breaking news
Mughal princesses
-
గోల్కొండ వజ్రానికి రూ.45 కోట్లు
న్యూయార్క్: భారత్‌ను పాలించిన మహారాజులు, మొఘలులు వినియోగించిన వజ్రాభరణాలు న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ వేలంపాటలో కోట్లకు అమ్ముడుపోయాయి. ప్రఖ్యాత క్రిస్టీస్ వేలంసంస్థ ఈ వేలం నిర్వహించింది. గోల్కొండలో దొరికిన మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ వజ్రం, నిజాం ధరించిన గొలుసు, ఆర్కాట్ నవాబుకు చెందిన వజ్రం, స్వర్ణాభరణాలు, కత్తులు, రత్నాలుసహా దాదాపు 400 పురాతన వస్తువులను వేలం వేశారు. ‘మహారాజులు, మొఘలుల వైభవం’ పేరిట నిర్వహించిన ఈ వేలంలో క్రిస్టీస్ సంస్థకు రూ.756 కోట్లు వచ్చాయి. భారతీయ నగలు, కళాఖండాలు గతంలో ఎన్నడూ ఇంతటి భారీ ధరకు అమ్ముడుపోలేదని క్రిస్టీస్ పేర్కొంది. 2011లో ఎలిజబెత్ రాణి సేకరించిన వస్తువులు రూ.14.4 కోట్ల ధర పలికాయి. గోల్కొండలో దొరికిన 52.58 క్యారెట్ల బరువైన మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ వజ్రం రూ.45 కోట్లు పలికింది. ఆర్కాట్ నవాబుకు చెందిన 17 క్యారెట్ల గోల్కొండ వజ్రం(ఆర్కాట్–2) రూ.23.5 కోట్లకు అమ్ముడుపోయింది. హైదరాబాద్ నిజాం ధరించిన 33 వజ్రాలు పొదిగిన హారం రూ. 17 కోట్లు పలికింది. ఇండోర్ మహారాజు యశ్వంత్ రావ్ హాల్కర్ 2 ధరించిన రత్నాలతో కూడిన గొలుసు రూ. 1.44 కోట్లు, జైపూర్ రాజమాత గాయత్రీ దేవి ధరించిన వజ్రపుటుంగరం రూ. 4.45 కోట్లు, 1680–1720 కాలానికి చెందిన వజ్రాలు పొదిగిన హుక్కా సెట్ రూ.5.3కోట్లు, సీతారామాంజనేయుల ప్రతిమలున్న మరో హారం రూ. 5.12 కోట్లు పలికాయి. 5 వరసల ముత్యాల గొలుసు రూ.11.8 కోట్లకు, వజ్రాలహారం రూ. 1.5 కోట్లకు అమ్ముడుపోయాయి. ఖతార్‌కు చెందిన రాజకుటుంబం సేకరించిన ఈ ఆభరణాలను క్రిస్టీస్ వేలం వేసింది. మొఘల్ మహారాజు షాజహాన్ వాడిన బాకు రూ.23.4 కోట్లు పలికింది. హైదరాబాద్ నిజాం నవాబు వాడిన కత్తి రూ. 13.4 కోట్లు పలికింది. భారత్‌కు చెందిన ఒక కత్తి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి. భారత్ సహా 45 దేశాలకు చెందిన ఔత్సాహికులు ఈ వేలంలో పాల్గొన్నారు. జైపూర్, ఇండోర్, బరోడా రాజవంశీకులకు చెందిన ఆభరణాలు, వస్తువులనూ ఈ వేలంలో పెట్టారు. షాజహాన్ కత్తి మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ వజ్రం -
ఎర్రకోటలో షాజహాన్ ‘కుమార్తెలు’
న్యూఢిల్లీ: ఈరోజు ఎర్రకోటను సందర్శించే వారికి మొఘల్ యువరాణులు జహాన్ ఆరా, రోషన్ ఆరాలను కలుసుకొనే అవకాశం లభించనుంది. సందర్శకులతో కనీసం ఒకగంట పాటు గడిపే మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమార్తెలు తరాలకు చెందిన వీరగాథలను మీతో పంచుకోనున్నారు. దివాన్-ఇ-ఖాస్‌లో ఆకస్మికంగా మీ మధ్యకు వచ్చి గంటసేపు సందర్శకులతో ఉంటారు. అయితే వీరు నిజంగా షాజహాన్ కుమార్తెలు కారు. నగర పౌరులకు చరిత్ర, వారసత్వ సంపదపై అవగాహనకల్పించేందుకు భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) ఈ ఏర్పాట్లు చేసింది. ప్రపంచ వారసత్వ వారోత్సవాన్ని (నవంబర్ 19-25) పురస్కరించుకొని ఇద్దరు కళాకారులను ఏఎస్ఐ ఎంపిక చేసింది. మధ్యాహ్నం 2.30-3.30గంటల సమయంలో మొఘల్ కాలంనాటి దుస్తులను ధరించి వచ్చే ఈ కళాకారులు సందర్శకుల వద్దకు వచ్చి చరిత్రను వల్లెవేస్తారు. షాజహాన్ పెద్దకుమార్తె జహాన్ ఆరా బేగం సమాధి దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉంది. సోదరుడు ఔరంగజేబును సింహాసనం ఎక్కించడంలో కీలకపాత్ర పోషించిన రోషన్ ఆరా బేగం షాజహాన్ రెండో కుమార్తె. వీరిద్దరి పాత్రలను కళాకారులు ఎర్రకోటలో శనివారం నాడు ప్రదర్శించనున్నారు.