breaking news
more costly
-
స్మార్ట్ ఫోన్లకు జీఎస్టీ షాక్
సాక్షి, న్యూడిల్లీ: కొత్తగా మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి జీఎస్టీ రూపంలో భారీ షాక్ తగిలింది. ఊహించినట్టుగానే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ (జీఎస్టీ కౌన్సిల్) తాజాగా మొబైల్ ఫోన్లపై జీఎస్టీ పెంపునకు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన శనివారం నాటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మొబైల్ ఫోన్లపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వీటిపై 5 శాతం. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. విమానాల నిర్వహణ (ఎంఆర్ఓ) సేవలపై జీఎస్టీని 12 శాతంనుంచి 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించగా, చేతితో తయారు చేసిన, యంత్రాలతో తయారు చేసిన మ్యాచ్‌స్టిక్‌లపై పన్ను రేటును 12 శాతంగా వుంచింది. మరోవైపు రూ. 2 కోట్ల రూపాయల లోపు టర్నోవర్ ఉన్న సంస్థల 2018 ఆర్థిక సంస్థకు కోసం వార్షిక రిటర్నులపై లేట్ ఫీజును మాఫీ చేసింది. అలాగే 2020 జూన్ 30 వరకు జీఎస్టీఆర్ 9, జీఎస్టీఆర్ 9 సీ దాఖలు చేయడానికి గడువును పొడిగించింది. అలాగే రూ.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులకు దాఖలు చేయడం తప్పనిసరి. అంతకుముందు గడువు మార్చి 31 వరకు మాత్రమే. అలాగే టర్నోవర్ పరిమితి రూ .2 కోట్లు. 2021 జనవరి నాటికి జీఎస్టీ నెట్‌వర్క్‌లోని సమస్యల్ని పరిష్కరిస్తామని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని కౌన్సిల్‌కి తెలిపారు. ఇందుకోసం ఒక నిర్దిష్ట దశల వారీ రోడ్‌మ్యాప్‌తో (చైనా హార్డ్‌వేర్ ద్వారా) వ్యవస్థను సరిదిద్దాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ నిర్ణయం అటు వినియోగదారులతోపాటు, స్థానిక ఉత్పత్తిదారులకు కూడా హానికరమని మొబైల్ హ్యాండ్సెట్లు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ సంస్థ ఆర్థిక మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత స్థాయి 12 శాతం నుండి మొబైల్ ఫోన్ల జీఎస్టీ రేటు పెరుగుదలకు ఇది సరైన సమయం కాదని విమర్శించింది. మొబైల్ ఫోన్లు, విబి భాగాలు ఇన్పుట్లపై జీఎస్టీన ద్వారా ఇబ్బందుల్లో పడిన సంస్థపై, తాజా జీఎస్టీ పెంపు విచిత్రమైన చర్య అని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ పేర్కొన్నారు. ఫెర్టిలైజర్స్, ఫుట్‌వేర్ వంటి వాటిపై కూడా జీఎస్టీ పెంపు ప్రతిపాదనలపై చర్చ జరగ్గా, ప్రస్తుత ఆర్థిక మందగమనం,కరోనా వైరస్ ప్రభావంతో, ఎరువులు, పాదరక్షలు, వస్త్రాలపై రేట్ల పెంపు ప్రతిపాదనను కౌన్సిల్ వాయిదా వేసింది. మొబైల్ ఫోన్లతోపాటు, లెదర్, ఫుట్‌వేర్, టెక్స్టైల్ ప్రొడక్టులపై కూడా జీఎస్టీ పెరగనుందని అంచనాలు ఇటీవల వ్యాపించిన సంగతి తెలిసిందే. -
ఫేస్బుక్... ఇక చాలా కాస్ట్లీ గురూ!
ఫేస్బుక్లో ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు మరింత సొమ్ము వెచ్చించాల్సి వస్తుంది. ఎందుకంటే, మొత్తం ప్రకటనల సంఖ్యను తగ్గించి.. ఉన్నవాటికే ధర పెంచాలని ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ నిర్ణయించింది. గత సంవత్సరంతో పోలిస్తే 2014 రెండో త్రైమాసికంలో ప్రకటనల ధర 123 శాతం పెరుగుతుందని ఫేస్బుక్ సీఎఫ్ఓ డేవ్ వెహ్నర్ తెలిపారు. ఇటీవలి కాలంలో ఇంతకుముందు కంటే 25 శాతం తక్కువ ప్రకటనలను ఫేస్బుక్ చూపించినా, ఆదాయం మాత్రం 67 శాతం పెరిగింది. తమ ప్రకటనల వల్ల వచ్చే ఆదాయాన్ని బట్టే ప్రకటనల ఖరీదు కూడా ఉంటుందని వెహ్నర్ చెప్పారు. మరింత మెరుగైన ప్రకటనలను, మరింత లక్షిత ప్రేక్షకులకు వెళ్లేలా తమ మార్కెటింగ్ వ్యూహాలు మెరుగుపరుచుకుంటున్నామని ఆయన అన్నారు. దీనివల్ల ఫేస్బుక్ వాడేవాళ్లతో పాటు ప్రకటనకర్తలకు కూడా సులువుగా ఉలుంటుందని చెప్పారు. ఫేస్బుక్ పేజీ డిజైన్‌ను కొద్దిగా మార్చడంతో ప్రకటనలకు స్థలం తక్కువగా మిగిలింది. అందుకే ధరలు పెంచినట్లు ఫేస్బుక్ తెలిపింది. -
సిగరెట్ ప్యాకెట్.. మరింత ఖరీదు!!
దేశంలో పెరిగిపోతున్న సిగరెట్ల వాడకాన్ని తగ్గించేందుకు.. ఈసారి బడ్జెట్లో సిగరెట్ల మీద పన్నులు భారీగా వడ్డించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. సిగరెట్ల పొడవుతో సంబంధం లేకుండా.. ఒక్కో సిగరెట్ మీద కనీసం రూ. 3.50 చొప్పున పెంచాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ కోరుతోంది. అలాగే, బీడీల మీద ఇన్నాళ్ల నుంచి ఉన్న పన్ను మినహాయింపును రద్దు చేయాలని కూడా ఆరోగ్యశాఖ కోరింది. రోజుకు 20 లక్షల కంటే తక్కువ బీడీలు ఉత్పత్తి చేసేవారికి ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకోవాలని, వాటి మీద కూడా పన్ను విధానాన్ని సవరించాలని, ఎవరూ పన్ను ఎగవేయకుండా పటిష్ఠంగా చూడాలని ఆరోగ్యశాఖ కోరింది. జూలై 11వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ శాఖల నుంచి అన్ని అంశాలపై ఆర్థిక శాఖకు వివిధ ప్రతిపాదనలు వస్తున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై 7వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు జరుగుతాయి.