ఆల్‌రౌండ్‌ షోతో ఇరగదీసిన మొయిన్‌ అలీ..  హ్యాట్రిక్‌ సహా..!

Moeen Ali Records BPL Hat Trick After A Quickfire Fifty - Sakshi

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో (బీపీఎల్‌) కొమిల్లా విక్టోరియన్స్‌ ఆటగాడు, ఇంగ్లండ్‌ ప్లేయర్‌ మొయిన్‌ అలీ ఆల్‌రౌండ్‌ షోతో ఇరగదీశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడిన మొయిన్‌ (24 బంతుల్లో 53 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్సర్లు).. ఆతర్వాత హ్యాట్రిక్‌ సహా నాలుగు వికెట్లు (3.3-0-23-4) తీసి విక్టోరియన్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మొయిన్‌తో పాటు సహచర ఆటగాడు విల్‌ జాక్స్‌ (53 బంతుల్లో 108 నాటౌట్‌; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సునామీ శతకంతో వీరంగం సృష్టించడంతో విక్టోరియన్స్‌ 73 పరుగుల తేడాతో చట్టోగ్రామ్‌ ఛాలెంజర్స్‌పై విజయం సాధించింది. బంగ్లా ప్రీమియర్‌ లీగ్‌లో మొయిన్‌ సాధించిన హ్యాట్రిక్‌ ఎనిమిదవది. మొయిన్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో మ్యాచ్‌కు ముగించాడు. 

శతక్కొట్టిన విల్‌ జాక్స్‌.. మెరుపు అర్దశతకంతో విరుచుకుపడిన మొయిన్‌ అలీ
తొలుత బ్యాటింగ్‌ చేసిన కొమిల్లా విక్టోరియన్స్‌ జాక్స్‌, మొయిన్‌ విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. విక్టోరియన్స్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ (31 బంతుల్లో 60; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అర్ధసెంచరీతో మెరిశాడు. 

తిప్పేసిన మొయిన్‌, రిషద్‌ హొసేన్‌.
240 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఛాలెంజర్స్‌.. మొయిన్‌ అలీ, రిషద్‌ హొసేన్‌ (4-0-22-4) మాయాజాలం ధాటికి 166 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. ముస్తాఫిజుర్‌ 2 వికెట్లు తీసి విక్టోరియన్స్‌ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఛాలెంజర్స్‌ ఇన్నింగ్స్‌లో తంజిద్‌ హసన్‌ (41), సైకత్‌ అలీ (36), జోష్‌ బ్రౌన్‌ (36) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.  

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top