అమెరికాలో కూతురి పెళ్లికి వెళ్లి.. అనంత లోకాలకు..
అమెరికా: అమెరికాలో అదృశ్యమైన ఎన్ఎమ్డీసీ డిప్యూటీ మేనేజర్ మోపర్తి ప్రసాద్ మృతదేహం మంగళవారం లభ్యమైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. గత జనవరిలో అమెరికా వెళ్లిన ఆయన ఈ నెల 13న తన కూతురి పెళ్లిలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. మోపర్తి ప్రసాద్ స్వస్థలం గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు. కూతురి వివాహమైన గంట తర్వాత ప్రసాద్ కనిపించకుండా పోయారు.
దాంతో ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, మంగళవారం మోపర్తి మృతదేహం లభించినట్టు యూఎస్ నుంచి అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.