ఆ ముగ్గురు అతిథులా? | Mudinja Ivana Pudi Audio Launch | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురు అతిథులా?

Jul 21 2016 2:03 AM | Updated on Jul 12 2019 4:40 PM

ఆ ముగ్గురు అతిథులా? - Sakshi

ఆ ముగ్గురు అతిథులా?

తన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వనటుడు కమలహాసన్‌ను ఆహ్వానించామని

 తన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వనటుడు కమలహాసన్‌ను ఆహ్వానించామని అందుకు అంగీకరించారని బెంగళూర్‌కు చెందిన నిర్మాత అ న్నారు. అయితే అనూహ్యంగా కమలహాసన్ మెట్లపై నుంచి జారి పడి ఆస్పత్రిలో చికి త్స పొందుతుండడంతో చిత్ర యూనిట్ సహా తాను చాలా నిరుత్సాహపడ్డామన్నారు.
 
 ఈ ఆడియో కార్యక్రమానికి అన్ని సన్నాహాలు చేసుకోవడంతో ఏం చేయాలో పాలు పోలేదన్నారు. అలాంటి సమయం లో దర్శకుడు కేఎస్.రవికుమార్ అంతా బాగానే జరుగుతుంది. తాను చూసుకుంటానన్నారు. అతిథులుగా నటు డు ధనుష్, శివకార్తికేయన్, విజయ్‌సేతుపతులను ఆహ్వానిద్దాం అని చెప్పారన్నారు. అయితే వాళ్ల ముగ్గురి గురించి బయట ఏవేవో చెప్పుకుంటున్నారన్నారు.
 
  తన చిత్ర ఆడియో ఆవి ష్కరణ కార్యక్రమానికి ధనుష్, శివకార్తికేయన్,విజయ్‌సేతుపతి వస్తున్నారని చెప్పడంతో అతిథులు ఆ ముగ్గురా? అది జరిగే పనేనా? అని చాలా మంది చాలా రకాలుగా అన్నారని, అలాంటిది ఇక్కడ ఆ ముగ్గురినీ చూస్తుంటే ఎంత ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొందో అర్థం అవుతోందని ఆ నిర్మాత అన్నారు. ఇంతకీ ఆ నిర్మాత ఎవరో చెప్పలేదు కదూ’ఆయన పేరు ఎంబీ.బాబు. రాక్‌లైన్ వెంకటేశ్ సమర్పణలో ఈయన నిర్మిస్తున్న చిత్రం ముడింజా ఇవనై పుడి.
 
  తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి కేఎస్.రవికుమార్ దర్శకుడు.ఇక నాన్‌ఈ చిత్రంతో కోలీవుడ్‌లో విలన్‌గా పరిచయమైన కన్నడ ప్రముఖ నటుడు కిచ్చా సుధీప్ ఈ చిత్రం ద్వారా ఇక్కడ హీరోగా పరిచయం అవుతున్నారు. నిత్యామీనన్ హీరోయిన్.డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్‌లో నిర్వహించారు. నటుడు ధనుష్ సమక్షంలో విజయ్‌సేతుపతి చిత్ర ఆడియోను ఆవిష్కరించగా శివకార్తికేయన్ తొలి ప్రతిని అందుకున్నారు.
 
  ఈ కార్యక్రమంలో ఆర్‌బీ.చౌదరి, కే.భాగ్యరాజ్, పి.వాసు, చేరన్ అతిథులుగా పాల్గొని హీరోగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న కిచ్చా సుధీప్‌కు శుభాభినందనలు తెలిపారు. కాగా ఈగోలు అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతున్న నటుడు ధనుష్, శివకార్తికేయన్, విజయ్‌సేతుపతి వేదికపై పక్క పక్కనే కూర్చోవడం చాలా మందికి ఆసక్తిని రేకెత్తించింది. అయితే శివకార్తికేయన్, విజయ్‌సేతుపతి మధ్య మధ్యలో సరదాగా ముచ్చటించుకున్నా ధనుష్ మాత్రం మౌనం వహించడం శివకార్తికేయన్‌కు ఆయనకు మధ్య మనస్పర్థలున్నాయన్న ప్రచారాన్ని నిజం చేసేలా అనిపించింది. నటుడు శివకార్తికేయన్ మట్లాడుతూ ధనుష్ తన  లాంటి వారిని చాలా ప్రోత్సహించారని పేర్కొన్నారు.అదే విధంగా ధనుష్ మాట్లాడుతూ తాను ఇప్పటికే శివకార్తికేయన్, విజయ్‌సేతుపతిలతో కలిసి నటించానని, మరో సారి విజయ్‌సేతుపతితో కలిసి నటించనున్నానని తెలిపారు.
 
 అలాగే నటుడు కిచ్చా సుధీప్‌తో కలిసి నటించాలన్న కోరికను వ్యక్తం చేశారు. నాన్‌ఈ చిత్రంలో ఆయన నటన చూసి అబ్బురచెందానన్నారు. కిచ్చా సుధీప్ గురించి దివంగత దర్శకుడు బాలు మహేంద్ర ఒక్క మాట అన్నారన్నారు. నాన్‌ఈ చిత్రంలో ఆయన నటనకు గానూ అవార్డుల కమిటీలో తాను సభ్యుడిగా ఉండి ఉంటే కిచ్చాసుధీప్‌కు జాతీయ అవార్డును ప్రకటించేవాడినని అన్నారని, ఈ విషయాన్ని సమయం వచ్చినప్పుడు తాను కిచ్చా సుధీప్‌తో చెప్పాలనుకున్నానని, అందుకు సరైన సమయం ఇదేనని భావిస్తున్నానని ధనుష్ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement