breaking news
nakarikallu
-
నకరికల్లు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి
పట్నంబజారు : ఒక శ్మశానం వివాదం విషయాన్ని మనసులో పెట్టుకుని తనను అక్రమంగా గాయపరిచిన నకరికల్లు ఎస్సై రమేష్‌పై చర్యలు తీసుకోవాలని నరసరావుపేట న్యాయవాది కాశిమళ్ళ పిచ్చయ్య విన్నవించారు. ఈ మేరకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎప్పీ రామాంజనేయులును కలిసి వినతి ప్రతాన్ని అందజేశారు. పిచ్చయ్య నరసరావుపేట బార్లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గత నెల 23వ తేదీన నకరికల్లు ఎస్సై అక్రమంగా తన ఇంటి వద్దకు వచ్చి చొక్కా పట్టుకుని తనను తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. దుర్భాషలాడుతూ తన ç³పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు. దీంతో తాను తీవ్ర గాయాలపాలయ్యానని పేర్కొన్నారు. అమానుషంగా వ్యవహరించిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన అడిషనల్ ఎస్పీ విచారిస్తామని తెలిపారు. -
మినీ బస్సు బోల్తా: నలుగురికి గాయాలు
నకరికల్లు: గుంటూరు జిల్లాలో మినీ బస్సు బోల్తా పడిన ఘటనలో నల్లగొండ జిల్లా వాసులు గాయపడ్డారు. నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన 13 మంది అయ్యప్పభక్తులు మినీ బస్సులో శబరిమలై నుంచి వస్తున్నారు. వారి వాహనం శనివారం ఉదయం అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లవారిపాలెం గ్రామం వద్ద అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.