breaking news
most expensive phone
-
నీతా అంబానీ దగ్గర రూ.వందల కోట్ల ఐఫోన్.. నిజమేనా?
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ (Mukesh Ambani) సతీమణి నీతా అంబానీ (Nita Ambani) తరచూ వార్తలలో నిలుస్తుంటారు. ఆడంబరాలకు, విలాసవంతమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందిన ఆమె విశేషాలు తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. నీతా అంబానీ ఉపయోగించే ఆడంబరమైన వస్తువులకు సంబంధించి అనేక పుకార్లు షికారు చేస్తుంటాయి. వాటిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్ (iPhone) కూడా ఒకటి.ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ అని పిలిచే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్ నీతా అంబానీ దగ్గర ఉందన్న పుకార్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ ప్రత్యేక ఫోన్ ధర 48.5 మిలియన్ డాలర్లు (రూ.403 కోట్లకు పైగా). ఖరీదైన ప్లాటినం, 24-క్యారెట్ల బంగారంతో తయారైన ఈ ఫోన్ వెనుక భాగంలో భారీ గులాబీ వజ్రం (Pink Diamond) ఉంది.అయితే ఈ పుకార్లన్నీ అవాస్తవమని కొన్ని సంవత్సరాల క్రితమే రిలయన్స్ వివరణ ఇచ్చింది. కంపెనీలోని సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఇంత ఖరీదైన ఫోన్ నీతా అంబానీ దగ్గర లేదని, ఆమె వాడలేదని ఇండియా టుడే కథనం పేర్కొంది.ఇటీవల ముంబైలో జరిగిన ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ ప్రారంభోత్సవానికి హాజరైన నీతా అంబానీ ధరించిన డ్రస్ అందరి దృష్టిని ఆకర్షించింది. నీతా ధరించిన వైట్ సిల్క్ టాప్ ధర 1395 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1,18,715కు సమానం. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరను కూడా నీతా అంబానీ ధరించారు. దీని ధర ఏకంగా రూ. 40 లక్షలు. -
ప్రపంచంలోనే కాస్ట్లీ ఫోన్.. రేటెంతో తెలుసా?
-
ప్రపంచంలోనే కాస్ట్లీ ఫోన్.. రేటెంతో తెలుసా?
అత్యంత లగ్జరీ, కాస్ట్లీ ఫోన్లను తయారుచేసే వర్చ్యూ సంస్థ తన తాజా మోడల్‌ను విడుదల చేసింది. ‘వర్చ్యూ సిగ్నేచర్ కొబ్రా’ పేరిట రూపొందిన ఈ ఫోన్ ధర అక్షరాల 2.3 కోట్ల రూపాయలు (3.60 లక్షల డాలర్లు). పేరుకు తగ్గట్టే ఈ ఫోన్ అంచుల చుట్టు ఓ పాము ప్రతిమను ముద్రించి ఉండటం ఇందులోని ప్రత్యేకత. 439 కెంపులను పొదిగి ఈ ఫీచర్ ఫోన్‌ను రూపొందించారు. ఇక పాము కళ్లుగా ఎమరాల్డ్స్ను (మరకత మణులను) పొదిగారు. 288 భాగాలతో రూపొందిన ఈ ఫోన్ యూకేలో తయారు చేశారు. కేవలం ఎనిమిది యూనిట్ల ఫోన్‌ను మాత్రమే తయారుచేశారు. ఈ ఫోన్ కొనాలని ఆసక్తి కలిగిన వాళ్లు చైనీస్ ఈ-కామర్స్ వెబ్సైట్ జేడీ.కామ్‌లో బుక్ చేసుకోవచ్చు. 145 డాలర్లు అదనంగా చెల్లించి ప్రీ-బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్లో మిగతా స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు మామూలుగానే ఉన్నాయి. రెండు అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, 2 జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ మెమరీ, ఐదున్నర గంటలసేపు ఫోన్ చేసి మాట్లాడుకోగల బ్యాటరీ సామర్థ్యం ఇందులో ఉన్నాయి.