breaking news
Myanmar earthquake
-
భూకంపంలో శిశువులను కాపాడిన నర్సులు.. హ్యట్సాప్ అంటూ ప్రశంసలు
మయన్మార్‌లో భూకంప విలయం (Earthquake) కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అంచనాలకు కూడా అందని నష్టాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రమైన మాండలేతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాల శిథిలాలే. బాధితుల హాహాకారాలే వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో విరుచుకుపడ్డ భూకంపానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. శిథిలాల నుంచి ఇప్పటికే 1,600కు పైగా మృతదేహాలను వెలికితీశారు. 3,500 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య 10 వేలు దాటవచ్చని చెబుతున్నారు.మరోవైపు.. భూకంపం సందర్బంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని ఒక చిన్న పిల్లల ఆసుపత్రికి సంబంధించిన వీడియోపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. భూకంపం సందర్భంగా ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో చిన్న పిల్లలను నర్సులు కాపాడారు. భూకంపం ధాటికి భవనంలో కుదుపులు ఎదురైనప్పటికీ వారు కింద పడిపోతున్నా.. ఆసుపత్రిలో ఉన్న శిశువుకు ప్రమాదం జరగకుండా నర్సులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో నర్సు ప్లోర్‌పై కూర్చుని శిశువును పట్టుకుంది. ఎంతో కష్టం మీద కన్న తల్లిలాగా శిశువులను కాపాడారు. ఈ క్రమంలో నర్సుల కష్టంపై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు.ఇదిలా ఉండగా.. మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు (Aftershocks) వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భారత టెక్టానిక్ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్‌ను వరుసగా ఢీకొంటుండడం వల్ల నెలల తరబడి ఆఫ్టర్‌షాక్స్ వచ్చే అవకాశం ఉందని జెస్ ఫీనిక్స్ తెలిపారు. భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.Nurses in SW China protect newborn babies during earthquake in Myanmar #ChinaBuzz pic.twitter.com/Yixj3pCtZE— CGTN (@CGTNOfficial) March 30, 2025ప్రపంచ దేశాల ఆపన్న హస్తం..ఈ కష్ట సమయంలో అక్కడి ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. బాధితులకు అవసరమైన ఆహారపదార్థాలతోపాటు.. తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌కు పంపించినట్లు సమాచారం. అంతే కాకుండా విపత్తులో ఉన్న ఆ దేశానికి సాయం చేసేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో-గుటెరస్ వెల్లడించారు.Terrifying CCTV video of yesterdays M7.7 earthquake that hit Myanmar. The death toll is at least 1,644, with 3,408 people injured. Numbers are expected to rise. pic.twitter.com/5fAXXXpVDl— Volcaholic 🌋 (@volcaholic1) March 29, 2025 Nature doesn’t care about our strength, borders, or pride. The earthquake in #Thailand & #Myanmar is a stark reminder: no matter how advanced we become, nature still holds the power to shake everything. A brutal reminder of how small we really are. #earthquake pic.twitter.com/wQPZ82MB8j— Hala Jaber (@HalaJaber) March 29, 2025 -
భూకంపాలకు హోమ్ ఇన్సూరెన్స్ పనికొస్తుందా?
మయన్మార్, థాయ్‌ల్యాండ్ దేశాలలో ఇటీవల అధిక తీవ్రతతో సంభవించిన వినాశకరమైన భూకంపం విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటి యజమానుల సన్నద్ధతపై ఆందోళనలను రేకెత్తించింది. భూకంపాలు ఊహించలేనప్పటికీ, సరైన బీమా పాలసీతో మీ ఇంటిని సురక్షితం చేసుకోవడం ఇలాంటి విపత్తుల సమయంలో ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది.హోమ్ ఇన్సూరెన్స్ భూకంపాలను కవర్ చేస్తుందా?ప్రామాణిక గృహ బీమా పాలసీలు సాధారణంగా భూకంప నష్టాన్ని కవర్ చేయవు. అయితే, చాలా బీమా సంస్థలు భూకంప బీమాను యాడ్-ఆన్ లేదా ప్రత్యేక పాలసీగా అందిస్తున్నాయి. ఈ కవరేజీ మీ ఇంటి నిర్మాణం, దాని విషయాలు రెండింటినీ భూకంప కార్యకలాపాల వల్ల కలిగే నష్టాల నుండి రక్షించగలదు.భూకంప బీమా ముఖ్య లక్షణాలుస్ట్రక్చరల్ కవరేజ్: భూకంపాల వల్ల కలిగే నష్టాల నుండి భవనాన్ని రక్షిస్తుంది.కంటెంట్ కవరేజీ: ఇంట్లోని విలువైన వస్తువులు, వస్తువులను కవర్ చేస్తుంది.అదనపు జీవన ఖర్చులు: మీ ఇల్లు నివాసం ఉండలేని విధంగా మారితే తాత్కాలిక వసతి కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది.భూకంప బీమా ఎందుకు ముఖ్యం?మయన్మార్, థాయ్‌ల్యాండ్‌తోపాటు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం కనిపించింది. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గతంలోనూ భూకంప ప్రమాదాలు సంభవించాయి. ఇలాంటి ప్రాంతాలలో భూకంప ప్రభావానికి ఇల్లు కూలిపోతే తరువాత పునర్నిర్మించడానికి ఆర్థిక భారం అధికంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో భూకంప బీమా నిశ్చింతను ఇస్తుంది. ఇంటి యజమానులకు ఆర్థిక భారం లేకుండా నష్టాల నుండి కోలుకునేలా చేస్తుంది.ఇవి పరిగణనలోకి తీసుకోవాలిమినహాయింపులు: భూకంప బీమా పాలసీలు సాధారణంగా అధిక మినహాయింపులతో వస్తాయి. ఇది క్లెయిమ్ చెల్లింపులను ప్రభావితం చేస్తుంది.కవరేజ్ పరిమితులు: ఇంటి నిర్మాణంతోపాటు ఇంట్లోని వస్తువులకూ గరిష్ట కవరేజీ ఉందో లేదో సరిచూసుకోండి.పాలసీ నిబంధనలు: చేరికలు, మినహాయింపులు, అందుబాటులో ఉన్న ఏదైనా అదనపు రైడర్లను సమీక్షించండి. -
భారత్ పై మయన్మార్ భూకంపం ఎఫెక్ట్!
-
190 ఆలయాలు నేలమట్టం
మయన్మార్ దేశాన్ని కుదిపేసిన భూకంపం తాకిడికి నలుగురు మరణించగా.. 190 బౌద్ధ ఆలయాలు నేలమట్టం అయ్యాయి. అత్యంత పురాతనమైన ఈ పగోడాలు చాలావరకు కుప్పకూలిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. మాగ్వే ప్రాంతంలోని పక్కోకు టౌన్షిప్లో పొగాకు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ కూలిపోవడంతో ఓ పురుషుడు, మహిళ మరణించారు. యెనాన్చౌంగ్ టౌన్షిప్లో 7, 15 సంవత్సరాల వయసున్న ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. భూకంప ప్రభావం పొరుగునున్న భారతదేశంలోని పశ్చిమబెంగాల్‌తో పాటు బంగ్లాదేశ్ మీద కూడా కనిపించింది. భూకంప కేంద్రం మయన్మార్‌కు దక్షిణంగా 190 కిలోమీటర్ల దూరంలోని మండలే నగరం దగ్గరలో ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది భూమికి 90 కిలోమీటర్ల లోతులో ఉంది. మయన్మార్‌లో గడిచిన రెండు రోజుల్లో భూకంపాలు రెండుసార్లు వచ్చాయి. భారత్- మయన్మార్ సరిహద్దులతో పాటు అసోం, త్రిపుర, మిజొరాం, మేఘాలయ లాంటి ప్రాంతాల్లో మంగళవారం నాడు 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే దీని ప్రభావం మరీ ఎక్కువగా కనిపించలేదు. 2016 జనవరి నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 26 సార్లు భూమి కంపించింది.