breaking news
Mudinja Ivana Pudi
-
ఆ ముగ్గురు అతిథులా?
తన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వనటుడు కమలహాసన్‌ను ఆహ్వానించామని అందుకు అంగీకరించారని బెంగళూర్‌కు చెందిన నిర్మాత అ న్నారు. అయితే అనూహ్యంగా కమలహాసన్ మెట్లపై నుంచి జారి పడి ఆస్పత్రిలో చికి త్స పొందుతుండడంతో చిత్ర యూనిట్ సహా తాను చాలా నిరుత్సాహపడ్డామన్నారు. ఈ ఆడియో కార్యక్రమానికి అన్ని సన్నాహాలు చేసుకోవడంతో ఏం చేయాలో పాలు పోలేదన్నారు. అలాంటి సమయం లో దర్శకుడు కేఎస్.రవికుమార్ అంతా బాగానే జరుగుతుంది. తాను చూసుకుంటానన్నారు. అతిథులుగా నటు డు ధనుష్, శివకార్తికేయన్, విజయ్సేతుపతులను ఆహ్వానిద్దాం అని చెప్పారన్నారు. అయితే వాళ్ల ముగ్గురి గురించి బయట ఏవేవో చెప్పుకుంటున్నారన్నారు. తన చిత్ర ఆడియో ఆవి ష్కరణ కార్యక్రమానికి ధనుష్, శివకార్తికేయన్,విజయ్‌సేతుపతి వస్తున్నారని చెప్పడంతో అతిథులు ఆ ముగ్గురా? అది జరిగే పనేనా? అని చాలా మంది చాలా రకాలుగా అన్నారని, అలాంటిది ఇక్కడ ఆ ముగ్గురినీ చూస్తుంటే ఎంత ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొందో అర్థం అవుతోందని ఆ నిర్మాత అన్నారు. ఇంతకీ ఆ నిర్మాత ఎవరో చెప్పలేదు కదూ’ఆయన పేరు ఎంబీ.బాబు. రాక్‌లైన్ వెంకటేశ్ సమర్పణలో ఈయన నిర్మిస్తున్న చిత్రం ముడింజా ఇవనై పుడి. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి కేఎస్.రవికుమార్ దర్శకుడు.ఇక నాన్ఈ చిత్రంతో కోలీవుడ్‌లో విలన్‌గా పరిచయమైన కన్నడ ప్రముఖ నటుడు కిచ్చా సుధీప్ ఈ చిత్రం ద్వారా ఇక్కడ హీరోగా పరిచయం అవుతున్నారు. నిత్యామీనన్ హీరోయిన్.డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. నటుడు ధనుష్ సమక్షంలో విజయ్‌సేతుపతి చిత్ర ఆడియోను ఆవిష్కరించగా శివకార్తికేయన్ తొలి ప్రతిని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్బీ.చౌదరి, కే.భాగ్యరాజ్, పి.వాసు, చేరన్ అతిథులుగా పాల్గొని హీరోగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న కిచ్చా సుధీప్‌కు శుభాభినందనలు తెలిపారు. కాగా ఈగోలు అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతున్న నటుడు ధనుష్, శివకార్తికేయన్, విజయ్‌సేతుపతి వేదికపై పక్క పక్కనే కూర్చోవడం చాలా మందికి ఆసక్తిని రేకెత్తించింది. అయితే శివకార్తికేయన్, విజయ్‌సేతుపతి మధ్య మధ్యలో సరదాగా ముచ్చటించుకున్నా ధనుష్ మాత్రం మౌనం వహించడం శివకార్తికేయన్‌కు ఆయనకు మధ్య మనస్పర్థలున్నాయన్న ప్రచారాన్ని నిజం చేసేలా అనిపించింది. నటుడు శివకార్తికేయన్ మట్లాడుతూ ధనుష్ తన లాంటి వారిని చాలా ప్రోత్సహించారని పేర్కొన్నారు.అదే విధంగా ధనుష్ మాట్లాడుతూ తాను ఇప్పటికే శివకార్తికేయన్, విజయ్‌సేతుపతిలతో కలిసి నటించానని, మరో సారి విజయ్‌సేతుపతితో కలిసి నటించనున్నానని తెలిపారు. అలాగే నటుడు కిచ్చా సుధీప్తో కలిసి నటించాలన్న కోరికను వ్యక్తం చేశారు. నాన్ఈ చిత్రంలో ఆయన నటన చూసి అబ్బురచెందానన్నారు. కిచ్చా సుధీప్ గురించి దివంగత దర్శకుడు బాలు మహేంద్ర ఒక్క మాట అన్నారన్నారు. నాన్ఈ చిత్రంలో ఆయన నటనకు గానూ అవార్డుల కమిటీలో తాను సభ్యుడిగా ఉండి ఉంటే కిచ్చాసుధీప్కు జాతీయ అవార్డును ప్రకటించేవాడినని అన్నారని, ఈ విషయాన్ని సమయం వచ్చినప్పుడు తాను కిచ్చా సుధీప్తో చెప్పాలనుకున్నానని, అందుకు సరైన సమయం ఇదేనని భావిస్తున్నానని ధనుష్ పేర్కొన్నారు. -
సుదీప్ హీరోగా ముడింజా ఇవన్ పుడి
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ తమిళంలో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ముడింజా ఇవన్ పుడి. కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాంబాబు ప్రొడక్షన్స్ పతాకంపై ఎంపీ.బాబు నిర్మిస్తున్నారు. నాన్ఈ చిత్రంలో విలనిజాన్ని పండించిన సుదీప్ ఆ తరువాత బ్రహ్మాండ చిత్రం బాహుబలిలో రాజుగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం పులిలో మరోసారి విలన్‌గా సుదీప్ నట విజృంభణ చూడబోతున్నాం. అలాంటి విలక్షణ నటుడు కన్నడ సూపర్‌స్టార్ తమిళంలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ముడింజా ఇవన్ పుడి. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో పోకిరి, పూజై చిత్రాల ఫేమ్ ముఖేష్ తివారి విలన్‌గా నటిస్తున్నారు. ఎదుర్‌నీశ్చల్, పాండినాడు చిత్రాల్లో ప్రాచుర్యం పొందిన శరత్ లోహితేసువ మరో విలన్‌గా నటిస్తుండగా నాజర్, సాయిరవి, అవినాష్, అచ్చుత్‌కుమార్, లతారావు, సుకన్య, విసు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. రెండవ షెడ్యూల్ చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం కోసం అంబత్తూర్లో పోలీస్‌స్టేషన్ సెట్ వేసి 10 రోజుల పాటు ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. మరో 30 రోజుల పాటు చెన్నైలోనే ముడింజా ఇవన్ పుడి చిత్ర షూటింగ్‌ను నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.