breaking news
Murugan temple festival
-
ఫలితాలకు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన టీవీకే విజయ్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన కొద్దిరోజుల ముందు తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ ఆధ్యాత్మిక పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మంగళవారం(ఏప్రిల్ 28, 2026) తెల్లవారుజామునే చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో మదురై చేరుకున్న ఆయన, అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పట్టు పంచె, పట్టు చొక్కా ధరించిన విజయ్, స్వామివారి ‘విశ్వరూప దర్శనం’లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి స్వామివారి ప్రసాదంతో పాటు వెండి ‘వేల్’ను బహుకరించారు. ఇది మత విశ్వాసాలకి సంబంధించినది మాత్రమే కాదు..సర్వమత సామరస్యానికి అతీతంగా చేసిన ఒక సంజ్ఞ కూడా. ఈ నేపథ్యంలో ఆ ఆలయం ప్రత్యేకత, ప్రాశస్త్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ తిరుచెదూర్ ఆలయం సముద్రపు ఒడ్డున ఉంది. సుబ్రమణ్యస్వామి పిలవబడే మురుగన్ దేవునికి చెందినదే ఈ తిరుచెందూర్ ఆలయం. మరుగన్ ఆరు నివాసాలో ఒకటిగా పేరొందిన మహిమాన్వితమైన దేవాలయం ఇది. ఈ గుడి తమిళ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మికత వంటి అపార ప్రాముఖ్యత కలిగిన ఆలయం. చరిత్ర..ఈ ఆలయం చరిత్ర ప్రాచీన కాలం నాటిది. దీని ప్రస్తావన తమిళ సంగం సాహిత్యం కనిపిస్తుంది ఇక్కడ మురుగన్ దేవుడు రాక్షసుడైన సూరపద్మన్‌తో పోరాడి ఓడించాడని నమ్ముతారు. ఈ పౌరాణిక ఘట్టాన్ని సూరసంహారంగా జరుపుకుంటారు. శతాబ్దాలుగా, పాండ్య, చేర, చోళ, విజయనగర పాలకులతో సహా వివిధ తమిళ రాజవంశాలు దీని అభివృద్ధికి దోహదపడ్డారు. అలాగే, 17వ శతాబ్దంలో డచ్ వారి దండయాత్ర సమయంలో, కొన్ని విగ్రహాలను తీసుకువెళ్లారు, కానీ తరువాత వాటిని భక్తులు తిరిగి కనుగొనడం విశేషం.ఈ ఆలయం అద్భుతమైన ద్రావిడ వాస్తుశిల్పానికి నిలయం. ఇందులో విస్తృతమైన శిల్పాలు, స్తంభాల మండపాలు, ఎత్తైన గోపురాలు ఉంటాయి. ఇక్కడ సుమారు 137 అడుగుల ఎత్తులో ఉన్న 9-అంచెల రాజగోపురం నుంచి సముద్రాన్ని వీక్షించడం ప్రధాన ఆకర్షణ. అలాగే ఇక్క ప్రధాన గర్భగుడిలో యోగ భంగిమలో ఉన్న మరుగన్ దేవుడు వల్లి, దేవసేన సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. అంతేగాదు ఇక్కడ మురుగన్ వల్లి వివాహాల గాథలతో ముడిపడి ఉన్న ఒక గుహ కూడా సమీపంలో ఉంది. అలాగే సముద్రానికి సమీపంలో ఉన్న సహజ మంచినీటి ఊట నాజికినారును కూడా భక్తలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వెనక్కి తగ్గిన సునామీ..2004 డిసెంబర్లో వచ్చిన సునామీ తమిళనాడు తీరంపైనా తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సునామీ కారణంగా మిగతా ప్రాంతాల్లో సముద్ర జలాలు ముందుకు రాగా.. తిరుచెందూర్‌లో మాత్రం సముద్రుడు వెనక్కి తగ్గాడు. దీంతో సముద్ర తీరానికి ఆనుకొని ఉండే ఈ ఆలయానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. నీటి వల్ల ఈ ఆలయానికి ఎలాంటి హాని జరగదనే వరం ఉందని చెబుతారు.ఆలయ ఆచారాలు..ఆలయం సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.సాంప్రదాయబద్ధంగా రోజుకు ఆరుసార్లు మురుగన్ పూజ నిర్వహిస్తారు.దేవుడికి పాలు, చందనం, పవిత్ర జలంతో అభిషేకం చేస్తారు.ఆలయంలో భక్తులు భక్తికి చిహ్నంగా వేల్స్ సమర్పించి, తలనీలాలు సమర్పించుకుంటారు.ఎలా చేరుకోవాలంటే..సమీప విమానాశ్రయం - తూత్తుకుడి విమానాశ్రయం (సుమారు 40 కి.మీ.), మదురై విమానాశ్రయం (సుమారు 190 కి.మీ.) ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.తిరుచెందూర్ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన పట్టణాలతో అనుసంధానించబడి ఉంది.మదురై, తిరునెల్వేలి, తూత్తుకుడి నుంచి ఈ పట్టణానికి బస్సుల ద్వారా మంచి రవాణా సౌకర్యం ఉంది.(చదవండి: సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..) -
ఇండియా–ఇండోనేసియాది తరాల బంధం: మోదీ
న్యూఢిల్లీ: భారత్, ఇండోనేసియాల మధ్యనున్నది కేవలం భౌగోళికరాజకీయం సంబంధం కాదని ప్రధాని మోదీ చెప్పారు. రెండు దేశాలది వేల ఏళ్లుగా పెనవేసుకుపోయిన బంధమని చెప్పారు. రెండు దేశాల భిన్నత్వంలో ఏకత్వమనే సంప్రదాయం కొనసాగుతోందని తెలిపారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో సనాతన ధర్మ ఆలయంలో ఆదివారం జరిగిన మహా కుంభాభిషేకం సందర్భంగా వర్చువల్‌గా ప్రధాని మోదీ ప్రసంగించారు. జకార్తాలోని మురుగన్ ఆలయంలో అభిషేక ఉత్సవాల్లో పాలుపంచుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఇండోనేసియా ప్రజలు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. స్కంధ షష్ఠి కవచం ప్రజలను అన్ని వేళలా కాపాడాలని ఆకాంక్షించారు. మురుగన్ ఆలయంలో తిరుప్పుగల్ శ్లోకాలతో పూజలు కొనసాగాలన్నారు. ‘మనమంతా మురుగన్, శ్రీరాముడు, బుద్ధుని సంబం«దీకులమని చెప్పారు. -
రూ.39 వేలు పలికిన నిమ్మకాయ
టీనగర్: తిరువెన్నైనల్లూరు సమీపంలోగల ఒట్టనందల్ బాల దండాయుధపాణి ఆలయంలో నిమ్మకాయలను భక్తులు పోటాపోటీగా వేలంలో తీసుకున్నారు. ఒక నిమ్మకాయ రూ.39 వేలకు వేలం వేశారు. విల్లుపురం జిల్లా, తిరువెన్నైనల్లూరు సమీపంలో ఒట్టనందల్ గ్రామంలో బాల దండాయుధపాణి ఆలయం వుంది. ఇక్కడ పంగుణి ఉత్తర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మొదటి తొమ్మిది రోజులు సుబ్రహ్మణ్యస్వామి సమీపంలో ఏర్పాటైన శూలంపై ప్రతిరోజూ ఒకటి చొప్పున తొమ్మిది నిమ్మకాయలను గుచ్చి ఉంచుతారు. తర్వాత వీటిని బహిరంగంగా తీసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నిమ్మరసాన్ని సంతానం లేని దంపతులు సేవించినట్లయితే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వాసం. ఈ ఉత్సవాలలో 11వ రోజైన గురువారం రాత్రి 11 గంటల నుంచి 1.30 గంటల వరకు జరిగిన ఇడుంబన్ పూజలో ఇడుంబన్ స్వామికి కరువాడు భోజనం నైవేథ్యంగా సమర్పించారు. ఆ తర్వాత గ్రామ ప్రజల సమక్షంలో తొమ్మిది నిమ్మకాయలను వేలం వేసే కార్యక్రమం జరిగింది. గ్రామ అధ్యక్షుడు బాలకృష్ణన్, షణ్ముగం ఆచారి సమక్షంలో ఈ వేలం పాట సాగింది. వేలం ప్రారంభం కాగానే సుబ్రహ్మణ్యస్వామి శూలంలో ఉత్సవాల మొదటి రోజున గుచ్చివుంచిన నిమ్మకాయను వేలం వేశారు. దీనికోసం అనేక మంది దంపతులు పోటాపోటీగా వేలం పాడారు. చివరిగా ఈ నిమ్మకాయను ఒట్టనందల్ గ్రామానికి చెందిన జయరామన్, అమరావతి దంపతులు గరిష్టంగా రూ.39 వేలకు పాడారు. మూడో రోజు నిమ్మకాయను మండగమేడు గ్రామానికి చెందిన పన్నీర్ వసంత దంపతులు రూ.7,711కు వేలం పాడారు.


