breaking news
National labor unions
-
సార్వత్రిక సమ్మెకు ఆర్టీసీ యూనియన్ల మద్దతు
అమరావతి : జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబరు 2న జరిపే సార్వత్రిక సమ్మెకు ఆర్టీసీ యూనియన్లు సంఘీభావం ప్రకటించాయి. ఈ మేరకు వైఎస్సార్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లు బుధవారం వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశాయి. రోడ్ సేఫ్టీ బిల్లు పేరుతో ఎంవీ యాక్టు మార్పుచేయడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థలకు ఇబ్బందులు తలెత్తుతాయని, రవాణా బిల్లును పార్లమెంట్లో అడ్డుకోవాలని ఎంపీలకు యూనియన్ నేతలు వినతి చేశారు. సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ విధులకు ఎర్ర బ్యాడ్జీలు ధరించి హాజరవుతామని నేతలు పేర్కొన్నారు. వైఎస్సార్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నేత రాజారెడ్డి, నేషనల్ మజ్దూర్ యూనియన్ నేత చంద్రయ్యలు వేర్వేరు ప్రకటనలు జారీ చేశారు. -
సమ్మె సక్సెస్
వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్ డిపోలకే పరిమితమైన బస్సులు ఆర్టీసీకి రూ.90 లక్షల నష్టం నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. రూ.3 కోట్లు నష్టం హన్మకొండ : ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం కార్మికులు చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. అన్ని రంగాలు, సంస్థలకు చెందిన కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బంద్ వాతావరణం నెలకొంది. ఒక రోజు సమ్మెను విజయవంతం చేసి తమ నిరసన, వ్యతిరేకతను కార్మిక సంఘాలు ప్రభుత్వానికి గట్టిగా వినిపించాయి. జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు మూ సి వేశారు. సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొనడంతో జిల్లాలోని 9 డిపోల్లో ఉన్న 940 బస్సులు కదలలేదు. వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ రూ.90 లక్షల ఆదాయం కోల్పోయింది. ఆర్టీసీలోని టీఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ సమ్మెలో పాల్గొనగా ఎన్ఎంయూ దూరంగా ఉంది. ప్రైవేటు విద్యాసంస్థల డ్రైవర్లూ సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణికి రూ.3 కోట్ల నష్టం భూపాలపల్లి ఏరియా గనుల్లో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా సంస్థకు రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది. బ్యాంకులు, తపాల శాఖ కార్యాలయాలు మూసివేశారు. హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు మధ్యాహ్నం భోజన సమయంలో ధర్నాచేశారు. తపాల ఉద్యోగులు హన్మకొండ ప్రధాన తపాల కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో ధర్నా చేశారు. డీసీసీబీ ఉద్యోగులు హన్మకొండలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇదే క్రమంలో బ్యాంకు ఉద్యోగులు, ఇతర రంగాలకు చెందిన కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.