breaking news
ModiInUSA
-
‘ద్వైపాక్షికం’లో కొత్త అధ్యాయం
భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా యాత్ర విజయవంతమైంది. భారత్–అమెరికా సంబంధాలకు ఆకాశమే హద్దని మోదీ... ఇంత పటిష్టంగా, ఇంత సన్నిహితంగా, ఇంత క్రియాశీలంగా సంబంధాలు ఏర్పడటం ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఇదే తొలిసారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యా నించటంలో అతిశయోక్తులు లేవు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవటమే కాదు... అందుకనుసరించాల్సిన మార్గాన్ని కూడా ఆ లక్ష్యంతో సరిగా అనుసంధానించుకోవటం సమర్థ దౌత్య నైపుణ్యానికి చిహ్నం అంటారు. అమెరికాతో మన దేశానికి కుదిరిన భిన్న ఒప్పందాలను పరికిస్తే మన దౌత్య నైపుణ్యం ఆశించిన రీతిలోనే సాగిందని చెప్పవచ్చు. అయితే ఇందుకు అంతర్జాతీయ స్థితిగతులు కూడా దోహదపడ్డాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల్లో అత్యాధునిక సాంకేతిక సహకారం మొదలుకొని వాతావరణ మార్పులకు సంబంధించిన సహకారం వరకు ఎన్నో ఉన్నాయి. చంద్రుడి పైకి వెళ్లే మూన్ మిషన్‌లో మనకూ భాగస్వామ్యం ఇవ్వటానికి అంగీకరించటంతో మొదలెట్టి ఫైటర్ జెట్ ఇంజన్ల ఉత్పత్తి, సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటానికి అవస రమైన సాయం అందివ్వటం వరకూ అనేకం ఈ ఒప్పందాల్లో ఉన్నాయి. అక్కడుండే భారతీయులకు తమ హెచ్ 1బి వీసాలను అమెరికాలోనే నవీకరించుకునే వెసులుబాటు కల్పించటం వేలాదిమందికి తోడ్పడుతుంది. భారత్–అమెరికా సంబంధాలు తాజా ద్వైపాక్షిక ఒప్పందాలతో సరికొత్త దశకు చేరు కున్నాయి. దేశాల మధ్య సాన్నిహిత్యం కేవలం అమ్మకందారు–కొనుగోలుదారు సంబంధాల వల్ల ఏర్పడదు. భిన్న రంగాల్లో పరస్పరం ఎదిగేందుకు చిత్తశుద్ధితో ఆ దేశాలు ప్రయత్నించినప్పుడే ఆ సాన్నిహిత్యం సాధ్యపడుతుంది. అమెరికాకు చెందిన ప్రముఖ మెమొరీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ గుజరాత్లో అక్కడి ప్రభుత్వ భాగస్వామ్యంలో 270 కోట్ల డాలర్ల వ్యయంతో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ స్థాపించడానికి అంగీకరించటం, తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌కు అమర్చే ఫైటర్ జెట్ ఇంజన్లను భారత్‌లోనే తయారుచేయటానికి అంగీకరించటం, ఇరు దేశాల రక్షణ విభాగాలూ సైనిక సాంకేతికతలో సహకరించుకునే ఇండస్ఎక్స్ ఒప్పందం ఎన్నదగ్గ నిర్ణయాలు. ఇక క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధ, అత్యాధునిక సైనిక డ్రోన్లు తదితరాలపై ఒప్పందాలు సరేసరి. ఆసియా ఖండంపై అమెరికా నూతన దృక్పథానికి ఈ ఒప్పందాలు నిదర్శనం. కేవలం చైనాను దృష్టిలో పెట్టుకోవటం వల్లే చాలా అంశాల్లో అమెరికా దిగొచ్చిందన్న విశ్లేషణల్లో కొంతమేర వాస్తవం ఉండొచ్చు. ఈ ఒప్పందాలు సాకారమైతే ఆసియాలో చైనా పలుకుబడికి గండికొడతాయని చెప్పటం అతిశయోక్తి అవుతుందిగానీ, దాని ఏకచ్ఛత్రాధిపత్యాన్ని ఏదోమేరకు నిలువరించటం సాధ్య పడొచ్చు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతిసుస్థిరతలే తన ధ్యేయమని అమెరికా చెబుతోంది. సమతౌల్య ఆసియా తన లక్ష్యమంటున్నది. అయితే ఆ దేశానికి భవిష్యత్తులో తైవాన్ విషయంలోనో, మరే ఇతర అంశంలోనో చైనాతో ఘర్షణ వాతావరణం ఏర్పడితే అది మనకు కూడా సమస్యలు సృష్టిస్తుంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో మనం ఆనాటి సోవియెట్ యూనియన్ వైపు మొగ్గటం అమెరికాకు కంటగింపుగా ఉండేది. అందువల్లే ఏ విషయంలోనూ సహకరించేది కాదు. భారత్‌లో 90వ దశకంలో సంస్కరణల అమలు ప్రారంభించాక ఇంత పెద్ద మార్కెట్ వున్న దేశాన్ని వదులుకోవటం అసాధ్యమని అమెరికా గుర్తించింది. మన దేశం సైతం మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ దేశంతో క్రమేపీ చెలిమిని పెంచుకుంటూ వస్తోంది. అటు చైనాతో సైతం ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు అమెరికా ప్రయత్నిస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను బైడెన్ నియంతతో పోల్చినా ఆ దేశానికి విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను పంపటం గమనించదగ్గ పరిణామం. మోదీ అమెరికా పర్యటనకు ముందే బ్లింకెన్ బీజింగ్ సందర్శించారు. ఇటు మన దేశం కూడా సరిహద్దుల్లో తగాదాలకు దిగుతున్న చైనాతో మూడేళ్లుగా ఓపిగ్గా చర్చిస్తోంది. చైనా కూడా జరుగుతున్నదేమిటో గమనిస్తూనే ఉంటుంది. పరిణ తితో ఆలోచించటం మొదలుపెడితే ఎంత జటిల సమస్య అయినా పరిష్కారమవుతుంది. ఈ పర్యటనలో భారత్‌లో పౌర హక్కుల ఉల్లంఘన తదితర అంశాలను ప్రముఖంగా ప్రస్తావించాలనీ, మోదీని ఇరకాటంలో పెట్టాలనీ కొన్ని వర్గాలు ప్రయత్నించాయి. అధికార డెమొ క్రటిక్ పార్టీ సెనెటర్లు కూడా ఈ విషయంలో బైడెన్‌కు లేఖ రాశారు. ఇరు దేశాల అధినేతలూ ఉమ్మడిగా పాల్గొన్న మీడియా సమావేశంలో సైతం ఈ దిశగా ప్రశ్న సంధించారు. దానికి మోదీ ‘భారత్‌ను ప్రజాస్వామిక దేశమని మీరు అంగీకరిస్తే వివక్ష చూపుతున్నారన్న ప్రశ్నకు అర్థమే లేద’ని బదులిచ్చారు. బైడెన్ సైతం ప్రజాస్వామిక విలువలపై తాము చర్చించామంటూ జవాబిచ్చారు. ఈ విషయంలో ఇరు దేశాలూ ఇంకా పరిపూర్ణత సాధించాల్సివుందని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి పెట్టా ల్సిన వర్తమానంలో బైడెన్ ఇలాంటి అంశాల విషయంలో బహిరంగంగా ప్రస్తావించాలనుకోవటం అత్యాశే అవుతుంది. 2015 మొదట్లో అప్పటి అధ్యక్షుడు ఒబామా మన దేశంలో పర్యటించినప్పుడు సైతం ఆయనకు ఇలాంటి ప్రశ్న ఎదురైంది. అది మోదీ సమక్షంలో కాదు కాబట్టి, ‘మతవిశ్వాసాల పరంగా చీలనంతకాలమూ మీరు విజయం సాధిస్తార’ని లౌక్యంగా జవాబిచ్చారు. మొత్తానికి మోదీ మూడురోజుల అమెరికా పర్యటన అంచనాలకు మించిన రీతిలో విజయవంతమైంది. -
మోదీకి సినిమా స్టార్లా స్వాగతం: పాక్ మీడియా
భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యర్థులను కూడా తలదన్నేలా ఉంటున్నారని పాక్ మీడియా శ్లాఘించింది. ఆయనకు అమెరికాలో ఒక సినిమా నటుడి స్థాయిలో స్వాగతం లభించిందని పేర్కొంది. పాకిస్థాన్‌లోని పలు పత్రికలు నరేంద్రమోదీ అమెరికా పర్యటన విశేషాలను విస్తృతంగా కవర్ చేశాయి. మోదీకి సినిమా స్టార్లా స్వాగతం లభించగా, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మాత్రం కేవలం ఐక్యరాజ్య సమితిలో మాత్రమే మాట్లాడే అవకాశం లభించిందని ద నేషన్ పత్రిక చెప్పింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, మోదీకి ఫేస్బుక్, గూగుల్ తదితర సంస్థల ప్రధాన కార్యాలయాలతో పాటు.. ఎన్నారైల నుంచి కూడా అద్భుతమైన స్వాగతం లభించింది. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు జనం చప్పట్లతో అభినందనలు వెల్లువెత్తించారు. మోదీ సిలికాన్ వ్యాలీలోని దిగ్గజాలను కలవడంతో పాటు ఫేస్బుక్ లాంటి సంస్థలకు కూడా వెళ్లి అక్కడ మార్క్ జుకెర్బెర్గ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారంటూ పాక్ మీడియా చెప్పింది. -
సోనియా కుటుంబం అవినీతిపై మోదీ సెటైర్లు
దేశంలో అవినీతి గురించి తన ప్రసంగంలో ప్రస్తావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే సోనియా గాంధీ కుటుంబంపై గట్టిగా సెటైర్లు వేశారు. మన దేశంలో రాజకీయ నాయకుల మీద వాళ్లు పదవిలోకి వచ్చిన కొద్దికాలానికే ఆరోపణలు వస్తాయని చెప్పారు. ఆయన 50 కోట్లు, ఈయన 100 కోట్లు తీసుకున్నాడని అంటారన్నారు. కొడుకు 150 కోట్లు, కూతురు 500 కోట్లు, అల్లుడు వెయ్యి కోట్లు సంపాదించుకున్నాడని చెబుతారంటూ పరోక్షంగా కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టారు. ''సవతి తమ్ముడు కాంట్రాక్టులు, ఇంకొకళ్లు ఇంకోటి తీసుకున్నారని విని విని మీ చెవులు దిబ్బళ్లు పడిపోయాయా, అవినీతి మీద మీకు చికాకు పుట్టిందా లేదా.. నేను మీ మధ్య నిలబడి ఉన్నాను. నా మీద ఏమైనా ఆరోపణలున్నాయా?'' అంటూ ఎన్నారైలను ప్రశ్నించారు. దానికి లేవు.. లేవు అంటూ అక్కడున్న ప్రజల నుంచి సమాధానం వచ్చింది. 'నాకు మీ నుంచి సర్టిఫికెట్ కావాలి' అని అడిగి, జీవించినా దేశం కోసమే.. మరణించినా దేశం కోసమేనంటూ సభను ఉర్రూతలూగించారు. -
'ప్రపంచాన్ని మార్చే శక్తి ఆయనకు ఉంది'
శాన్ జోసె: ప్రపంచాన్ని, భారత్ ను మార్చే శక్తి ప్రధాని నరేంద్ర మోదీకి ఉందని సిస్కో సిస్టమ్స్ సీఈవో జాన్ చాంబర్స్ అభిప్రాయపడ్డారు. మోదీకి గ్లోబల్ విజన్ ఉందని, ప్రపంచ పరిణామాలపై ఆయనకు అవగాహన ఉందని అన్నారు. కాలిఫోర్నియాలోని శాన్ జోసెలో ఐటీ దిగ్గజ కంపెనీల సీఈవోలతో నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు సీఈవోలు మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ అమెరికాకు రావడం తమకెంతో ఆనందంగా ఉందని ఎడోబ్ సీఈవో శంతను నారాయణ్ అన్నారు. భారతదేశ వ్యాప్తంగా చవకైన బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. మోదీతో భేటీ అయిన వారిలో గూగుల్ సీఈవో సుందర్ పిచ్చై, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టిఐఈఎస్ సీఈవో వెంక్ శుక్లా తదితరులు ఉన్నారు.