'Will delete Ben Stokes message' Moeen Ali to ditch CSK teammate for India series - Sakshi
Sakshi News home page

#Moeen Ali: రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌..! ఈ సారి మెసేజ్ డిలీట్ చేస్తా

Aug 1 2023 11:10 AM | Updated on Aug 1 2023 11:23 AM

Moeen Ali to ditch CSK teammate for India series - Sakshi

ఇంగ్లండ్ స్టార్‌ ఆల్ రౌండర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్‌కు మరోసారి విడ్కోలు పలికాడు. లండన్‌ వేదికగా జరిగిన యాషెస్‌ ఆఖరి టెస్టు అనంతరం మొయిన​ అలీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ 2-2తో సమమైంది. ఇంగ్లండ్‌ విజయంలో అలీ కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు పడగొట్టి జట్టుకు అద్భుతమైన విజయం అందించాడు.

తొలిసారి అలా..
కాగా అంతకుముందు మొయిన్ అలీ 2021 సెప్టెంబర్‌లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ యాషెస్‌ సిరీస్‌-2023కు ముందు ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో యాషెస్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు, టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ మెక్‌కల్లమ్‌ నచ్చచెప్పడంతో మెయిన్‌ అలీ టెస్టు రిటైర్మెంట్‌పై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

దీంతో అతడిని ఈ ఏడాది యాషెస్‌ సిరీస్‌కు ఇంగ్లండ్‌ సెలక్టర్లు ఎంపిక చేశారు. జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన అలీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్‌గా యాషెస్‌ 2023లో నాలుగు మ్యాచ్‌లో ఆడిన మొయిన్‌.. 180 పరుగులతో పాటు 9 వికెట్లు సాధించాడు. ఓ వైపు చేతి గాయంతో బాధపడుతున్నప్పటికీ తన వంతు సేవలను అలీ అందించాడు.

ఇదే చివరి మ్యాచ్‌..
ఇక మ్యాచ్‌ అనంతరం మొయిన్‌ అలీ మాట్లాడుతూ.. "రిటైర్మెంట్‌ విషయం గురించి స్టోక్స్‌ నాకు మళ్లీ  మెసేజ్ చేస్తే, వెంటనే డిలీట్‌ చేస్తాను. నేను వచ్చిన పని పూర్తి చేశాను. ఈ సిరీస్‌ను బాగా ఎంజాయ్‌ చేశాను. చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించడం చాలా సంతోషంగా ఉంది.  స్టోక్సీ నన్ను రీ ఎంట్రీ ఇవ్వమని అడిగినప్పుడు తొలుత నో చెప్పాను. ఎందకంటే నేను ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఎప్పుడూ బాగా ఆడలేదు.

అందుకే నేను మళ్లీ ఆడను అని చెప్పా. స్టోక్స్‌ మాత్రం నాకు సపోర్ట్‌గా నిలిచి, నీవు అద్భుతంగా రాణించగలవని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను అని అన్నాడు. దీంతో మళ్లీ రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో ఆడేందుకు ఒప్పుకున్నాను. మళీ​ జిమ్మీ,బ్రాడ్‌తో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్‌ వంటి జట్టుకు జాతీయ స్ధాయిలో ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.
చదవండి:IND Vs WI: టీమిండియాతో టీ20 సిరీస్‌.. విండీస్‌ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement