
తొలి టెస్టు క్రికెటర్ గా..!
దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన నాల్గో టెస్టులో ఇంగ్లండ్ 177 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్ ను 3-1తో సొంతం చేసుకుంది.
మాంచెస్టర్:దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన నాల్గో టెస్టులో ఇంగ్లండ్ 177 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్ ను 3-1తో సొంతం చేసుకుంది. అయితే ఇంగ్లండ్ సిరీస్ విజయంలో ఆల్ రౌండర్ మొయిన్ అలీది కీలక పాత్ర. ఈ సిరీస్ లో 252 పరుగులు చేయడంతో పాటు 25 వికెట్లను మొయిన్ అలీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ క్రమంలోనే అరుదైన రికార్డును మొయిన్ అలీ సొంతం చేసుకున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్ లో 250కు పైగా పరుగులు, 25 వికెట్లు సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.
చివరి టెస్టులో అలీ ఏడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీసిన మొయిన్ అలీ.. రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు సాధించాడు. మరొకవైపు బ్యాటింగ్ లో భాగంగా రెండో ఇన్నింగ్స్ లో 75 పరుగులు చేశాడు. మరొకవైపు 1958 తరువాత ఒక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ స్పిన్నర్ గా కూడా మొయిన్ అలీ గుర్తింపు సాధించడం మరో విశేషం.