నవోదయ విద్యార్థి ఆత్మహత్య | 14-yr old student commits suicide | Sakshi
Sakshi News home page

నవోదయ విద్యార్థి ఆత్మహత్య

Mar 3 2017 2:31 PM | Updated on Nov 9 2018 4:36 PM

చదువు ఒత్తిడిని భరించలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఖర్గోన్‌: చదువు ఒత్తిడిని భరించలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ నవోదయ స్కూల్లో 8 వతరగతి చదువుతున్న ఆర్యన్‌ మన్శారే(14) గురువారం బాత్‌రూంలో ఉరి వేసుకున్నారు. వార్షిక పరీక్షల ఒత్తిడి తట్టుకోలేకనే ఆర్యన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఖర్గోన్‌ పోలీస్‌ అధికారులు తెలిపారు.

స్నానానికి బాత్‌రూంలోకి వెళ్లి ఉరి వేసుకుంటున్న ఆర్యన్‌ చూసిన తోటి విద్యార్థి ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే బాలున్ని సనావాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.  ఆర్యన్‌ గదిలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ దొరక లేదని, ఆర్యన్‌ తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఖర్గన్‌ ఎస్పీ డి. కళ్యాణ్‌ చక్రవర్తి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement