురు సాహితీవేత్తలూ కవిత్వాభిమానులూ అభినందించారు. -
నవ్యాంధ్ర రాజధానిలో కాస్ట్లీ వ్యభిచారం
రాజధానిలో బిగ్‌షాట్స్‌కు వాట్సప్‌లో వల ‘మీకు ఎవరు కావాలి? ముంబయి మోడళ్లా..? ఢిల్లీ భామలా..? లేక సినిమా ఆర్టిస్టులా..? లేదా బుల్లితెర అందగత్తెలా..? ఎవరైనా సిద్ధం.. విందు వినోదాలకు కూడా అమ్మాయిలు రెడీ... ఎవరి రేటు వారిదే...కర్ణాటక, తమిళనాడు, పూణే, నాగాలాండ్ ప్రాంతాలకు చెందిన అందమైన అమ్మాయిలూ సిద్ధంగా ఉన్నారు... మీరు సరే అనడమే ఆలస్యం...’ ఇదీ... మంగళగిరి ప్రాంతంలోని పలువురు ధనవంతుల సెల్ ఫోన్లకు వస్తున్న మెస్సేజీల సారాంశం. రాజధాని నేపథ్యంలో ఖరీదైన ప్రాంతంగా మారిన ఇక్కడ అంతే కాస్ట్లీ వ్యభిచారం సాగుతోంది.అధికార పార్టీ నేత అండతో ఓ మహిళ ఈ వ్యవహారాన్ని నడిపించడం గమనార్హం. రాజధానిగా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోక మునుపే ఇటువంటి వికృతాలకు కేంద్రం కావడం దురదృష్టకరం. ⇒ ఇతర రాష్ట్రాల నుంచి మోడళ్ల దిగుమతి ⇒ గంటకు రూ.10 వేలకు పైగా వసూలు ⇒ మంగళగిరి చుట్టుపక్కల జోరుగా వ్యభిచారం ⇒ టీడీపీ నేత అండతో ఓ మహిళ నిర్వాకం ⇒ ‘సాక్షి’ చేతికి చిక్కిన ఫోన్ సంభాషణ సాక్షి, అమరావతి బ్యూరో: నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని మంగళగిరి కేంద్రంగా హైటెక్ వ్యభిచారం సాగుతోంది. ముంబయి మోడళ్లు, తెలుగు సినీ ఆర్టిస్టులు, బుల్లితెర నటులు, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొస్తున్న వ్యభిచార కేంద్రాల నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని గుట్టుగా వ్యాపారం సాగిస్తున్నారు. ఖరీదైన వ్యక్తులను ఎంపిక చేసుకుని వారి ఫోన్లకు వాట్సప్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలు పంపించి వారిని ముగ్గులోకి దించి నిత్యం లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. టీడీపీ ముఖ్య నేత అండతోనే.. ! ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో హైటెక్ వ్యభిచార గృహాలు నిర్వహించడంలో ఓ మహిళ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె గతంలో బీజేపీలో ఉన్నారు. అప్పట్లో మంగళగిరి ఇందిరానగర్‌లో కొంతకాలం అసాంఘిక కార్యకలాపాలు జరిపిస్తుండగా, పోలీసులు కేసులు కూడా నమోదుచేశారు. అప్పట్లో ఆమె ఓ బీజేపీ నాయకుడి అండతో వ్యభిచార గృహం నడిపేవారు. ఆ నేత పోలీసులను మ్యానేజ్ చేయలేకపోవడంతో ఏకంగా ఆమె బీజేపీని వీడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ నియోజకవర్గ నేత పంచన చేరారు. ప్రస్తుతం ఆయన కనుసన్నల్లో ఆమె హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ప్రతిఫలంగా ఆ నాయకుడికి నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్లు తెలిసింది. బోనస్‌గా అందమైన అమ్మాయిలను పంపిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు ఖరీదైన వ్యక్తులు.. మరోవైపు అధికార పార్టీ నేత అండ ఉండడంతో ఆమెను పోలీసులు ఏమీ చేయలేక నెలకు రూ.లక్ష వరకు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు సమాచారం. సినీ, టీవీ ఆర్టిస్టుల రాక.. ముంబయి మోడళ్లతోపాటు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, పూణే, నాగాలాండ్ ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సినీ, టీవీ ఆర్టిస్టులను కూడా ఆమె పిలిపించి వ్యాపారం చేయిస్తున్నారు. మోడళ్లను ప్రత్యేకంగా పిలిపించి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల వద్దకు పంపిస్తున్నారు. ఇందుకుగాను గంటకు రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ఖరీదైన వ్యక్తులకైతే వారి విందు, వినోదాలకు పంపించి లక్షలాది రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. చాలా మంది రాజకీయ నాయకులు తమ విందు, వినోదాలకు మోడళ్లను పంపాలని కోరుతున్నట్లు తెలిసింది. అపార్టుమెంట్లలో యథేచ్ఛగా... విజయవాడ, గుంటూరు నగరాలకు మధ్యలో ఉన్న మంగళగిరి రాజధాని ప్రాంతంలో కీలకమైంది. ఆ ప్రాం తం లో రియల్ భూమ్ పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు వ్యాపారవేత్తలు, రాజకీయనేతలు నివాసాలు ఉండేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తున్నా యి. ఈ క్రమంలో అసాంఘిక కార్యకలాపాల జోరు ఈ ప్రాంతాల్లో పెరిగింది. జాతీయ రహదారి సమీపాన మంగళగిరి, సీతానగరం, తాడేపల్లి ప్రాంతాల్లో ఖరీదైన అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకుని హైటెక్ వ్యభిచారం సాగిస్తున్నారు. టెక్నాలజీతోనే వ్యాపారం.. హైటెక్ వ్యభిచారానికి టెక్నాలజీని పూర్తిస్థాయిలో వాడుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలు రాగానే వారి ఫొటోలను తమ కస్టమర్లకు వాట్సప్ ద్వారా పంపిస్తారు. వారు నచ్చారని తిరిగి మెసేజ్ పంపితే, ఆ తర్వాత రేటు చెబుతారు. యువతి అందచందాలను బట్టి రేటు నిర్ణయిస్తారు. నచ్చితేనే అపార్ట్మెంటు వద్దకు వాలిపోవాలి. అపార్ట్మెంటు వద్దకు వెళ్లి యువతులను చూసి వస్తానంటే అంగీకరించరు. ఆన్లైన్లోనే వ్యాపారం సాగి స్తారు. ఒకవేళ నచ్చిన అమ్మాయిని బయట ప్రాంతాలకు తీసుకువెళ్లాలంటే ఆ మహిళా నేత భర్తే వాహనం సమకూరుస్తారు. ఆయనే డ్రైవర్ అవతారమెత్తి కస్టమర్ చెప్పిన ప్రదేశానికి తీసుకెళ్తాడు. వ్యభిచారం నిర్వాహకులు ఓ వ్యక్తితో వ్యాపారంపై జరిపిన ఫోన్ సంభాషణ ‘సాక్షి’ చేతికి చిక్కింది.