breaking news
Namami Gange Scheme
-
ప్రైజ్‌మనీని విరాళం ఇచ్చిన మోదీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి.. దక్షిణా కొరియా ప్రభుత్వం ప్రతిష్టాత్మక సియోల్ శాంతి బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డు ద్వారా వచ్చిన కోటిన్నర ప్రైజ్‌మనీని ‘నమామీ గంగే ఫండ్’కు విరాళంగా ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అంతేకాక తనకు వచ్చిన అవార్డును భారతీయులకు అంకింతం చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ అవార్డు నాకు దక్కిన వ్యక్తిగతమైన గౌరవం కాదు. ఇది దేశ ప్రజలకు చెందుతుంది.. గత ఐదేళ్లలో భారత్ సాధించిన ప్రగతికి ఈ అవార్డు నిదర్శనం. 130 కోట్ల మంది భారతీయుల సత్తాకు ఈ అవార్డు అంకితమిస్తున్నాను’ అన్నారు మోదీ. -
సమష్టి పోరుతోనే ఉగ్ర నిర్మూలన
న్యూఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా పోరాడాలని భారత్, నెదర్లాండ్స్ పిలుపునిచ్చాయి. ఉగ్రవాదుల ప్రాబల్యం, ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి, సీమాంతర ఉగ్రవాద నియంత్రణకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ గురువారం ప్రధాని మోదీతో చర్చలు జరిపారు మతం, జాతి, తెగ, వర్గాలతో ఉగ్రవాదాన్ని ముడిపెట్టొద్దని ఇరువురు నేతలు ఉద్ఘాటించారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలు దక్షిణాసియాలో శాంతికి ముప్పుగా పరిణమించాయని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. అణు సరఫరా బృందం(ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వానికి నెదర్లాండ్స్ మద్దతిస్తుందని రూట్ తెలిపారు. మన బంధం మరింత బలపడాలి.. వాణిజ్యం, వ్యవసాయం, ఇంధన వనరులు తదితర రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, నెదర్లాండ్స్ నిర్ణయించాయి. ఇండియా–డచ్ సీఈవోల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నాక మోదీ, రూట్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ‘అంతర్జాతీయ సౌర కూటమిలో చేరాలని నెదర్లాండ్స్‌ను గతంలోనే ఆహ్వానించాను. గురువారం వారు అందులో సభ్య దేశంగా చేరారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను’ అని మోదీ అన్నారు. భారత్‌లో అత్యధికంగా విదేశీ పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో నెదర్లాండ్స్ మూడో స్థానానికి చేరిందని వెల్లడించారు. భారత్‌లో కల్పిస్తున్న కొత్త అవకాశాల పట్ల డచ్ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని నరేంద్ర మోదీ అన్నారు. రూట్ మాట్లాడుతూ..వాణిజ్యం, వ్యవసాయం, స్మార్ట్ సిటీస్, ఇంధన వనరుల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మెరుగైన అవకాశాలున్నాయని అన్నారు. ద్వైపాక్షిక భేటీ తరువాత విడుదలైన ఉమ్మడి ప్రకటనలో..పెట్టుబడులు, వాణిజ్య సంబంధాల అభివృద్ధిలో ప్రైవేట్ రంగ పాత్ర కీలకంగా మారిందని మోదీ, రూట్ పేర్కొన్నారు. ‘క్లీన్ గంగా’ ప్రాజెక్టుకు రూట్ కితాబు.. పవిత్ర గంగా నది ప్రక్షాళనకు ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామీ గంగే పథకాన్ని రూట్ ప్రశంసించారు. నీటిని ఆర్థిక వనరుగానే పరిగణించకుండా, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ పరంగానూ విలువ ఇవ్వాలని పేర్కొన్నారు. గంగా నది శుద్ధి కార్యక్రమంలో ఈ అంశా లన్నీ ఇమిడి ఉన్నాయని కితాబు ఇచ్చారు. కాగా, గురువారం రాత్రే రూట్ స్వదేశం బయల్దేరారు. 29 నుంచి మోదీ విదేశీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 29 నుంచి ఐదు రోజుల పాటు ఇండోనేసియా, సింగపూర్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాలతో రక్షణ, భద్రతరంగానికి సంబంధించి పలు ఒప్పందాలు చేసుకుంటారు. మే 29 నుంచి 31 వరకూ మోదీ ఇండోనేసియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఇండోనేసియాతో రక్షణరంగంలో సహకారం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. అనంతరం జూన్ 1న సింగపూర్‌కు వెళ్లనున్న మోదీ ఆ దేశ ప్రధాని లీసెయిన్ లూంగ్‌తో పలు అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. అనంతరం 28 ఆసియా–పసిఫిక్ దేశాల రక్షణ మంత్రులు, ఆర్మీ చీఫ్‌లు పాల్గొనే షాంగ్రీ లా సదస్సులో మాట్లాడతారు. ఈ సదస్సులో ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం గమనార్హం. ‘గ్రామస్వరాజ్’ సక్సెస్ ప్రధాని మోదీ ఉద్ఘాటన న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ‘గ్రామస్వరాజ్ అభియాన్’ కార్యక్రమం విజయవంతమైందని.. ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 14 (అంబేడ్కర్ జయంతి) మొదలుకుని మే 5 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించాం’ అని ఆయన ట్వీట్ చేశారు. పేదలకోసం ఉద్దేశించిన ఏడు ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను వివిధ బృందాలు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వివరించాయన్నారు. ‘ఈ 21 రోజుల్లో 7.53 లక్షల మందికి ఉజ్వల కనెక్షన్లు, 5లక్షల ఇళ్లకు సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ వెలుగులం దించాం. 16,682 గ్రామాల్లో 25 లక్షల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశాం. 1.65 లక్షల మంది∙చిన్నారులు, 42,762 మంది గర్భిణులకు మిషన్ ఇంద్ర ధనుష్‌లో భాగంగా టీకాలు వేశాం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, స్థానిక సంస్థల భాగస్వామ్యం మరువలేనిదన్నారు. అందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
రూ.1,500 కోట్లతో ‘నమామి గంగే’ ప్రారంభం
ఏడు రాష్ట్రాల్లో 231 ప్రాజెక్టులు షురూ న్యూఢిల్లీ/హరిద్వార్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామి గంగే పథకం అమలును పరుగులు పెట్టించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం గురువారం 231 ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుల్లో ఏడు రాష్ట్రాల్లోని వంద ప్రాంతాల్లో రూ.1500 కోట్లతో మురుగుశుద్ధి కేంద్రాలు, ఘాట్లను నిర్మించనున్నారు. గంగానది ప్రక్షాళనకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో భాగంగా గంగానది ప్రవహించే ఐదు (ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్) రాష్ట్రాల్లోని 103 చోట్ల, గంగకు ఉపనదైన యమున ప్రవహించే ఢిల్లీ, హరియాణాల్లో ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించారు. హరిద్వార్‌లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, ఉమాభారతి, మహేశ్ శర్మతోపాటు ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ 43 ప్రాజెక్టులు ప్రారంభించారు. గంగానదిలో కాలుష్యానికి గతంలో సరైన ప్రణాళికల్లేకుండా ముందుకెళ్లటమే కారణమని.. మోదీ సర్కారు హయాంలో అలాంటి పొరపాట్లకు తావులేకుండా పనిపూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి తెలిపారు. నమామి గంగే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ‘గంగా చట్టం’ తీసుకొస్తామన్న ఉమా.. పరిశ్రమలు వ్యర్థాలను గంగానదిలోకి విడుదల చేయకూడదని.. శుద్ధి చేసిన ఆ నీటి ని వ్యవసాయానికి వినియోగించాలన్నారు. గంగా స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహనకు అక్టోబరులో పాదయాత్ర చేపడతామన్నారు. ఈ ఏడాది చివరికల్లా 60 మురుగుశుద్ధి కేంద్రాలు ప్రారంభించనున్నట్లు గడ్కారీ తెలిపారు.