breaking news
nac chairmanship
-
చంద్రబాబు హద్దులు తెలుసుకోవాలి: హరీశ్
-
చంద్రబాబు హద్దులు తెలుసుకోవాలి: హరీశ్ రావు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన హద్దులు తెలుసుకుని ప్రవర్తించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా హెచ్చరించారు. ఆయన కావాలనే రోజుకో కొత్త వివాదం సృష్టిస్తున్నారని, తమతో కయ్యానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉన్న న్యాక్‌కు ఛైర్మన్‌గా తనను తాను ఆయన ఎలా ప్రకటించుకుంటారని హరీశ్ ప్రశ్నించారు. టీటీడీకి తెలంగాణ వ్యక్తిని ఛైర్మన్‌గా నియమిస్తే ఎలా ఉంటుందని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ చంద్రబాబు నాయుడిని కట్టడి చేయాలని హరీశ్ రావు కోరారు. ఆయన రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజాగ్రహానికి గురవుతున్న చంద్రబాబు, వాటినుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తమతో కయ్యానికి దిగుతున్నారని చెప్పారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అసలు న్యాక్ చైర్మన్‌గా చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు సమర్థిస్తారా అని ఆయన ప్రశ్నించారు.