breaking news
Narayana (55)
-
యూస్‌లెస్ ఫెలో... గెటవుట్...!
-
ఆగని ఆత్మహత్యలు
అప్పులబాధతో 12 మంది రైతుల బలవన్మరణం.. సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. తమకున్న భూముల్లో కొందరు, కౌలు తీసుకొని మరికొందరు రైతులు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి అష్టకష్టాలు పడి పంటలు సాగు చేస్తున్నా.. చేతికందకపోవడంతో మనస్తాపానికి గురవుతున్నారు. ఇలా ఏడాదికేడాది అప్పులు పెరిగి లక్షలకు చేరుకుంటుండటం, పంటలు సరిగా పండకపోవడంతో అప్పుల్ని తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. శనివారంరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు వేర్వేరు చోట్ల 12 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా తాడూరు మండలం గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన రైతు, సర్పంచ్ నీలమ్మ భర్త అయిన జి. నారాయణ(55), పాన్‌గల్ మండలంలోని మల్లాయిపల్లి గ్రామానికి చెందిన సాయిరెడ్డి(55), పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామానికి చెందిన గొల్ల పెద్ద మన్నెం(48) భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు. ఈ ఏడాది నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకొని వేరుశనగ పంటలను సాగుచేశాడు. సాగు కోసం, ఇంటి అవసరాలకోసం, కౌలు చెల్లించడం, మొదలగు వాటికోసం రూ. నాలుగు లక్షల దాక అప్పులు అయ్యాయి. అప్పులు తీర్చలేక పొలంలోనే పురుగుమందు తాగాడు. ఆరు నెలల్లో 8 బోర్లు... కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేటకు చెందిన గడ్డం ఉప్పులూటి చిన్నరాజారెడ్డి(50)కి మూడెకరాల 30 గుంటల భూమి ఉంది. మొక్కజొన్న, పసుపు పంట వేశాడు. బావి ఎండిపోవడంతో బోర్లు వేసి పంటలు కాపాడుకుందామని ఆరు నెలల్లో ఎనిమిది బోర్లు వేయించాడు. ఎందులోనూ చుక్కనీరు పడలేదు. గతంలో కుమార్తె పెళ్లి కోసం రూ.5 లక్షలు అప్పు చేశాడు. ఈ అప్పులతోపాటు బోర్లు వేసినందుకు, పెట్టుబడికి అయిన అప్పులు తీర్చే మార్గం కనిపించక కలత చెందిన అతడు ఆదివారం ఉదయం పసుపు చేను వద్దకు వెళ్లి విషపు గుళికలు మింగాడు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కట్కూర్‌కు చెందిన పంజా లక్ష్మి(45), రామడుగు మండలం వెలిచాల పంచాయతీ పరిధిలోని కిష్టారావుపల్లికి చెందిన గుర్తూరి రమేష్(35), వరంగల్ జిల్లా గూ డూరు మండలం చిర్రకుంట తండాకు చెందిన జరుపుల శ్రీను (30), రేగొండ మండలం కనిపర్తి గ్రామానికి చెందిన రైతు నడపిల్లి అర్జున్‌రావు (65), రంగా రెడ్డి జిల్లా పరిగి మండలం రూప్ఖాన్పేట్కు చెందిన నల్లముసలి అంజిలయ్య(40), నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం లింగోటం గ్రామానికి చెందిన దుబ్బ కృష్ణ (36) బలవన్మరణాలకు పాల్పడ్డారు. కూలీగా మారి.. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కొబ్బాయి గ్రామానికి చెందిన రైతు గేడాం జనార్దన్(24) తమకున్న 5 ఎకరాల భూమిలో ఈ ఏడాది పత్తి, కొంత కంది పంట వేశాడు. ఇందుకోసం బేల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ. లక్ష మేర అప్పు చేశాడు. పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో చేసిన అప్పు తీర్చలేనని స్థానిక మరో రైతు వద్ద 15 రోజుల క్రితం కూలీగా జీతానికి ఉన్నాడు. ఆదివారం చేనులో కంది పంటకు పురుగుల మందు పిచికారీ చేస్తానని వెళ్లాడు. ఆశాజనకంగా లేని పంటలను చూసి దిగాలుతో అదే పురుగుల మందు తాగాడు. బావిలో దూకిన మహిళారైతు గార్ల మండలం కొత్తపోచారం గ్రామ రైతు అంగిరేకుల మంగమ్మ(40) అనే రైతు తనకున్న 3 ఎకరాలతో పాటు, మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని 5 ఏళ్లుగా వ్యవసాయబావి ఆధారంగా పత్తి, మిర్చి, వరి పంటలు సాగు చేస్తోంది. ఏటా పంటలు చేతికొచ్చే దశలో బావిలో నీరు ఇంకిపోరుు పంటలు ఎండిపోతున్నారుు. ఇలా రూ. 6 లక్షల మేర అప్పు అయ్యింది. దీనికి తోడు ఇటీవల వ్యవసాయ మోటార్‌కు విద్యుత్ అందించే ట్రాన్స్ఫార్మర్ కాలిపోరుుంది. నీళ్లు లేక పత్తి ఎండిపోరుుంది. అప్పుతీర్చే మార్గం లేక బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి ఇద్దరు కుమారులు అవిటివారు కాగా, ఓ కూతురు ఉంది. భర్త శ్రీను ఫిర్యాదు మేరకు గార్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.