breaking news
Mohammad Imtiaz
-
తుది శ్వాస వరకూ పోరాటమే
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు చేసింది. ఉగ్రవాదుల స్థావరాలు, శిక్షణ కేంద్రాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఎంతోమంది ముష్కరులు అంతమయ్యారు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలు సైతం ధ్వంసమయ్యాయి. అంతిమంగా పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. అయితే, ఆపరేషన్ సిందూర్‌ను తిప్పికొట్టడానికి పాక్ సైన్యం ప్రయత్నించింది. డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. పాక్ దాడుల్లో భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఎస్ఐ మొహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాఖామ్ వీరమరణం పొందారు. మరణానంతరం వారికి వీర్ చక్ర పురస్కారం లభించింది. వారు చివరి వరకూ వీరోచిత పోరాటం సాగించారని, అపూర్వమైన ధైర్యసాహసాలు ప్రదర్శించారని కేంద్రం ప్రభుత్వం ఈ నెల 4న ప్రచురించిన గెజిట్‌లో ప్రశంసించింది. ఈ ఏడాది మే 10న జమ్మూలోని ఖర్కోలాలో బోర్డర్ ఔట్‌పోస్టుపై పాక్ సైన్యం దాడికి దిగింది. డ్రోన్లు ప్రయోగించింది. ఎస్ఐ ఇంతియాజ్ అక్కడే విధుల్లో ఉన్నారు. తన బంకర్ నుంచి బయటకు వచ్చారు. లైట్‌మెషిన్ గన్‌తో ఒక పాక్ డ్రోన్‌ను కూల్చివేశారు. కానిస్టేబుల్ దీపక్ మరో డ్రోన్‌ను నేలమట్టం చేశారు. ఇంతలో పాక్ భూభాగం నుంచి ఫిరంగి గుండు దూసుకొచ్చింది. ఎస్ఐ ఇంతియాజ్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ లేక్కచేయకుండా తన దళాన్ని ముందుకు నడిపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ తన సిబ్బందికి ఆదేశాలిచ్చారు. వారికి ప్రేరణ కల్పించారు. జవానో.. ఆజ్ ఖతం కరో ఇన్కో(సైనికులారా.. పాకిస్తాన్ ముష్కరులను అంతం చేయండి) అంటూ బిగ్గరగా అరిచారు. విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచారు. గాయపడిన కానిస్టేబుల్ దీపక్ సైతం ఆఖరి క్షణం వరకూ యుద్ధం సాగిస్తూనే మృతిచెందారు. ప్రభుత్వం వారిద్దరి ప్రాణత్యాగాన్ని గుర్తించింది. వీర్‌చక్రను ప్రదానం చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న 16 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు పోలీస్ శౌర్య పతకాలు లభించాయి. -
జేసీ రేఖారాణి బదిలీ
నెల్లూరు(రెవెన్యూ): జేసీ రేఖారాణి బదిలీ అయ్యారు. ఆమెకు ఇంకా ఏ జిల్లా కేటాయించలేదు. నూతన జాయింట్ కలెక్టర్‌గా మహ్మద్ ఇంతియాజ్‌ను నియమిస్తు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతియాజ్ గతంలో జిల్లాలో సీటీఓగా విధులు నిర్వహించారు. ఐఏఎస్ హోదా వచ్చిన తర్వాత సాధారణ ఎన్నికల సమయంలో ట్రైనీ కలెక్టర్‌గా జిల్లాలో పనిచేశారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆయనకు 2013లో ఐఏఎస్ హోదా కల్పించారు. డిప్యూటీ కలెక్టర్‌గా, సీటీఓగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. గురువారం ఆయన జేసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రత్యేకతను చాటుకున్న రేఖారాణి 2014 ఫిబ్రవరి 19న రేఖారాణి జేసీగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో 11 నెలలలు పనిచేశారు. తనదైనశైలిలో రేఖారాణి విధులు నిర్వహించారు. ఎవరి మాటా వినకుండా తను అనుకున్న పనినే చేసే మనస్తత్వం ఆమెది. క్రికెట్ దేవుడు, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్‌ను జిల్లాకు తీసుకువచ్చి జిల్లా కిర్తీని దేశానికి చాటారు. రేఖారాణి తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ఎంపీలందరూ గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్‌ను గతంలోకంటే మిన్నగా నిర్వహించేలా రంగం సిద్ధం చేశారు. పక్షుల పండగకు సంబంధించి విజయవాడ, చెన్నై తదితర ప్రాంతాల్లో రోడ్డుషోలు నిర్వహించారు. కార్తీకమాసంలో మైపాడు తీరంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ చేత సంగీతవిభావరి ఏర్పాటు చేశారు. ఓటుహక్కు వినియోగించుకో.. బంగారం పట్టుకో అని ప్రచారం చేశారు. ఓటుహక్కు వినియోగించుకున్న వారి జాబితా సిద్ధం చేసి లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి లబ్ధిదారులకు బంగారం అందజేశారు. జిల్లాలో పనిచేయడం తనకు సంతృప్తిని ఇచ్చిందని రేఖారాణి సాక్షితో తెలిపారు.