breaking news
nation news
-
Solar Eclipse 2024: భారత్‌లో కనిపిస్తుందా? లేదా?
-
క్షమించండి... 4న హాజరవుతా
న్యూఢిల్లీ: నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్‌ను రద్దు చేయాలని సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాయ్‌ని అరెస్ట్‌చేసి మార్చి 4వ తేదీన తన ముందు హాజరుపరచాలని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం బుధవారం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా రూ.25 వేల కోట్ల సమీకరణ, మదుపరులకు పునః చెల్లింపుల్లో వైఫల్యం కేసులో సెబీ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్లను విచారిస్తున్న సుప్రీం ఈ అంశంపై రాయ్ తీరును తీవ్రంగా తప్పుపడుతోంది. తాను స్వయంగా సమన్లు జారీ చేసినా రాయ్ పట్టించుకోకపోవడంతో బుధవారం అరెస్ట్ వారంట్ ఇచ్చింది. దీనిపై గురువారం రాయ్ రికాల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ధర్మాసనం ముందు హాజరుకాకపోవడంపట్ల బేషరతు క్షమాపణలు చెప్పిన ఆయన, అరెస్ట్ వారంట్ రద్దు కోరారు. కోర్టు ముందు వ్యక్తిగతంగా ఎప్పుడైనా హాజరుకావడానికి తాను సిద్ధమని రాయ్ విన్నవించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు రాయ్ అరెస్ట్‌కు సుప్రీం వారంట్‌తో ఢిల్లీ పోలీసులు లక్నో చేరుకున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో రాయ్ రికాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎటువంటి రూలింగ్ ఇస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది. -
‘కాంగ్రెస్, ఎన్సీపీ డెరైక్షన్లోనే...’
సాక్షి, ముంబై: కాంగ్రెస్, ఎన్సీపీ డెరైక్షన్లోనే మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే టోల్ నాటకానికి తెర తీశారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. టోల్ విధానంలో పారదర్శకత తీసుకురావాలన్న డిమాండ్‌తో బుధవారం రాష్ర్టవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన రాజ్‌ఠాక్రే దమ్ముంటే అరెస్టు చేయమని సర్కార్‌కు సవాల్ విసరడం అంతా నాటకమేనని విమర్శించారు. మంగళవారం సామ్నా సంపాదకీయంలో రాజ్‌ఠాక్రే తీరుపై మండిపడ్డారు. ‘కాంగ్రెస్ నేత సలీం, ఎన్సీపీ నేత జావేద్ స్క్రిప్ట్ మేరకే కథనాయకుడు రాజ్ ఆడుతున్నాడు. దైర్యముంటే అరెస్టు చేయాలని అంటున్నారు. అయితే సంకెళ్లు వెయ్యడానికి ధైర్యం చూపించాల్సిన అవసరం ఏముంద’ని ప్రశ్నించారు. ఈ నాటకంలో రాజ్ చేసిన గర్జన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని, ఇక చివరగా అరెస్టు క్లైమాక్స్ అని ఉద్దవ్ అభివర్ణించారు. ఈ ఆందోళన, రాస్తారోకోలన్నీ ముందు నుంచి ప్లాన్ చేసి చేస్తున్నవేనని, పాత నాటకాన్నే కొత్తగా మళ్లీ ప్రకటించారన్నారు. ‘నన్ను అరెస్టు చేయండి’ అనే ఈ నాటకం విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. దీనికి అజిత్ పవార్, ఆర్.ఆర్.పాటిల్, సీఎం పృథ్వీరాజ్ చవాన్లలో ఎవరో ఒకరు గంట కొట్టగానే పరదాలు ఎత్తివేసి నాటకాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెన్నెస్‌కు చురకలంటించారు. టోల్ రద్దు చేయాలని సీఎంను కోరిన ఎన్సీపీ.. రాష్ట్రంలోని రెండు లేన్ల రహదారులతోపాటు ఫ్లై ఓవర్లపై వసూలు చేసే టోల్‌ను పూర్తిగా రద్దు చేయాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు భాస్కర్ జాదవ్ కోరారు.