మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్లో నాని..! | Nagarjuna, Nani multistarer | Sakshi
Sakshi News home page

మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్లో నాని..!

Jul 19 2017 9:27 AM | Updated on Jul 15 2019 9:21 PM

మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్లో నాని..! - Sakshi

మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్లో నాని..!

వరుస సూపర్ హిట్స్తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని నిన్ను కోరితో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

వరుస సూపర్ హిట్స్తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని నిన్ను కోరితో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. నేచురల్ స్టార్గా ఆకట్టుకుంటున్న నాని, మాస్ హీరోయిజం జోలికి పోకుండా ఆసక్తికరమైన కథలతో అలరిస్తున్నాడు. ఇప్పటికే మల్టీప్లెక్స్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు అన్ని వర్గాలను అలరించే పనిలో ఉన్నాడు. అందుకే మల్టీ స్టారర్ సినిమాలకు ఓటేస్తున్నాడు. రైడ్, ఎవడే సుబ్రమణ్యం, నిన్నుకోరి సినిమాల్లో ఇతర హీరోలతో కలిసి నటించినా.. సీనియర్ హీరోతో మాత్రం ఇంత వరకు మల్టీ స్టారర్ సినిమా చేయలేదు.

తాజా సమాచారం ప్రకారం.. నాని, సీనియర్ హీరో నాగ్తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాడట. చాలా రోజులుగా ఈ టాక్ వినిపిస్తున్నా.. నాగ్ నుంచి గాని, నాని నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ప్రస్తుతం నాని చేతులో మూడు సినిమాలు ఉన్నాయి. నాగ్ కూడా సెట్స్ మీద ఉన్న రాజుగారి గదిలో పాటు మరో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయితేగాని ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement