-
ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసిన మొయిన్ అలీ.. హ్యాట్రిక్ సహా..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో (బీపీఎల్) కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు, ఇంగ్లండ్ ప్లేయర్ మొయిన్ అలీ ఆల్‌రౌండ్ షోతో ఇరగదీశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడిన మొయిన్ (24 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు).. ఆతర్వాత హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు (3.3-0-23-4) తీసి విక్టోరియన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొయిన్‌తో పాటు సహచర ఆటగాడు విల్ జాక్స్ (53 బంతుల్లో 108 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సునామీ శతకంతో వీరంగం సృష్టించడంతో విక్టోరియన్స్ 73 పరుగుల తేడాతో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌పై విజయం సాధించింది. బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో మొయిన్ సాధించిన హ్యాట్రిక్ ఎనిమిదవది. మొయిన్ హ్యాట్రిక్ వికెట్లతో మ్యాచ్‌కు ముగించాడు. Moeen Ali scored a fifty and took a hat-trick in the BPL match. 🤯pic.twitter.com/yIGVsgU9Lh — Mufaddal Vohra (@mufaddal_vohra) February 13, 2024 శతక్కొట్టిన విల్ జాక్స్.. మెరుపు అర్దశతకంతో విరుచుకుపడిన మొయిన్ అలీ తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ జాక్స్, మొయిన్ విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ చేసింది. విక్టోరియన్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లిటన్ దాస్ (31 బంతుల్లో 60; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అర్ధసెంచరీతో మెరిశాడు. తిప్పేసిన మొయిన్, రిషద్ హొసేన్. 240 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఛాలెంజర్స్.. మొయిన్ అలీ, రిషద్ హొసేన్ (4-0-22-4) మాయాజాలం ధాటికి 166 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. ముస్తాఫిజుర్ 2 వికెట్లు తీసి విక్టోరియన్స్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ (41), సైకత్ అలీ (36), జోష్ బ్రౌన్ (36) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ డౌన్.. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ పడింది. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్-2023 సందర్భంగా తొలుత స్టువర్ట్ బ్రాడ్, ఆతర్వాత మొయిన్ అలీ, కొద్ది రోజుల గ్యాప్‌లో ఇంగ్లండ్ టీ20 వరల్డ్‌కప్ విన్నర్ అలెక్స్ హేల్స్, తాజాగా త్రీ టైమ్ యాషెస్ సిరీస్ విన్నర్, బ్రాడ్ సహచరుడు, ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2010లో అంతర్జతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఫిన్.. 2017 వరకు ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను మూడు సార్లు యాషెస్ సిరీస్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. గతకొంతకాలంగా మోకాలి గాయంతో బాధ పడుతున్న ఫిన్.. తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిన్ ఓ స్టేట్మెంట్ ద్వారా వెల్లడించాడు. గత ఏడాది కాలంగా మోకాలి గాయం బాధిస్తుందని, గాయంతో పోరాటంలో తాను ఓడిపోయానని, తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నానని ఫిన్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. 2005లో మిడిల్సెక్స్ తరఫున కెరీర్‌ను ప్రారంభించిన ఫిన్.. 2010-16 మధ్యలో ఇంగ్లండ్ తరఫున 36 టెస్ట్‌లు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2011లో వన్డే అరంగ్రేటం చేసిన ఫిన్ 69 వన్డేల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. 2011-15 మధ్యలో 21 టీ20 ఆడిన ఫిన్ 27 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌ల్లో ఫిన్ ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. కౌంటీల్లో 2005 నుంచి 2022 వరకు మిడిల్‌సెక్స్‌కు ఆడిన ఫిన్.. ఆతర్వాత ససెక్స్‌ను మారాడు. ససెక్స్ తరఫున ఫిన్ కేవలం 19 మ్యాచ్‌లే ఆడాడు. ససెక్స్‌కు ఆడుతుండగానే మోకాలి గాయం బారిన పడిన 34 ఏళ్ల ఫిన్, కెరీర్‌ను కొనసాగించలేక రిటైర్మెంట్ ప్రకటించాడు. -
Moeen Ali Unseen Photos: ట్రెండింగ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ (ఫోటోలు)
-
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్..
ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్‌కు మరోసారి విడ్కోలు పలికాడు. లండన్ వేదికగా జరిగిన యాషెస్ ఆఖరి టెస్టు అనంతరం మొయిన అలీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది. ఇంగ్లండ్ విజయంలో అలీ కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు పడగొట్టి జట్టుకు అద్భుతమైన విజయం అందించాడు. తొలిసారి అలా.. కాగా అంతకుముందు మొయిన్ అలీ 2021 సెప్టెంబర్‌లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ యాషెస్ సిరీస్-2023కు ముందు ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో యాషెస్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ మెక్కల్లమ్ నచ్చచెప్పడంతో మెయిన్ అలీ టెస్టు రిటైర్మెంట్పై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీంతో అతడిని ఈ ఏడాది యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన అలీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్‌గా యాషెస్ 2023లో నాలుగు మ్యాచ్‌లో ఆడిన మొయిన్.. 180 పరుగులతో పాటు 9 వికెట్లు సాధించాడు. ఓ వైపు చేతి గాయంతో బాధపడుతున్నప్పటికీ తన వంతు సేవలను అలీ అందించాడు. ఇదే చివరి మ్యాచ్.. ఇక మ్యాచ్ అనంతరం మొయిన్ అలీ మాట్లాడుతూ.. "రిటైర్మెంట్ విషయం గురించి స్టోక్స్ నాకు మళ్లీ మెసేజ్ చేస్తే, వెంటనే డిలీట్ చేస్తాను. నేను వచ్చిన పని పూర్తి చేశాను. ఈ సిరీస్‌ను బాగా ఎంజాయ్ చేశాను. చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించడం చాలా సంతోషంగా ఉంది. స్టోక్సీ నన్ను రీ ఎంట్రీ ఇవ్వమని అడిగినప్పుడు తొలుత నో చెప్పాను. ఎందకంటే నేను ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఎప్పుడూ బాగా ఆడలేదు. అందుకే నేను మళ్లీ ఆడను అని చెప్పా. స్టోక్స్ మాత్రం నాకు సపోర్ట్‌గా నిలిచి, నీవు అద్భుతంగా రాణించగలవని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను అని అన్నాడు. దీంతో మళ్లీ రెడ్ బాల్ క్రికెట్లో ఆడేందుకు ఒప్పుకున్నాను. మళీ జిమ్మీ,బ్రాడ్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్ వంటి జట్టుకు జాతీయ స్ధాయిలో ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు. చదవండి:IND Vs WI: టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు -
Ashes 4th Test: మొయిన్ అలీ డబుల్ ధమాకా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ డబుల్ ధమాకా సాధించాడు. ఈ సిరీస్‌కు ముందే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన మొయిన్.. టెస్ట్‌ల్లో 3000 పరుగులు, 200 వికెట్లు సాధించిన 16వ క్రికెటర్‌గా, నాలుగో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కెరీర్లో 67వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న మొయిన్.. 3020 పరుగులు 201 టెస్ట్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొయిన్‌కు ముందు ఇయాన్ బోథమ్ (5200 పరుగులు, 383 వికెట్లు), ఆండ్రూ ఫ్లింటాఫ్ (3845, 226), స్టువర్ట్ బ్రాడ్ (3640, 600) ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, 299/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 18 పరుగులు మాత్రమే జోడించి, మిగతా 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ బజ్‌బాల్ అంటూ ధాటిగా ఆడుతుంది. ఆ జట్టు రెండో సెషన్ సమయానికి 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 108 పరుగులు చేసింది. డకెట్ (1) ఔట్ కాగా.. జాక్ క్రాలే (60), మొయిన్ అలీ (43) క్రీజ్‌లో ఉన్నారు. డకెట్ వికెట్ స్టార్క్‌కు దక్కింది. అంతకుముందు, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51), హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41), డేవిడ్ వార్నర్ (32), మిచెల్ స్టార్క్ (36 నాటౌట్). ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. బ్రాడ్ 2, ఆండర్సన్, వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement