breaking news
mumbaiindians
-
ముంబై ఇండియన్స్ బస్ డ్రైవర్‌గా రోహిత్ శర్మ.. వీడియో వైరల్
ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త అవతారమెత్తాడు. ముంబై ఇండియన్స్ టీమ్ బస్ నడుపుతూ రోహిత్ శర్మ అందరని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆదివారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. దీంతో వాంఖడేలో ముంబై జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రాక్టీస్ ముగించుకొని ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు బస్సులో వెళ్లేందుకు సిద్దమవ్వగా రోహిత్ శర్మ డ్రైవర్ సీటులో కన్పించి అందరికి షాకిచ్చాడు. అప్పటికే టీమ్ బస్సు వద్దకు ముంబై అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో బస్సును నడపాలి పక్కకు జరగాలంటూ హిట్‌మ్యాన్ సైగలు చేశాడు. దీంతో అందరూ ఒక్కసారిగా రోహిత్ రోహిత్ అంటూ గట్టిగా అరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రోహిత్ భాయ్యాలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. Hahaha this is sooo cutee😂😭🤣 Roo driving bus😭🤌🏻❤️#RohitSharma pic.twitter.com/VtP3PDuWCo — Nehhaaa! (Rohitian)✨❤️ (@nehhaaa__) April 13, 2024 -
MajorLeagueCricket: ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా పొలార్డ్
ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఓ టీ20 లీగ్‌ను నిర్వహించడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో అమెరికా వేదికగా మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) టోర్నీ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు ఇందులో పాల్గొంటుండగా నాలుగు టీమ్‌లు ఐపీఎల్ యాజమాన్యాలకు (ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై) చెందినవే ఉన్నాయి. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. న్యూయార్క్ ఫ్రాంచైజీని దక్కించుకోగా.. సీఎస్కే మాదిరిగానే ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్.. టెక్సాస్ టీమ్ ను కొనుగోలు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ లాస్ ఏంజెల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్:.. సియాటెల్ ను దక్కించుకుంది. అభిమానులు ఈ లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా భావిస్తున్నారు. న్యూయర్క్ కెప్టెన్‌గా పొలార్డ్ ఇక మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్‌లో ఏంఐ న్యూయర్క్ కెప్టెన్‌గా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కిరాన్ పొలార్డ్ ఎంపికయ్యాడు. అదేవిధంగా ఏంఐ న్యూయర్క్ ఫ్రాంచైజీ హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ రాబిన్ పీటర్సన్, బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఆఫ్ఘన్ సూపర్ స్టార్ రషీద్ ఖాన్, కగిసో రబాడ, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఏంఐ న్యూయర్క్ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది. వీరితో పాటు యువ ఆటగాళ్లు టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్ కూడా ఉన్నారు. కాగా జులై 13 నుంచి ఈ క్రేజీ లీగ్ మొదలుకానున్నది. చదవండి: Nahida Khan Retirement: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ -
హైదరాబాద్‌కు వరుసగా రెండో విజయం