breaking news
money less
-
పైసా లేకుండా జీవించడం ఎలా? 15 ఏళ్లుగా ‘మార్క్ బాయిల్’ ఏం చేస్తున్నాడు?
ప్రపంచంలో అధికశాతం మంది జీవితంలో వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించి, సుఖంగా జీవించాలని కలలు కంటారు. పేదరికంలో మగ్గిపోవాలని ఎవరూ కోరుకోరు. ఉన్నత చదువులు చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తూ, అధికంగా సంపాదించగలిగే అర్హత కలిగిన ఒక వ్యక్తి భిన్నమైన నిర్ణయం తీసుకుని, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ కథ యునైటెడ్ కింగ్డమ్ నివాసి మార్క్ బాయిల్‌కి సంబంధించినది. 2008లోనే బాయిల్ డబ్బును వినియోగించడం మానుకుని ఆనందంగా కాలం వెళ్లదీస్తున్నాడు. సాంకేతికతలాంటి విషయాల జోలికి వెళ్లకుండా ప్రకృతితో మమేకమై జీవించడాన్ని అలవర్చుకున్నాడు. మార్క్ బాయిల్.. బిజినెస్ అండ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ తీసుకున్నాడు. చదువు పూర్తయిన వెంటనే బ్రిస్టల్‌లోని ఒక ఫుడ్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించాడు. జీవితంలో విజయం సాధించేందుకు ఏళ్ల తరబడి కష్టపడ్డాడు. అయితే 2007లో ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా జరిగిన సంఘటన బాయిల్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. హౌస్‌బోట్‌లో కూర్చున్న బాయిల్ అక్కడున్నవారు మాట్లాడుకున్న మాటలను విన్నాడు. అందరూ డబ్బు గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో అన్ని సమస్యలకు ఏకైక మూలం డబ్బు అని బాయిల్ గ్రహించాడు. అందుకే తాను డబ్బుకు అతీతంగా జీవించాలని, డబ్బు సంపాదించకూడదని, అలాగే ఖర్చు పెట్టకూడదని కఠినంగా నిర్ణయించుకున్నాడు. దీంతో మార్క్ బాయల్ తన ఖరీదైన హౌస్‌బోట్‌ను విక్రయించి, తన పాత కారవాన్‌లో నివసించడం మొదలుపెట్టాడు. డబ్బు లేకుండా జీవితాన్ని గడపసాగాడు. ఈ నేపధ్యంలో కొన్ని నెలలు పలు సమస్యలను ఎదుర్కొన్నాడు. టీ, కాఫీలతో పాటు ఇతర సౌకర్యాలను వదులుకున్నాడు. ప్రకృతి అందించేవాటిని మాత్రమే ఉపయోగించసాగాడు. ఇటువంటి ప్రకృతి సహజ జీవనం ప్రారంభించినప్పటి నుంచి తాను అనారోగ్యం బారిన పడలేదని, తనకు ఆరోగ్య రక్షణ అవసరం లేదని బాయిల్ తెలిపాడు. బాయిల్ జీవితాన్ని చూసిన చాలామంది అతనికి స్నేహితులుగా మారారు. తాను 2017లో టెక్నాలజీ జోలికి వెళ్లడాన్ని పూర్తిగా వదులుకున్నానని, సాంకేతికతతో ముడిపడిన పాత జీవితం కాకుండా, సహజసిద్దంగా ప్రకృతితో గడిపే భావి జీవితం గురించి నిరంతరం ఆలోచిస్తుంటానని బాయిల్ తెలిపాడు. ఇది కూడా చదవండి: ఎస్క్లేటర్పై నిషేధమున్న నగరం ఏది? గణాంకాలు ఎందుకు బెంబేలెత్తిస్తున్నాయి? -
కొత్త చిక్కులు
నగదు రహిత రేష¯ŒSకు తిప్పలు చౌకడిపోల్లో వర్తించని పోర్టబులిటీ లబ్ధిదారులకు సరుకులు తిరస్కరిస్తున్న డీలర్లు కార్డు ఉన్నచోటకే వెళ్లాలంటూ సూచన ఉపాధి కోసం వచ్చినవారిలో అయోమయం నగదు రహిత రేష¯ŒS పంపిణీ వల్ల లబ్ధిదారులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. నగదు రహిత లావాదేవీల్లో రేష¯ŒS పోర్టబులిటీ వర్తించడం లేదు. ఎప్పటిలాగే ఈ నెల కూడా రేష¯ŒS డిపోలకు వెళ్తే ఇతర ప్రాంతాల లబ్ధిదారులకు డీలర్లు సరుకులు నిరాకరిస్తున్నారు. తమ పరిధిలోనివారికే సరుకులు ఇస్తామని, ఇతర ప్రాంతాలవారు కార్డు జారీ అయిన రేష¯ŒS డిపోకే వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం : రేష¯ŒS పోర్టబులిటీ ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేష¯ŒS తీసుకునే సౌకర్యం ఉంది. గత నెల వరకూ కూడా ఈ విధానంలోనే రేష¯ŒS సరుకులు పంపిణీ చేశారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా చౌకడిపోల్లో కూడా నగదు రహిత లావాదేవీలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం అధికారులు రేష¯ŒS డిపోల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధానంలో ఈ–పోస్ యంత్రాల్లో లబ్ధిదారుల ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాలను, రేష¯ŒS కార్డు నంబర్‌తో అనుసంధానం చేస్తారు. తద్వారా తీసుకు న్న సరుకులకు సంబంధించిన నగదు లబ్ధిదారు ఖాతా నుంచి డీలర్ ఖాతాకు జమ అవుతుంది. దీని అమలును గత నెల నుంచే చేపట్టినా, ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడం, పెద్ద నోట్ల రద్దు, చిల్లర సమస్యల తో ఆ నెలలో నగదు తీసుకోకుండానే సరుకులు పంపిణీ చేశారు. నగదు రహిత లావాదేవీలు ప్రారంభించాక జనవరిలో తీసుకుందామని అందరికీ అరువు కింద సరుకులు ఇచ్చారు. ‘పోర్టబులిటీ’ సరుకులకు ‘నో’ ఈ నెల నుంచి చౌకడిపోల్లో నగదు రహిత లావాదేవీలు ప్రారంభించారు. కొత్త విధానంలో లబ్ధిదారు బ్యాంకు ఖాతా అతడు రేష¯ŒS కార్డు పొందిన డీలర్ ఖాతాకే అనుసంధానమవుతోంది. దీంతో పోర్టబులిటీ విధానం కింద వేరేచోట నుంచి సరుకులు పొందే లబ్ధిదారు ఖాతా నుంచి నగదు ఆ డీలర్‌కే చేరుతోంది. సరుకులు ఇచ్చిన డీలర్ ఖాతాకు ఆ సొమ్ములు చేరడంలేదు. ఫలితంగా డీలర్లు పోర్టబులిటీ ద్వారా సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. సరుకులు కావాలంటే కార్డు పొందిన డీలర్ వద్దకే వెళ్లాలని సూచిస్తున్నారు. జిల్లాలోని 2,444 చౌకడిపోల పరిధిలో 15,79,555 రేష¯ŒS కార్డులున్నాయి. ఇందులో సుమారు 1.50 లక్షలమంది కార్డుదారులు ఇన్నాళ్లుగా పోర్టబులిటీ ద్వారా సరుకులు తీసుకుంటున్నారు. వీరిలో జిల్లాలోని కార్డుదారులతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలవారు కూడా ఉన్నారు. ఈ నెల సరుకులు ఇవ్వలేదు మాది అమలాపురం. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగ రీత్యా రాజమహేంద్రవరంలో ఉంటున్నాను. నాలుగు నెలల నుంచి ఒకే రేష¯ŒS దుకాణంలో సరుకులు తీసుకుంటున్నాను. గత నెలలో క్రెడిట్ ఇచ్చారు. ఆ నగదు తన ఖాతాకు జమ అయితే వచ్చే నెలలో సరుకులిస్తామని డీలర్ అంటున్నారు. సోమవారం సరుకులకు వెళితే నగదు తన ఖాతాకు జమ కాలేదని, కార్డు ఎక్కడ జారీ చేశారో ఆ డీలర్ వద్దకే వెళ్లాలని చెప్పారు. నా ముందు మరో ముగ్గురికి కూడా ఇదే సమస్య ఎదురైంది. – కె.వెంకటసురేష్, లలితానగర్, రాజమహేంద్రవరం జిల్లా పరిధిలోని కార్డుదారులకు ఇబ్బంది లేదు నగదు రహిత లావాదేవీలవలన జిల్లాపరిధిలోని కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. వారందరికీ పోర్టబులిటీ వర్తిస్తుంది. ఇప్పటివరకూ 7 వేల మందికి పోర్టబులిటీ ద్వారా సరుకులు పంపిణీ చేశాం. నగదు రహిత లావాదేవీల వలన ఇతర జిల్లాల కార్డుదారులకు పోర్టబులిటీ వర్తించడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో పై స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి. – వేమూరి రవికిరణ్, జిల్లా పౌరసరఫరాల అధికారి