breaking news
Mokshagundam Visvesvaraya
-
ఆయన సేవలు చిరస్మరణీయం.. వైఎస్ జగన్ ఇంజనీర్స్ డే విషెస్
భారతదేశపు గొప్ప ఇంజనీరింగ్ మేధావి, భారత రత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ తేదీని దేశం మొత్తం ఇంజనీర్స్ డేను నిర్వహించుకుంటుండడం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఎన్నో త్రాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి, దేశం గర్వించదగ్గ ఇంజనీరింగ్ నిపుణులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు అంటూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారాయన.ఎన్నో త్రాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి, దేశం గర్వించదగ్గ ఇంజనీరింగ్ నిపుణులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు.#EngineersDay pic.twitter.com/rRnUXMOMQd— YS Jagan Mohan Reddy (@ysjagan) September 15, 2025మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దెనహళ్లి గ్రామంలో జన్మించారు. ఆయన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు. పుణేలో సివిల్ ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసిన మోక్షగుండం.. బొంబాయ్ ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం ప్రారంభించారు. ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థను రూపొందించి, ఖడక్వాస్లా, గ్వాలియర్, కృష్ణరాజసాగర్ డ్యామ్‌లలో విజయవంతంగా అమలు చేశారు. 1912–1918 మధ్య మైసూరు సంస్థానానికి ఇంజనీర్ మోక్షగుండం దివానుగా పనిచేశారు. మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, ఐరన్ & స్టీల్ కంపెనీ వంటి సంస్థల స్థాపనలో కీలక పాత్ర వహించారు. ఇంజనీరింగ్ రంగంలో ఆయన అందించిన సేవలకుగానూ 1955లో అప్పటి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. అంతేకాదు.. బ్రిటీష్ ప్రభుత్వం నుంచి Knight Commander of the Indian Empire (KCIE) బిరుదు కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య పొందారు. భారత ఇంజనీరింగ్ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మదినం సెప్టెంబర్ 15ను ఇంజనీర్స్ డేగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. -
Engineers Day: మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. భారత ఇంజనీరింగ్ రత్నం
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యని భారతీయ ఇంజనీరింగ్ రంగానికి పితామహుడుగా అభివర్ణించవచ్చు. తన నైపుణ్యాలతో, ఇంజనీరింగ్ విద్యా పరిజ్ఞానంతో దేశాన్ని అభివృద్ధివైపు అడుగులు వేయిస్తూ దేశానికి సారథ్యం వహిం చారు. విశ్వేశ్వరయ్య గారు కర్ణాటకలోని మైసూర్ దగ్గర ముడినేహల్లి అనే కుగ్రామంలో 1861లో జన్మించారు. అనేక కష్టనష్టాలకు సైతం ఓర్చుకొని విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ట్యూషన్లు చెప్పుకుంటూ ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసి మొదటి ర్యాంకు సాధించారు. చదువు పూర్తయిన వెంటనే మహరాష్ట్రలోని నాసిక్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం పొందాడు. దేశానికి రాబోయే రోజుల్లో వ్యవసాయం, పరిశ్రమలే అవసరమని గుర్తించి వాటిని వృద్ధిలోకి తీసుకురావడం ద్వారా అనేక సేవలు చేశాడు. 101 సంవత్సరాల తన జీవితంలో దాదాపుగా 80 ఏళ్లు దేశం కోసం అహర్నిశలు పని చేశాడు. విశ్వేశ్వరయ్య చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1955లో భారతరత్న ప్రదానం చేసి సత్కరించింది. విశ్వేశ్వరయ్య ఈ దేశానికి చేసిన సేవలకు గాను 1968లో తన పుట్టినరోజును జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లో 1908లో మూసీ నదికి వరదలు వచ్చాయి. నాటి అల్లకల్లోలమైన పరిస్థితుల్లో అనేక వంతెనలు నిర్మించి మూసీ నదికే ముక్కుతాడు వేసిన ఇంజనీర్ విశ్వేశ్వరయ్య. నాసిక్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా సింధూ నది నీటిని సుక్కూరు ప్రాంతానికి అంటే దాదాపుగా 480 కిలోమీటర్లు తీసుకురావడం కోసం విశ్వేశ్వరయ్య చేసిన యోచన చూసి మిగతా ఇంజనీర్లు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తర్వాత నీటిపారుదలపై మహరాష్ట్రలో పలు కమిటీలు వేసినప్పుడు విశ్వేశ్వరయ్య సలహాలు విని బ్రిటిష్ అధికారులు సైతం అవాక్కయ్యారు. ఇరిగేషన్లో బ్లాక్ సిస్టమ్ అనే నూతన విధానాలను తీసుకువచ్చి వ్యర్ధమైన నీటిని నిల్వ చేసి మరల వాడేవారు. 1952లో అంటే 91 సంవత్సరాల వయసులో గంగానది మీద బ్రిడ్జి కట్టడానికి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తన జీవితమంతా తన నైపుణ్యాన్ని దేశ నిర్మాణానికి వినియోగించారు. తన దార్శనికత వల్లే నేటికీ కర్ణాటక మైసూర్ బలంగా, సుసంపన్నంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. నేటి భారతీయ సమాజంలో ఉన్న నవ యువ ఇంజనీర్లమైన మనం సమాజంలో ఉన్న సమస్యలకు ఇంజనీరింగ్ రంగం ద్వారా పరిష్కారం వెతికి దేశం ముందుంచాలి. అప్పుడే విశ్వేశ్వరయ్య ఆశయాలు, కలలు సాకారమవుతాయి. – జవ్వాజి దిలీప్, జేఎన్టీయూ ‘ 78010 09838 (నేడు ఇంజనీర్స్ డే – విశ్వేశ్వరయ్య జయంతి) -
అప్పటి మూసీ వరదల నుంచి కాపాడింది ఆయనే
ఆయన నిర్మించిన ప్రాజెక్టులు చరిత్రలో నిలిచిపోయాయి. స్కాలర్‌షిప్‌తో ఇంజనీరింగ్ పట్టా పచ్చుకొని ఎంతో మంది ఇంజనీర్లకు స్పూర్తి ప్రధాతగా నిలిచారు. ప్రభుత్వ సొమ్ములో పైసా కూడా వినియోగించుకోని గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది యూనివర్సిటీలు ఆయన్ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయి. ఎవరాయన? ఆయన రూపకల్పనలో జాలువారిన నిర్మాణాలేంటి? తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి. -
మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్ : ఇంజినీరింగ్ రంగంలో భారతదేశానికి వన్నె తెచ్చిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్మరించుకున్నారు. నేడు విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన వినమ్రంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ గురువారం ట్విట్ చేశారు. My humble tribute to statesman engineer Bharat Ratna Sir Mokshagundam Visveswarayya. Happy #EngineersDay. — YS Jagan Mohan Reddy (@ysjagan) 15 September 2016 మరోవైపు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ... నివాళులు అర్పిస్తూ, విశ్వేశ్వరయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇంజినీర్స్‌కు ఆయన అభినందనలు తెలిపారు.