breaking news
nallamala Ghat road
-
ఘాట్ రోడ్డులో లారీలు ఢీ
మహానంది/ గిద్దలూరు రూరల్: రెండు లారీలు ఢీకొని ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి నల్లమల ఘాట్ రోడ్డులో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గిద్దలూరు నుంచి శనగల లోడుతో కర్నూలు జిల్లా గుత్తి వైపుగా వెళుతున్న లారీ నంద్యాల నుంచి చిలకలూరిపేటకు వడ్లలోడుతో వెళుతున్న లారీ ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. అనంతరం శనగల లోడు లారీ లోయలో పడిపోయింది. వడ్ల లోడు లారీ రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. దీంతో నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో గిద్దలూరుకు చెందిన శనగల లారీ డ్రైవర్ రాముడు, క్లీనర్ నాగూర్ బాషాలకు, నంద్యాలకు చెందిన వడ్లలోడు లారీ డ్రైవర్ గుంజ ఎర్రన్న అతడి కుమారుడు క్లీనర్ చిన్నసుబ్బారాయుడుతో పాటుగా అదే లారీలో ప్రయాణిస్తున్న చింతకుంటకు చెందిన చిన్న ఏసుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గిద్దలూరు పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని క్షతగాత్రులు గుంజ ఎర్రన్న, చిన్నసుబ్బరాయుడు, నాగూర్‌బాషా, చిన్న ఏసులను చికిత్స నిమిత్తం పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. శనగల లోడు లారీ డ్రైవర్ రాముడు మాత్రం లారీ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసే ప్రయత్నం చేశారు. చిన్నఏసు కంబం వద్ద ఉన్న చింతకుంటకు వెళ్లేందుకు వడ్ల లోడుతో వెళుతున్న లారీలో గాజులపల్లె వద్ద ఎక్కాడు. ఈ ప్రమాదంలో క్లీనర్లు నాగూర్‌బాషా, చిన్నసుబ్బరాయుడులకు స్వల్ప గాయాలయ్యాయి. లారీలో ప్రయాణిస్తున్న చిన్న ఏసు తలకు, కాళ్లకు చేతులకు డ్రైవర్లు, ఎర్రన్న, చిన్నసుబ్బరాయుడులకు తలకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. -
రైలు ఢీకొని చిరుత మృతి
కర్నూలు, మహానంది: నల్లమల ఘాట్‌రోడ్డులోనినంద్యాల–గిద్దలూరు రైల్వేమార్గంలో పచ్చర్ల–చలమ మధ్యలో ఉన్నదొరబావి వంతెన వద్దరైలు ఢీకొని చిరుత మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. నంద్యాల డీఎఫ్ఓ శివశంకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. సుమారు తొమ్మిది నెలల వయసున్న ఆడ చిరుత రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం అటవీ అధికారులకు సాయంత్రం తెలియడంతో అక్కడికి చేరుకుని పరిశీలించారు. డోన్–గుంటూరు ప్యాసింజర్ రైలు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. చిరుత కళేబరానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. -
తృటిలో తప్పిన ముప్పు
వేగంగా వెళ్తున్న లోడ్ వెహికిల్ టైర్ ఊడిపోయిన ఘనటన కర్నూలు జిల్లా మహానంది వద్ద జరిగింది. నల్లమల ఘాట్ రోడ్డులో ఆదివారం అరటికాయల లోడుతో వెళ్తున్న వ్యాను... జీన శంకర తపోవనం వద్దకు చేరుకోగానే వెనక యాక్సిల్ విరిగి పోయింది. వెనక వైపు ఒక టైరు ఊడి పక్కన ఉన్న చెట్ల పొదల్లో పడి పోయింది. అదృష్ట వశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమయంలో రోడ్డుమీద మరే వాహనం రాక పోవడంతో.. పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.