breaking news
multistarer
-
చిరంజీవితో బాలకృష్ణ మల్టీస్టారర్.. గూస్ బంప్స్ గ్యారంటీ!
దశాబ్దాల నుండి..మాస్‌ను మంత్రముగ్డులను చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి,నటసింహం నందమూరి బాలకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే,ఉహిస్తేనే, గూస్ బంప్స్ గ్యారంటీ. ఇప్పుడు ఈ కల సాకారం కాబోతుందా.? ఆ తరంలో ఎన్టీఆర్, ఏన్నార్, కృష్ణ లాంటి స్టార్లు ఒకే స్క్రీన్ లో కనిపించి..అభిమానులను ఖుషీ చేశారు. ఇప్పుడు ఈ తరం హీరోలు నందమూరి నటసింహం, కొణెదెల హీరో కలిసి నటించబోతున్నారా ?ఈ బిగ్ ప్రాజెక్టుకు..అల్లు అరవింద్ స్కేచ్ వేస్తున్నాడా ?ఇంతకీ ఈ ప్రాజెక్ట్ నిజంగా ఉంటుందా ,ఇప్పుడు ఎందుకు ఈ చర్చ వచ్చింది అంటారా ? ఎన్టీఆర్ ,ఏన్నార్ ఓ తరం నటులు.ఫిల్మ్ ఇండిస్ట్రీకి రెండు కళ్లలాంటి వారు.దశాబ్దాల పాటు నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు.అలాంటి స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.తర్వాత వచ్చిన కృష్ణ,కృష్ణం రాజు,శోభన్ భాబు లాంటి హీరోలు కూడా ఒకే స్క్రీన్ మీద కనిపించి అలరించిన వారే.ఇలాంటి సాలిడ్ మల్టీ స్టారర్లు చేసి వెండితెరను కళకళలాడేలా చేసారు ఆ తరం తర్వాత..చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ తెలుగు వెండితెరకు నాలుగు స్థాంబాలుగా నిలిచారు.అయితే ఈ స్టార్లు..ఒకే స్క్రీన్ల మీద కనిపించింది మాత్రం లేదు.ఫ్యాన్స్ మధ్య పోటీ,వీళ్లను తెర మీద చూపించే కథ రాకపోవటం అలాగే..స్టార్ల మధ్య ఇగో ఫ్యాక్టర్లు లాంటివి కూడా..వీళ్లు కలిసి నటించకపోవటానికి కారణంగా నిలిచాయి.ఏమైతేనేం .వెండితెర మీద ఈ స్టార్ల మల్టీ స్టారర్ సినిమాలు చూసే భాగ్యం అభిమానులకు లేకుండా పోయింది.అయితే..ఇప్పుడు మాస్ గా బాప్ ..మెగాస్టర్ చిరంజీవి,నందమూరి నటసింహంల మల్టీ స్టారర్ తెర మీదికి వచ్చింది.ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు వేదికగా ఆహా ప్లాట్ ఫామ్ నిలిచింది నందమూరి నటసింహం ఆహా ప్లాట్ ఫామ్ లో ఆన్ స్టాపబుల్ సీజన్ 2 చేస్తున్న మ్యాటర్ తెలిసిందే.మొదటి సీజన్ హిట్ కొట్టింది.ఈ సెకండ్ సీజన్ కూడా బాగా అలరిస్తుంది. 90 సంవత్సరాల తెలుగు సినిమా సెలబ్రిషన్స్ సందర్బంగా..నిర్మాతలు..అల్లు అరవింద్,దగ్గుబాటి సురేష్ బాబు,దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావును కలిపి బాలయ్య ఇంటర్వూ చేశాడు. ఇంటర్వూలో భాగంగా..అల్లు అరవింద్ తో ..మనిద్దరి కాంబినేషనే బ్యాలన్స్ అని బాలయ్య అడగగా,మీతో చిరంజీవి గారుతో కలిపి కాంబినేషన్ తీద్దామని వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు అల్లు అరవింద్. వెంటనే బాలకృష్ణ స్క్రిప్ట్ ఎలా ఉండాలో కూడా చెప్పేశాడు. మా మల్టీస్టారర్ లో చిరంజీవికి పాటలు ఉండాలి. నాకు ఫైట్స్ ఉండాలి. ఇంట్రో సాంగ్ చిరంజీవిది, క్లైమాక్స్ ఫైట్ నాది అని బాలయ్య చెప్పుకొచ్చాడు. మరి అల్లు అరవింద్ ఆ మాటలు సీరియస్ గా అన్నాడా ? మరి ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కాని..చిరు,బాలయ్య కలిసి మల్టీ స్టారర్ చేయటం అనే అలోచనే ..ఓ సెలబ్రిషన్‌ల ఉంది.మరి వీరిద్దరు కలిసి నటించి..వెండితెర సెలబ్రేషన్స్ చేయాలని అశిద్దాం. -
మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌లో నాని..!
వరుస సూపర్ హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని నిన్ను కోరితో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. నేచురల్ స్టార్‌గా ఆకట్టుకుంటున్న నాని, మాస్ హీరోయిజం జోలికి పోకుండా ఆసక్తికరమైన కథలతో అలరిస్తున్నాడు. ఇప్పటికే మల్టీప్లెక్స్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు అన్ని వర్గాలను అలరించే పనిలో ఉన్నాడు. అందుకే మల్టీ స్టారర్ సినిమాలకు ఓటేస్తున్నాడు. రైడ్, ఎవడే సుబ్రమణ్యం, నిన్నుకోరి సినిమాల్లో ఇతర హీరోలతో కలిసి నటించినా.. సీనియర్ హీరోతో మాత్రం ఇంత వరకు మల్టీ స్టారర్ సినిమా చేయలేదు. తాజా సమాచారం ప్రకారం.. నాని, సీనియర్ హీరో నాగ్‌తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాడట. చాలా రోజులుగా ఈ టాక్ వినిపిస్తున్నా.. నాగ్ నుంచి గాని, నాని నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ప్రస్తుతం నాని చేతులో మూడు సినిమాలు ఉన్నాయి. నాగ్ కూడా సెట్స్ మీద ఉన్న రాజుగారి గదిలో పాటు మరో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయితేగాని ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. -
సీనియర్ హీరోతో నాని మల్టీ స్టారర్..?
వరుస సూపర్ హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని. నేచురల్ స్టార్‌గా ఆకట్టుకుంటున్న నాని, మాస్ హీరోయిజం జోలికి పోకుండా ఆసక్తికరమైన కథలతో అలరిస్తున్నాడు. ఇప్పటికే లవర్ బాయ్, ఫ్యామిలీ హీరో ట్యాగ్లు సొంతం చేసుకున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో రైడ్, ఎవడే సుబ్రమణ్యం లాంటి సినిమాల్లో ఇతర హీరోలతో కలిసి నటించినా.. సీనియర్ హీరోతో మాత్రం ఇంత వరకు మల్టీ స్టారర్ సినిమా చేయలేదు. తాజా సమాచారం ప్రకారం.. నాని, సీనియర్ హీరో నాగ్‌తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాడట. గతంలో నిఖిల్‌తో కలిసి నాగార్జున మల్టీ స్టారర్ చేస్తున్నాడన్న వార్తలు వినిపించాయి. మరి అదే సినిమాను నిఖిల్‌కు బదులు నానితో చేస్తున్నాడా..? లేక ఇది వేరే సినిమానా అన్న విషయం తెలియాంలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజుగారి గది 2 సినిమాలో నటిస్తున్నాడు నాగ్. నాని కూడా నిన్నుకోరి సినిమాతో పాటు దిల్ రాజు నిర్మాణంలో ఎమ్సీఏ సినిమాకు రెడీ అవుతున్నాడు.