breaking news
Nagaraj Manjule
-
బిగ్ కోచ్
‘సైరాట్’ అనే మరాఠీ చిత్రంతో ఇతర భాషల వాళ్లు కూడా తనవైపు తిరిగి చూసేలా చేసిన దర్శకుడు నాగ్‌రాజ్ మంజులే. జాతీయ అవార్డు సాధించిన ఈ చిత్రం శ్రీదేవి కుమార్తె కథానాయికగా హిందీలో ‘ధడక్’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగ్‌రాజ్ మంజులే ‘జుంద్’ ద్వారా హిందీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించనున్నారు. వీధి పిల్లలతో ఫుట్‌బాల్ టీమ్‌ని తయారు చేసే ప్రొఫెసర్ పాత్రను అమితాబ్ చేయనున్నారు. ‘‘అమితాబ్ లాంటి లెజెండ్‌ని డైరెక్ట్ చేయడం అంటే కల నిజమైనట్టే. మిగతా అందరూ దాదాపు కొత్తవాళ్లే నటిస్తారు’’ అన్నారు నాగరాజ్. నవంబర్‌లో షూటింగ్ స్టార్ట్ కానుంది. 70 రోజులు షూటింగ్ జరిగే ఈ సినిమాలో అమితాబ్ 45రోజుల పాటు పాల్గొననున్నారని సమాచారం. -
ఆ సినిమా రీమేక్ రైట్స్‌కు భారీ పోటీ
ఫిలిం ఇండస్ట్రీలో సక్సెసే కీలకం అందుకే చాలా మంది దర్శక నిర్మాతలు కొత్త కథలతో ప్రయోగాలు చేసేకన్నా, వేరే భాషలో సక్సెస్ అయిన సినిమాలను రీమేక్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. టాప్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కూడా ఇలా రీమేక్ సినిమాల మీద ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ మరాఠీ సినిమా రీమేక్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి 60 కోట్లు పైగా వసూలు చేసిన ఓ చిన్న సినిమాను తెలుగులో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరాఠీలో ఘన విజయం సాధించిన సైరత్ సినిమా, తెలుగు రీమేక్ రైట్స్ కోసం చాలామంది నిర్మాతలు పోటీ పడుతున్నారు. నాగరాజ్ మంజులే దర్శకత్వంలో జీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఏప్రిల్ 29న రిలీజ్ అయిన ఈ అందమైన ప్రేమకథ తెలుగు ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతానికి రీమేక్ రైట్స్ ఎవరూ సొంతం చేసుకోకపోయినా త్వరలోనే సైరత్ తెలుగు రీమేక్ పై క్లారిటీ రానుంది.