breaking news
nagrajunasagar place
-
కమలం కసరత్తు షురూ.. స్పీడ్ పెంచిన ఇద్దరు నేతలు!
నాగార్జునసాగర్ సీటు మీద కమలం పార్టీ సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. కారు, హస్తం పార్టీలకు ధీటైన అభ్యర్థిని బరిలో దించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రెండు ప్రత్యర్థి పార్టీలు యువనేతలకే ఈసారి ఛాన్స్ ఇవ్వబోతున్నాయి. ఆ తరహాలోనే తాను కూడా యువనేతనే పోటీలో దించడానికి ప్లాన్ చేసింది. ఇంతకీ ఆ యువనేత ఎవరు?.. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కమలం పార్టీ అన్ని నియోజకవర్గాల్లోనూ గట్టి అభ్యర్థుల కోసం వెతుకుతోంది. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు.. ఇకముందు జరగబోయేది మరో ఎత్తు అనే రీతిగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలంగా ఉన్న కారు, కాంగ్రెస్ పార్టీలను తట్టుకుని నిలబడగలిగే అభ్యర్థుల కోసం ప్రయత్నిస్తోంది. అయితే, నాగార్జునసాగర్‌లో సరైన నాయకులు లేకపోవడంతో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డిని లాగాలనుకున్నా సాధ్యం కాలేదు. మరో ఇద్దరు నాయకుల కోసం ప్రయత్నించినా సాధ్యపడలేదు. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో గతంలో చేసిన పొరపాట్లను సరిచేసుకుంటూనే కొత్త వ్యూహాలకు పదును పెడుతుందోట. పోటీలో యూత్.. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భగత్ మరోసారి బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి రంగంలోకి దిగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు యువనేతలకు ధీటుగా ఉండే మరో యువనేతను రంగంలో దించాలని కమలం పార్టీ యోచిస్తోందట. గతంలో టికెట్ హామీతో కాషాయ కండువా కప్పుకున్న రిక్కల ఇంద్రసేనారెడ్డి కూడా తనకిచ్చిన హామీని రాష్ట్ర నాయకత్వం దగ్గర పదే పదే గుర్తు చేస్తున్నారట. రాష్ట్ర స్థాయి నేతలు కూడా రిక్కల విషయంలో సానుకూలంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో నియోజవకర్గంలో ఇంద్రసేనారెడ్డి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓవైపు క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌తో సమావేశాలు నిర్వహిస్తూనే తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాలతో ఆ పార్టీ నేతల్ని కూడా కలిసి మద్దతు కోరుతున్నారట. పక్కా ప్లాన్‌తో పోటీలో.. ఇక రిక్కలతో పాటు చెన్ను వెంకటనారాయణ రెడ్డి అనే మరో నేత కూడా టికెట్ ఇస్తే పోటీ చేయాలని ఆలోచిస్తున్నారట. గత ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన రవినాయక్ ప్రస్తుతం యాక్టివ్‌గా లేరని చెబుతున్నారు. ఉప ఎన్నికలు ముగిసిన కొంతకాలం తర్వాతినుంచి రవినాయక్ సైలెంట్ అయిపోయారని పార్టీ కేడరే చర్చించుకుంటోంది. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదిత కూడా మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. అయితే, పార్టీ మాత్రం ఈసారి పక్కా ప్రణాళికతో ఉంది. ఎన్నికల్లో పోటీ చేశాం అన్నట్లు కాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చి నాగార్జునా సాగర్‌లో పట్టు సాధించేందుకు ప్లాన్ చేస్తోంది. అంగబలం, అర్థబలం ఉన్న నేతకే టికెట్ ఇవ్వాల్సి వస్తే మాత్రం రిక్కలకే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఏదో పోటీలో ఉన్నామని అనుకునేవారు కాకుండా సీరియస్‌గా ఎంతైనా ఖర్చు పెట్టగలవారికే సాగర్ టిక్కెట్ ఇచ్చేందుకు కమలం నేతలు నిర్ణయించుకున్నారు. ఇది కూడా చదవండి: ఎవరు ఎటో..! టికెట్లు రాకుంటే ఇతర పార్టీల్లోకి.. -
స్కెచ్చేస్తున్నారు..
► నాడు జెడ్పీ స్థలం.. నేడు ఎన్ఎస్పీ వంతు ► రూ.25 కోట్ల స్థలానికి టెండర్ ► 1.92 ఎకరాల స్థలంలో టీడీపీ కార్యాలయం ఏర్పాటు యత్నం ► స్థలం ఇవ్వాలంటూ ఎన్ఎస్పీఉన్నతాధికారులపై ఒత్తిడి ► 99 ఏళ్ల లీజు పేరుతో స్థలం కబ్జాకు రంగం సిద్ధం ► ఇరిగేషన్ మంత్రి, లోకేష్‌లకు వినతి ► పావులు కదుపుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ► ఎన్ఎస్పి కార్యాలయానికి సరైన భవనం లేని వైనం ► అయినా పట్టించుకోని అధికారులు టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం పేరుతో విలువైన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు చెందిన స్థలాన్ని సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ రంగం సిద్ధం చేసింది. 99 సంవత్సరాల లీజు పేరుతో పాతిక కోట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక వైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సరైన సొంత కార్యాలయం కూడా లేదు. కానీ వారి స్థలాన్ని అధికార పార్టీ సొంతం చేసుకునేందుకు సిద్ధమవ్వడంపై స్వపక్షం నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరం నడిబొడ్డున నెల్లూరు–కర్నూలు హైవే పక్కన సర్వే నెం.88లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్ఎస్పి) 1.92 ఎకరాలు స్థలం ఉంది. ఈ స్థలానికి తూర్పు వైపున ఇరిగేషన్ ప్రాజెక్టు సీఈ కార్యాలయం, పడమర వైపున నాగార్జున యూనివర్సిటీ, దక్షిణం వైపున కర్నూలు–నెల్లూరు హైవే ఉంది.ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ స్థలం విలువ రూ.25 కోట్లకుపైమాటే. ఖాళీగా ఉన్న స్థలంపై జిల్లా అధికార పార్టీ నేత కన్నుపడింది. టీడీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం పేరుతో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యా రు.99 సంవత్సరాల లీజు కింద తొలుత స్థలాన్ని సొంత ం చేసుకునేందుకు ప్రతిపాదించారు.ఒక ఎకరం స్థలానికి నెలకు రూ.1,000 చొప్పున 1.92 ఎకరాల స్థలానికి నెలకు రూ.1800 లీజు కింద చెల్లించే పద్ధతిలో ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. ఎన్ఎస్పి స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వాలంటూ ఇప్పటికే ఇరిగేషన్ ఎస్ఈ, సీఈలపై అధికార పార్టీ నేత ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. మీరిక్కడే పని చేయాలంటే... మీ స్థలాన్ని పార్టీ కార్యాలయానికి ఇవ్వాల్సిందేనంటూ బెదిరింపులకు సైతం దిగుతున్నట్లు ప్రచారం ఉంది. అప్పగింతకు పావులు కదుపుతున్న అధికారులు.. ఎన్ఎస్పి స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించేలా అనుమతులు మంజూరు చేయాలంటూ అధికార పార్టీ జిల్లా నేత తొలుత ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమకు విన్నవించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని చినబాబు లోకేష్ దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయానికి స్థలమివ్వాలన్న నిబంధనలను అడ్డుపెట్టుకొని క్యాబినెట్ తీర్మానం ద్వారా ఎన్ఎస్పి స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి అప్పగించేందుకు అధికార పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఒంగోలులో ఎన్ఎస్పికి సరైన సొంత భవనం కూడా లేదు. ఉన్న భవనాలు చిన్నపాటి వర్షం కురిసిన జలమయమవుతున్నాయి. అధికారులు వర్షాకాలంలో వాటిలో కూర్చొని పని చేసే పరిస్థితి కూడా లేదు. కార్యాలయం ఎదురుగానే ఉన్న రెండెకరాల స్థలంలో సొంత భవనాలు నిర్మించుకోవాలన్న ప్రతిపాదన కూడా ఎన్ఎస్పి సిద్ధం చేసుకుంది. అయితే విలువైన స్థలాన్ని టీడీపీ జిల్లా కార్యాలయం పేరుతో సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ సిద్ధం కావడంపై ఎన్ఎస్పి కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు అధికార పార్టీ నేతల కొమ్ముకాస్తూ స్థలాన్ని అప్పగించేందుకు సిద్ధమయ్యారని అదే శాఖలో పని చేస్తున్న కొందరు అధికారులు విమర్శలు గుప్పించటం గమనార్హం. సొంత పార్టీలోనే వ్యతిరేకత.. నగరంలో విలువైన స్థలాలు ఒక వైపు కబ్జాకు గురవుతుంటే.. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయానికి మాత్రం మొన్న జడ్పీ స్థలం.. నేడు ఎన్ఎస్పి స్థలం అంటూ ప్రతిపాదనలు తెరపైకి తీసుకురావడంపై అధికార టీడీపీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయానికి చెందిన విలువైన స్థలాలు కాకుండా కొందరు అధికార పార్టీ నేతలు కబ్జా చేసిన విలువైన కార్పొరేషన్ స్థలాల్లో పార్టీ కార్యాలయం నిర్మించాలంటూ మరికొందరు నేతలు విమర్శలు గుప్పిస్తుండటం గమనార్హం. తిప్పికొట్టిన జడ్పీ చైర్మన్.. తొలుత నగరంలోని సౌత్ బైపాస్ రోడ్డులో సర్వే నెం.66/1బి, 67/1లో ఉన్న రూ.50 కోట్ల విలువైన 1.60 ఎకరాల జడ్పీ స్థలంలో జిల్లా టీడీపీ కార్యాలయాన్ని నిర్మించేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిద్ధమయ్యారు. ఈ మేరకు జడ్పీ తీర్మానం చేయాలంటూ చైర్మన్ ఈదర హరిబాబుతో పాటు సభ్యులపైనా ఒత్తిడి తెచ్చారు. సంతకాల సేకరణకు దిగి బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. అయితే ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సైతం ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉంచిన స్థలాన్ని పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారంటూ గొడవకు దిగారు. దీంతో వెనక్కితగ్గిన దామచర్ల ప్రతిపాదనను ఎట్టకేలకు విరమించుకున్నారు. అయితే తాజాగా ఎన్ఎస్పి స్థలాన్ని పార్టీ కార్యాలయంకంటూ దామచర్ల కొత్త ప్రతిపాదన తెరపైకి తేవడంపై స్వపక్షం నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.