breaking news
Nagesh Basavanhalli
-
4.55 లక్షల ధరతో మార్కెట్ లోకి ఫియట్ బుల్లికారు!
న్యూఢిల్లీ: మార్కెట్ లో ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడానికి పుంటో ఏవో పేరుతో మార్కెట్ లోకి చిన్నకారును ఫియట్ గ్రూప్ ఆటోమొబైల్స్ ఇండియా విడుదల చేసింది. పుంటో ఏవో కారు విలువ 4.55 లక్షల నుంచి 7.19 (ఢిల్లీ ఎక్స్ షోరూం ధర) లక్షల వరకు ఉంటుందని ఫియట్ కంపెనీ వెల్లడించింది. మారుతి స్విఫ్ట్, హుందాయ్ ఐ20, హోండా బ్రియోలకు పోటీగా డీజిల్, పెట్రోల్ వెర్షన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. డీజీల్ వెర్షన్ 5.27 లక్షల నుంచి ప్రారంభమై.. 7.19 లక్షల వరకు ఉంటుందని ఫియట్ ఇండియా అధ్యక్షుడు, ఎండీ నాగేశ్ బసవ్వన్ హల్లీ తెలిపారు. కస్టమర్ల అవసరాలకు దృష్టిలో ఉంచుకుని, భారతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కార్లను డిజైన్ చేస్తున్నామని ఫియట్ కంపెనీ తెలిపింది. ఫియట్ కంపెనీకి దేశవ్యాప్తంగా 93 పట్టణాల్లో 116 అవుట్ లెట్లు ఉన్నాయని నాగేశ్ తెలిపారు. -
మార్కెట్లోకి ఫియట్ లినియా ‘క్లాసిక్’
న్యూఢిల్లీ: పండుగల సీజన్ సందర్భంగా ఫియట్ కంపెనీ లినియా క్లాసిక్ పేరుతో కొత్త కారును బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారుతో ఎంట్రీ లెవల్ సెడాన్ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్నామని ఫియట్ గ్రూప్ ఆటోమొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఎఫ్జీఏఐపీఎల్) తెలిపింది. ఈ కారు ధరలు రూ.5.99 లక్షల నుంచి రూ.7.51 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) ఉన్నాయని ఫియట్ క్రిస్లర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ నగేష్ బసవనహళ్లి చెప్పారు. ఈ కారును 3 వేరియంట్లలో(ఒకటి పెట్రోల్, రెండు డీజిల్), ఐదు రంగుల్లో అందిస్తున్నామని పేర్కొన్నారు. సెడాన్ విలాసాలను హ్యాచ్‌బాక్ ధరకే పొందేలా ఈ లినియా క్లాసిక్‌ను రూపొందించామని, అధునాతన ఫీచర్లను అందుబాటు ధరలో అందిస్తున్నామని వివరించారు. కార్ల వారంటీని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచామని, డీలర్ల నెట్‌వర్క్‌ను, సర్వీసింగ్ సెంటర్లను విస్తరిస్తున్నామని వివరించారు. ప్రత్యేకతలు: లినియా క్లాసిక్‌లో హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్, ప్రోగ్రామబుల్ స్పీడ్ లిమిట్ బజర్, డ్యుయల్ పారబోలా హెడ్‌ల్యాంప్స్, అగ్ని ప్రమాదాలను నివారించే సిస్టమ్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ కారు మారుతి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్, ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్, టయోటా ఇటియోస్, షెవర్లే సెయిల్, నిస్సాన్ సన్నీలకు గట్టిపోటీనిస్తుందనేది పరిశ్రమ వర్గాల అంచనా.