breaking news
mvgr engineering college
-
ప్రశాంతంగా ఐసెట్
డెంకాడ, న్యూస్‌లైన్ : ఐసెట్ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలోని రెండు కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాశారు. జిల్లా మొత్తం అభ్యర్థులకు ఇక్కడే పరీక్ష కేంద్రం కేటారుుంచారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరిగింది. కేంద్రం 1లో 800 మంది అభ్యర్థులు పరీక్షలు రాయూల్సి ఉండగా 89 మంది గైర్హాజరయ్యూరు. 711 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. కేంద్రం-2లో 672 మంది పరీక్ష రాయూల్సి ఉండగా 66 మంది గైర్హాజరయ్యూరు. 606 మంది పరీక్ష రాశారు. కొందరు విద్యార్థులు పరీక్ష సమయానికి రావడంతో కళాశాల సిబ్బందే బైక్‌లపై కేంద్రానికి చేరవేశారు. కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లుగా వైఎంసీ శేఖర్, టీవీఎన్ పార్థసారధి వ్యవహరించారు. పరీక్ష రీజనల్ కోఆర్డినేటర్ కేవీఎల్ రాజు, అబ్జర్వర్ ఏయూ అసోసియేట్ ప్రొఫెసర్ కె.వి.రమణ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. -
భవిష్యత్‌లో న్యూక్లియర్ అవసరం
డెంకాడ, న్యూస్‌లైన్: భవిష్యత్‌లో దేశ ప్రజలకు విద్యుత్, ఇతర అవసరాలు తీరాలంటే అణుశక్తి (న్యూక్లియ ర్ పవర్) తప్పదని న్యూక్లియర్ రీ సైకిల్ గ్రూప్ డెరైక్టర్ పికె వత్తల్ అన్నారు. ‘జాతీయ అభివృద్ధిలో అణుశక్తి పాత్ర’ అనే అంశంపై చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అణుశక్తి వినియోగంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తీర్చేందుకు రెండు రోజులుగా జరుగుతున్న సదస్సు ఉపకరించి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సులో ఏర్పాటు చేసిన ప్రదర్శన కూడా చైతన్యం కలిగించిందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎల్ రాజు మాట్లాడుతూ ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంత పెద్దస్థాయిలో అణుశక్తిపై సదస్సు నిర్వహించడం హర్షణీయమన్నారు. దీని ద్వారా యువత, విద్యార్థులు, అధ్యాపకుల్లో కూడా అవగాహన వచ్చిందన్నారు. కార్యక్రమంలో బార్క్ మీడియా రిలేషన్ హెడ్ ఆర్కే సింగ్, వైస్ ప్రిన్స్‌పాల్ డీజేఏ రామచంద్రరాజు, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ రంగరాజు, పలు విభాగాల అధిపతులు పాల్గొన్నారు. క్విజ్ విజేతలకు బహుమతులు రెండు రోజుల అణుశక్తి సదస్సుపై విద్యార్థుల కు శుక్రవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయనగరంలోని సన్ స్కూల్‌కు చెందిన ఎంఎన్ఎస్ నాగేంద్ర మొదటి స్థానం లో నిలిచారు. అలాగే శ్రీప్రకాష్ విద్యాసంస్థకు చెందిన జి సాయికార్తీక్, జి సాయిసాగర్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలు అంజేశారు. ప్రతిభ కనబరిచిన మరి కొందరు విద్యార్థులకు కూడా ప్రశంసాపత్రాలు అందించారు. వీరిని త్వరలో బార్క్‌కు ఆహ్వానిస్తారు.