breaking news
MP Ramya
-
ప్రధానిపై నటీమణి విమర్శలు...
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో పరివర్తన ర్యాలీ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ సోషల్ మీడియా సారథి, మాజీ ఎంపీ రమ్య ట్విట్టర్లో చేసిన విమర్శలపై బీజేపీ నేతల నుంచి అంతేస్థాయిలో దాడి ఎదురవుతోంది. మోదీ ఖాళీ కుండ పథకాన్ని ప్రకటించారని ఈ నటీమణి ఆదివారం దుయ్యబట్టారు. రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా ప్రధాని మోదీ టాప్ (టమాటా, ఉల్లిగడ్డ, ఉర్లగడ్డ) ప్రణాళికను మోదీ ప్రకటించడం తెలిసిందే. మోదీ మత్తు పదార్థాల మత్తులో ఉన్నప్పుడు ప్రకటించిన ప్రణాళిక అది, అది వాస్తవంగా పాట్ (ఖాళీ కుండ) అని రమ్య ట్విట్టర్లో ఆరోపణలు చేశారు. ఆ విమర్శలు ఆమె అజ్ఞానాన్ని, నోటి దురుసును చూపుతున్నాయంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతో విదేశాలకు పారిపోయిన మాజీ ఎంపీ రమ్య పేరులో కూడా మందు పేరుందనే విషయాన్ని రమ్య గుర్తుంచుకోవాలంటూ బీజేపీ నాయకురాలు శిల్ప గణేశ్ ట్విట్టర్లో విమర్శించారు. స్థాయి తెలుసుకో: జగ్గేశ్ రమ్యపై నటుడు జగ్గేశ్ కూడా స్పందించారు. ప్రధానమంత్రి వంటి ఉన్నతస్థాయిలోనున్న వ్యక్తులపై విమర్శలు చేసే ముందు తమ హోదా, కీర్తి, అభివృద్ధి పనులను గుర్తు చేసుకోవాలంటూ విమర్శించారు. వీరితో పాటు జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ కూడా ప్రధాని మోదీని విమర్శించే స్థాయి రమ్యకు లేదని అన్నారు. ప్రధానమంత్రిని ఎవరైనా గౌరవించాల్సిందేనన్నారు. రమ్య ట్విట్టర్లో చేసిన విమర్శలపై సామాజిక మాధ్యమాల్లో పౌరుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రమ్య గతంలో కూడా దూకుడు ప్రకటనలతో పలు వివాదాలను రేకెత్తించడం తెలిసిందే. -
మరో వివాదంలో మాజీ ఎంపీ రమ్య
మండ్య : మండ్య పర్యటనలో భాగంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ యువకుడిని రౌడీ అంటూ దూషించడంతో వివాదం నెలకొంది. వివరాలు...రమ్య గతంలో మండ్య ఎంపీగా ఉన్న సమయంలో వన్ ఇండియా వన్ ఎంపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సమాజం, ప్రజల సమస్యలు వాటికి పరిష్కార మార్గాలపై థీసిస్ రాసిన వారికి రూ. 2.5 లక్షల బహుమానాన్ని ప్రకటించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 117 మంది యువకులు అనేక సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను వివరిస్తూ రాసిన ధీసిస్ను ఆమెకు సమర్పించారు. కొంతకాలానికి ఆమె పదవి విరమణ కావడంతో యువకులు అందించిన ధీసిన్ను ఆమె ఆ తరువాత పట్టించుకోలేదు. ఇదే సమయంలో ధీసిస్ సమర్పించిన చిక్కమరళి గ్రామానికి చెందిన పాండుదురై అనే యువకుడు రమ్యను కలవాడానికి పలుమార్లు యత్నించి విఫలమయ్యాడు. ఇదిలా ఉంటే సోమవారం రమ్య జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పాండుదురై అక్కడికి చేరుకుని వన్ ఇండియా, వన్ఎంపీ కార్యక్రమంపై ఆమెను నిలదీశాడు. దీంతో ఆమె తాను ఇప్పుడు ఎంపీనిన కాదని, దీనిపై కలెక్టర్ లేదా ఆ ప్రాంత ఎంపీని అడగాలంటూ బదులిచ్చింది. దీంతో అసహనానికి గురైన ఆ యువకుడు బహుమతి ఇవ్వకపోయిన కనీసం అభినందించాలని డిమాండ్ చేశాడు. దీంతో రమ్య ఆగ్రహంతో నీవు రౌడీలా మాట్లాడుతున్నావంటూ అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతలోపు ఇదంతా గమనించిన రమ్య మద్దతుదారులు యువకుడిపై ఇష్టారీతిన దాడికి దిగారు. ఇది గమనించిన స్థానికులు రమ్య మద్దతుదారుల నుంచి యువకుడిని రక్షించి యువకుడిని నిందించడంతో పాటు ఆమె అనుచరులు అతడిపై దాడికి పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రమ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు, పోలీసులు యువకుడిని, ప్రజలను శాంత పరచడంతో అక్కడి నుం,చి వెనుగిరిగారు.