breaking news
navodya school
-
‘మీ మైండ్ సెట్ మార్చుకోండి’.. విజయ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమిళనాడలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై జరుగుతున్న న్యాయపోరాటంలో సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడ గడ్డపై హిందీ బోధించకూడదనే ధోరణి కుదరదని, రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.జవహర్ నవోదయ పాఠశాలల ఏర్పాటుకు ప్రతి జిల్లాలో భూమిని కేటాయించాలంటూ డిసెంబర్ 15, 2025న ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆగర్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. కేంద్ర నిధులతో నడిచే నవోదయ పాఠశాలల ఏర్పాటును రాష్ట్రంలోని విద్యా వ్యవస్థకు ముప్పుగా భావించవద్దని సూచించింది. మీరు మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. తమిళనాడ నేలపై హిందీ నేర్పించబడదు అనడం సరికాదు" అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. అలాగే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర చర్చల ద్వారా ఈ భేదాభిప్రాయాలను పరిష్కరించుకోవాలని కోర్టు హితవు పలికింది.నవోదయ పాఠశాలల ఏర్పాటు కోసం ప్రతి జిల్లాలో భూమిని గుర్తించాలన్న డిసెంబర్ 2025 నాటి ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. అయితే, ఈ ఆదేశాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరో మూడు నెలల సమయం మంజూరు చేసింది.తమిళనాడులో అమల్లో ఉన్న ద్విభాషా విధానానికి, నవోదయ పాఠశాలలు పాటించే త్రిభాషా విధానానికి (హిందీతో కలిపి) మధ్య ఉన్న వివాదంపై విచారణ జరిగింది.రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. తమ రాష్ట్ర విద్యా విధానానికి, రాజ్యాంగ అధికారాలకు విరుద్ధంగా కేంద్రం హిందీని రుద్దాలని చూస్తోందని తెలిపారు. తమిళం రెండవ భాషగా ఉండాలనే అంశాన్ని పరిశీలించవచ్చని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు ఈ అంశంపై చర్చలు జరపాలని సూచించిన కోర్టు, ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. -
నవోదయ విద్యార్థి ఆత్మహత్య
ఖర్గోన్: చదువు ఒత్తిడిని భరించలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ నవోదయ స్కూల్లో 8 వతరగతి చదువుతున్న ఆర్యన్ మన్శారే(14) గురువారం బాత్రూంలో ఉరి వేసుకున్నారు. వార్షిక పరీక్షల ఒత్తిడి తట్టుకోలేకనే ఆర్యన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఖర్గోన్ పోలీస్ అధికారులు తెలిపారు. స్నానానికి బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకుంటున్న ఆర్యన్ చూసిన తోటి విద్యార్థి ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే బాలున్ని సనావాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆర్యన్ గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరక లేదని, ఆర్యన్ తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఖర్గన్ ఎస్పీ డి. కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు.


