breaking news
mothugudem
-
హడలెత్తించిన 14 అడుగుల గిరినాగు
మోతుగూడెం: తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెం ఏపీ జెన్కో ఫిల్టర్ హౌస్ వద్ద 14 అడుగుల గిరినాగు స్థానికులను బుధవారం హడలెత్తించింది. మంచినీటి ట్యాంక్ వద్ద రెండు రోజుల నుంచి పాము సంచరించడాన్ని జెన్కో ఉద్యోగులు గమనించి వన్యప్రాణి విభాగానికి సమాచారమిచ్చారు. వారు నలుగురు స్నేక్ హెల్పర్స్ బృందాన్ని పంపారు. వారు పామును చాకచక్యంగా పట్టుకున్నారు. పాముని అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని అటవీ శాఖ సిబ్బంది చెప్పారు. చదవండి: పావురంపై ఎఫ్ఐఆర్ నమోదు..ఎందుకో తెలుసా? బంగారు టీషర్ట్! చూశారా..? -
జలపాతం వద్ద సినీ సందడి
మోతుగూడెం(రంపచోడవరం): చింతూరు మండలం పొల్లూరు జలపాతం వద్ద శుక్రవారం సినీసందడి నెలకొంది. యాంగ్రీహీరో రాజశేఖర్ ప్రధానపాత్రలో నటిస్తున్న కొత్తసినిమా గరుడవేగా షూటింగ్ నిమిత్తం చిత్రయూనిట్ శుక్రవారం పొల్లూరు వచ్చింది. పొల్లూరు జలపాతం, దారాలమ్మ గుడి వద్ద సీలేరు నదీ అందాలను యూనిట్ సభ్యులు పరిశీలించి జలపాతం వద్ద కొంతసేపు షూటింగ్ చేపట్టారు. హీరో రాజశేఖర్ మాట్లాడుతూ జ్యోస్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై యాక్షన్ మూవీ నిర్మిస్తున్నట్టు తెలిపారు. 15 రోజులక్రితం షూటింగ్ ప్రారంభమైందని శుక్ర, శనివారాల్లో పొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలిపారు. కోటేశ్వరరాజు నిర్మాతగా ప్రవీణ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో హీరోయిన్గా కొత్త అమ్మాయి ఆమన్ అధితి నటిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. నాజర్, పోసాని కృష్ణమురళి, పూజాకుమార్, కిషోర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నట్టు రాజశేఖర్ తెలిపారు. రాజశేఖర్ వెంట ఆయన సతీమణి జీవిత కూడా ఉన్నారు. 19ఆర్సీవీఎం165– దర్శకుడితో చర్చిస్తున్న హీరో రాజశేఖర్, జీవిత