breaking news
Nakrekal Assembly Constituency
-
ఎవరూ ఆవేశపడొద్దు: కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ వైపు చూస్తుండడం.. ఆ చేరికకు తెలంగాణ పీసీసీ సైతం పచ్చ జెండా ఊపిందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈలోపు అనూహ్యాంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్లీ తెర మీదకు వచ్చారు. శనివారం నకిరేకల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, తన అనుచరులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘‘బీఆర్ఎస్కు రాజీనామా చేస్తే కాంగ్రెస్ తరపున టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు కాబట్టే కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారు. ఎవరో వస్తున్నారన్న వార్తలు నమ్మి కార్యకర్తలు ఆవేశపడొద్దు. కారక్యర్తలు ఎవరి పేరు చెబితే.. వాళ్లనే అభ్యర్థిగా ప్రకటిస్తా. ఉచిత విద్యుత్‌పై రేవంత్ నోరు జారితే.. లాగ్‌బుక్ పెట్టి నష్టనివారణ చేయించింది నేనే అని కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. నల్లగొండ కాంగ్రెస్ చేరికలపై కోమటిరెడ్డితో మరో సీనియర్.. ఎంపీ ఉత్తమ్‌కుమార్ సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరినీ కూడదీసుకుని బీఆర్ఎస్కు ఢీ కొట్టాలనే ఆలోచనతో ఉన్న పీసీసీ చేరికలకు ఆటంకం కలగకుండా ఈ ఇద్దరు సీనియర్లను బుజ్జగించే సంప్రదింపులు జరుపుతోంది. అయితే కోమటిరెడ్డి మాత్రం కార్యకర్తల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాలని పీసీసీకి, కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నారు. -
కాంగ్రెస్‌లోకి వేముల వీరేశం?
సాక్షి, నల్గొండ జిల్లా: జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ సీనియర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నకిరేకల్‌కు చెందిన తన అనుచరులు, నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరనున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్నటి వరకు వీరేశం చేరికను కోమటిరెడ్డి వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడంపై అవమానించడమే అవుతుందని, సునీల్ కనుగోలు(ఎన్నికల వ్యూహకర్త) చెబితే చేర్చుకోవడమేనా? అంటూ కోమటిరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో వీరేశం చేరికపైనే కోమటిరెడ్డి నియోజకవర్గంలోని తన అనుచరులతో చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా, టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెలే వేముల వీరేశానికి బీఆర్ఎస్ మొండిచేయి చూపడంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. నకిరేకల్‌లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఎన్ని బాధలు పెట్టినా భరించా.. అయినా ఇంకా భరిస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా’’ అంటూ తన అనుచరులు ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: పల్లాపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి -
వచ్చే ఎన్నికల్లో నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు
నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో రామన్నపేట నియోజకవర్గం రద్దై నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. నకిరేకల్ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన చిరుమర్తి లింగయ్య రెండోసారి విజయం సాదించారు. ఆయన గతంలో 2009లో ఒకసారి, తిరిగి 2018లో మరోసారి గెలిచారు. లింగయ్య తన సమీప ప్రత్యర్ది, సిట్టింగ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై 8259 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఆ తర్వాత కొద్ది కాలానికి లింగయ్య కాంగ్రెస్ ఐకి గుడ్ బై చెప్పి అదికార టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. లింగయ్యకు 93699 ఓట్లు రాగా, వీరేశంకు 85440 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎస్.ఎఫ్ బి అభ్యర్దిగా పోటీచేసిన డి.రవికుమార్‌కు పదివేలకు పైగా ఓట్లు వచ్చాయి. నకిరేకల్ నియోజకవర్గంలో 2014లో టిఆర్ఎస్ అభ్యర్ధి వేముల వీరేశం సిటింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్ది చిరుమర్తి లింగయ్యను 2370 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఇక్కడ టిఆర్ఎస్కు రాజీనామా చేసిన చెరుకు సుధాకర్ తన భార్య లక్ష్మిని బిజెపి పక్షాన రంగంలో దించినా ప్రయోజనం దక్కలేదు. ఆమెకు38440 ఓట్లు వచ్చాయి. సిపిఎం పక్షాన పోటీచేసిన ఎమ్.సర్వయ్యకు 12741 ఓట్లు వచ్చాయి. 2018లో లింగయ్య గెలవగలిగారు. నకిరేకల్ నియోజకవర్గంలో సిపిఐ ఒకసారి, సిపిఎం ఎనిమిదిసార్లు, కాంగ్రెస్ కాంగ్రెస్‌లు మూడుసార్లు, టిఆర్ఎస్, పిడిఎఫ్ ఒక్కొక్కసారి గెలుపొందాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నకిరేకల్ రిజర్వుడ్ కేట గిరిలోకి వెళ్లింది. అంతకు ముందు జనరల్‌గా ఉన్నప్పుడు సిపిఎం నేత నర్రా రాఘవరెడ్డి ఇక్కడ నుండి ఆరుసార్లు గెలిచారు. టిడిపి ఇక్కడ ఒక్కసారి కూడా గెలవలేదు. సిపిఎం నేత నోముల నరసింహయ్య ఇక్కడ రెండుసార్లు గెలిచారు. ఆయన 2009లో భువనగిరి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 2014లో టిఆర్ఎస్లో చేరి సాగర్ నుంచి పోటీచేసి ఓడినా, 2018లో గెలవగలిగారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు సిపిఎం నకిరేకల్‌లో పట్టు నిలబెట్టుకున్నా, 2009 నుంచి ఓడిపోతోంది. 1957లో ఇక్కడ గెలిచిన ధర్మభిక్షం నల్గొండలో, సూర్యాపేటలలో కూడా గెలిచారు. ఈయన రెండుసార్లు లోక్‌సభకు కూడా గెలుపొందారు. నకిరేకల్ రిజర్వుడ్ కాకముందు ఏడుసార్లు రెడ్లు, నాలుగుసార్లు బిసిలు (రెండుసార్లు గౌడ, రెండుసార్లు యాదవ) ఎన్నికయ్యారు. రామన్నపేటలో (2009లో రద్దు) 1952లో ఏర్పడిన రామన్నపేట శాసనసభ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా 13సార్లు ఎన్నికలు జరగ్గా, పిడిఎఫ్ రెండుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు ఏడుసార్లు, సిపిఐ నాలుగుసార్లు గెలుపొందాయి. ఈ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి శాసనసభకు రెండుసార్లు గెలిచారు. 1999, 2004లలో ఆయన గెలుపొందారు. ఆయన శాసనమండలి సభ్యునిగా ఎక్కువ కాలం ఉన్నారు. పురుషోత్తంరెడ్డి 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలోను, 1973లో జలగం వెంగళరావు క్యాబినెట్‌లోను సభ్యునిగా ఉన్నారు. కొమ్ము పాపయ్య 1981లో టి.అంజయ్య మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్నారు.సిపిఐ నేతలు కె.రామచంద్రారెడ్డి, జి.యాదగిరిరెడ్డిలు మూడేసి సార్లు అసెంబ్లీకి గెలిచారు. రామన్నపేట లో ఎనిమిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, మూడుసార్లు ఎస్.సిలు ఎ న్నికయ్యారు. నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..