breaking news
modern look
-
ఇస్రో శాస్త్రవేత్త ఆధ్యాత్మిక సేవ..! బృహత్ గ్రంథమైన శ్రీమద్భాగవతాన్ని..
ఆయనో శాస్త్రవేత్త.. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇష్రో)లో పనిచేసి, వృత్తిలో తన ప్రతిభను కనబర్చిన విజ్ఞాన వేత్త. భారతీయ సాహిత్యం, సంస్కృతి సంప్రదాయంలోని విశిష్టతను అవసోపన పట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇందులో భాగంగానే తేనెలొలికే తెలుగు పదాలతో పుణ్య చరితుడు బమ్మెర పోతన రచించిన పద్య భాగవతాన్ని ఈ తరానికి మరింత చేరువ చేయాలనుకున్నారు. అంతటి బృహత్ గ్రంథమైన శ్రీమద్భాగవతాన్ని అచ్చు పుస్తక రూపంలో, ఇంటర్నెట్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయనే.. న్యూనల్లకుంటకు చెందిన మందడి కృష్ణారెడ్డి. – ఇప్పటికే వివిధ రూపాల్లో లభ్యమవుతున్న భాగవత సంబంధిత సమాచారానికి ఆయన చేసిన ఆధునాతన రూపకల్పన ఈతరం భాగవత విశ్లేషకులకు, ఔత్సాహికులకు సులభతరం చేసింది. ఒక ఉన్నత శ్రేణి శాస్త్రవేత్తగా ఇస్రో ఐఐఎస్‌యూ తిరువనంతపురం నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఆయన.. తర్వాత విశ్రాంత సమయాన్ని దైవకార్యంగా భావించి సాహిత్య విశిష్టతలను కలగలిపి ఉన్న శ్రీమద్భాగవతాన్ని అందరికీ సులువైన మార్గంలో అందించడానికి సమగ్ర సంకలన రూపకల్పనకు నాంది పలికారు. ఇందులో భాగంగా సాంకేతిక అభివృద్ధి ఆకాశాన్ని అంటుతున్న ఈ కాలంలో వినూత్నంగా ‘స్లయిడ్ షో ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్‘ అనే మార్గాన్ని ఎంచుకుని శ్రీమద్భాగవతంలోని 12 స్కందాలు, 688 ఘట్టాలలోని 10,061 పద్యాలకు భావాన్ని, పదోచ్చారణ నేర్చుకోవడానికి వీలుగా ఆ పద్యాల ఆడియోను రూపొందించారు. ప్రతి పద్యంలోని పదాలకు అర్థం, ఆ పద్యానికి సంబంధించిన వ్యాకరణ అంశాలు ఛందస్సు, అలంకారాల వివరాలన్నీ ఒక పద్యం నుంచి మరొక పద్యానికి విషయ సూచిక ఆధారంగా సులువుగా వెళ్లేలా సమకూర్చారు. ఇవన్నీ కేవలం ఒక ప్రధాన పవర్ పాయింట్ స్లయిడ్ నుంచి ఒక్క క్లిక్‌తో సాధ్యమయ్యేలా చేశారు. సాహిత్యం, శ్రీమద్భాగవతం వంటి గ్రంథ పఠనం కష్టతరమైన ప్రస్తుత కాలంలో ఇంత సులభతరంగా పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడం అమృతప్రాయమైన విషయంగా భావిస్తున్నారు. ఈ అనితర సాధ్యమైన సాధనం ఉపయోగించడంలో ఒక ప్రధాన స్లయిడ్ నుంచి వేల పద్యాలకు సంబంధించిన పేజీలకు ఏర్పరచిన హైపర్ లింక్స్ ద్వారా సులువుగా వెళ్లేలా విస్తృతమైన ‘స్లయిడ్ షో ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్‘ చేయటం ఇదే ప్రథమం. మందడి చెన్నకృష్ణారెడ్డి, రంగనాయకమ్మ పుత్రుడైన కృష్ణారెడ్డి ఒకప్పటి ఆర్ఈసీ ఇప్పటి నిట్ వరంగల్ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్, ఐఐటీ చెన్నై నుంచి ఎం.టెక్ పూర్తి చేశారు. అనంతరం పరిశోధనలోనూ తన ప్రతిభతో ఎన్నో అవార్డులు అందుకున్నారు.సమగ్ర సంకలనంగా రూపొందించా.. ఈ సంకలనానికి, ‘శ్రీభాగవత సుధానిధి‘ అని నామకరణం చేశాను. ఎందరో మహానుభావులు పద్య భావాన్ని, ఆ పద్యాలకు సంబంధించిన ఎన్నో విశేషాలను క్రోడీకరించి అందుబాటులోకి తెచ్చారు. కానీ ఆ అంతర్యామి లీలా విశేష గ్రంథమైన శ్రీమద్భాగవతానికి సంబంధించి గ్రంథ విశేషాలను ఒక సమగ్ర సంకలనంగా రూపొందించాను. తెలుగు భాష, గ్రంథ పఠనంపై ఆసక్తి మాత్రమే అర్హతగా విద్యార్థులు మొదలుకొని పెద్దల వరకు ఎవరైనా అమృత తుల్యమైన పోతనామాత్యుల విరచిత శ్రీమద్భాగవత గ్రంథ విశేషాలను సులువైన మార్గంలో ఆకళింపు చేసుకునేలా రూప కల్పన చేశాను. ఈ ప్రయత్నంలో భాగంగా శ్రీమద్భాగవత పద్యాలు, ఆ పద్యాల భావాన్ని, పదోచ్చారణ, ప్రతిపదార్థం, పద్యాలలోని అలంకార విశేషాలు విడివిడిగా ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాలలో లభ్యమవుతున్న వాటిని సమగ్ర సంకలనంగా మార్పు చేశాను. – కృష్ణారెడ్డి (చదవండి: మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ ప్రియాంక తారే..!) -
Birthday Special: అదిరే అందం..అదితి హైదరి సొంతం
-
పట్టుచీరకు రాయల్ టచ్
వెల్వెట్ క్లాత్ అంటేనే రాయల్ ఫ్యాబ్రిక్. వివాహ వేడుకల్లో సంప్రదాయపు సందడికి పెట్టింది పేరు పట్టు చీరలు. సంప్రదాయానికి రాయల్ టచ్ అద్దితే..! పట్టు చీరకు సెల్ఫ్ బ్లౌజ్ లేదంటే కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ వాడడటం ►చీర రంగు వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో హాప్ షోల్డర్ బ్లౌజ్‌ను డిజైన్ చేయిస్తే మోడ్రన్ లుక్. ఈ కాంబినేషన్‌కి రాళ్లు పొదిగిన హారాలు మరింత అందాన్నిస్తాయి. ►వెల్వెట్ బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పూసలు, జర్దోసీతో స్లీవ్స్ ప్యాటర్న్‌కి మాత్రమే ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. పట్టుచీరకు పూర్తి కాంట్రాస్ట్ వెల్వెట్ బ్లౌజ్‌ను ధరిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. ►పట్టుచీర రంగులో ఉన్న వెల్వెట్ బ్లౌజ్‌కి చేతుల భాగంలో ఆ చీర అంచు భాగాన్ని జత చేస్తే రాయల్ లుక్‌తో మెరిసిపోతారు. ►సింపుల్‌గా మోచేతుల వరకు స్లీవ్స్ డిజైన్ చేయించుకున్నా, కాస్త హెవీ ఎంబ్రాయిడరీ చేసినట్లయితే హాఫ్వైట్శారీస్కి మరిన్ని హంగులు అద్దినట్టే. -
ఇంగిల్పీసువారి... సింగిల్పీసు!
ఈమధ్య మన దృష్టి అంతా ఇంగ్లిషువారి మీదే ఉన్నట్టు ఉంది. మోడ్రన్ లుక్, సెక్సీ లుక్, ప్రెట్టీ లుక్, మెట్రో లుక్... ఎదుటివారి లుక్స్ కొల్లకొట్టేయడానికి వారి నుంచే బోలెడన్ని మార్గాలు వెతుకుతున్నారు. దాంట్లో భాగంగా వచ్చిందే ఈ సింగిల్పీసు... అదేనండి సింగిల్‌పీస్ క్లాత్‌తో డిజైన్ చేసిన మ్యాక్సీ స్టైల్. పొడవాటి గౌను, ఫ్రాక్ అని పిలిచే ఈ డ్రెస్ పాదాలను తాకుతున్నట్టుగా ఉంటుంది. ఇది ఫార్మల్గా వేసుకోదగిన డ్రెస్కాదు.పాశ్చాత్యపార్టీలకు బాగా నప్పే డ్రెస్. పై నుంచి కిందవరకు వదులుగా ఉండే ఈ డ్రెస్ నైటీకి తక్కువ, ఫ్రాక్‌కి ఎక్కువ అన్నట్టు ఉంటుంది. 70ల కాలం నుంచి నేటి వరకు ఈ స్టైల్ ప్రపంచమంతా తన హవా కొనసాగిస్తూనే ఉంది. ఇంగ్లిష్ దొరసానుల గౌన్‌గా ప్రసిద్ధి చెందిన మ్యాక్సీలో ఇటీవల మన బాలీవుడ్, టాలీవుడ్... యువతారలు తెగ మెరిసిపోతున్నారు. వీటిలోనే చిన్నా చితకా మార్పులు తెచ్చి డిజైనర్లు యువతరాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. చలికాలంలో జీన్స్ జాకెట్ ధరిస్తే మ్యాక్సీ స్టైల్మరింత మోడ్రన్‌గానూ, సౌకర్యంగానూ ఉంటుంది. మూడుకాలాల్లోనూ ముచ్చటగా... దీనిని కాటన్, పాలిస్టర్.. ఏ క్లాత్తోనైనా రూపొందించవచ్చు. స్లీవ్‌లెస్ చేతులు, హాల్టర్నెక్ లైన్స్, రంగురంగుల ప్యాటర్స్తో మ్యాక్సీని అందంగా రూపుకట్టవచ్చు. వేసవిలో సౌకర్యం అనిపించే డ్రెస్ ఇప్పుడుఅన్ని కాలాల్లోనూ చిన్న చిన్న మార్పులతో స్టైల్‌గా తయారుచేస్తున్నారు. ఎందుకంటే... సులువుగా ధరించవచ్చు. చాలా చాలా సౌకర్యంగా ఉంటుంది. స్టైల్‌గా పాశ్చాత్యయువరాణుల్లా కనిపిస్తారు. ఇతర అలంకరణలేవీ అంతగా అవసరం లేదు. మూడుకాలాల్లోనూ ముచ్చటగా... పువ్వుల మ్యాక్సీ ధరిస్తే ప్లెయిన్ జాకెట్ వేసుకోండి. ప్లెయిన్ మ్యాక్సీ వేసుకుంటే పువ్వుల ప్రింట్లు ఉన్న జాకెట్‌ను ధరించండి. వర్షంలో అయితే వాటర్‌ప్రూఫ్ షూ వేసుకోండి. వింటర్కైతే లెదర్షూ ధరించండి. సమ్మర్ అయితే, ఎంచక్కా ప్లాటర్స్, శాండిల్స్ వేసుకుని, ఓ హ్యాట్పెట్టుకుంటే స్టైల్ అంతా మీదే! గుర్తుంచుకోవాలి... పాదాలను తాకుతున్నట్టుగా లేదంటే కాస్త మడమల పైకి ఉన్నా బాగుంటుంది. అంతుకుమించి పొడవు ఉండకూదు.ఛాతి వెడల్పుగా ఉన్నవారికి మ్యాక్సీ గౌన్ బాగా నప్పుతుంది.మ్యాక్సీపైన పెద్ద పెద్ద ప్రింట్లు ఉంటే డ్రెస్ చీప్‌గా లేదా, మీకు నప్పకపోవడమో ఉంటుంది. అందుకని ఎప్పుడైనా చిన్న చిన్న ప్రింట్లున్న మ్యాక్సీలను ఎంచుకోవాలి. ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకుంటే క్యాజువల్‌గా ఈవెనింగ్ వాక్స్కీ వెళ్లవచ్చు. పార్టీలకు వెళ్లినప్పుడు పెద్ద హీల్ ఉన్న చెప్పులను వేసుకోవాలి. - ఎన్.ఆర్. -
అద్భుతంగా మూసీ తీరం
అందమైన పార్కులు, పార్కింగ్ స్థలాల అభివృద్ధి ప్రభుత్వ భూములను గుర్తించి సుందరీకరణ మూసీ ప్రక్షాళనకు సమగ్ర ప్రణాళిక ఇందిరా పార్క్ వద్ద అంతర్జాతీయస్థాయి కన్వెన్షన్ సెంటర్ ‘తెలంగాణ కళా భారతి’ పేరుతో భారీ నిర్మాణం రాజధానిలోని చారిత్రక నిర్మాణాలకు కొత్త హంగులు ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్‌తో భేటీలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘మూసీకి ఇరువైపులా అద్భుతమైన పార్కులు, పార్కింగ్ స్థలాలు నిర్మించాలి. హైదరాబాద్‌లో చాదర్‌ఘాట్ నుంచి బాపూఘాట్ వరకు సర్వే చేసి ప్రభుత్వ భూములెన్ని ఉన్నాయో గుర్తించాలి. ఆ తర్వాతే మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు అనువైన ప్రణాళికలు రూపొందించాలి’ అని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్‌తో గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాజధానిలో కొత్త కట్టడాల నిర్మాణంపై చర్చించారు. మూసీ నది చుట్టూ కొత్త నిర్మాణాల ప్రతిపాదనలను హఫీజ్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భౌగోళిక, వాతావరణ, సామాజిక పరిస్థితులపరంగా హైదరాబాద్ ఎంతో ప్రత్యేకమైందని, ఈ ప్రత్యేకతలను, విలక్షణతలను ఓ అవకాశంగా మార్చుకోవాలని కోరారు. హైదరాబాద్ గత వైభవం గుర్తుకు వచ్చేలా నగరంలో కొత్త నిర్మాణాలు రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నగరంలో కొత్తగా నిర్మించే టవర్లు, బహుళ అంతస్తుల భవనాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడేలా ఉండాలన్నారు. ఏ ప్రాంతంలో ఎలాంటి కట్టడం రావాలి, ఎంత విస్తీర్ణంలో నిర్మించాలి, వాటిని ఏ అవసరాలకు వినియోగించుకోవాలనేఅంశాలపై సమగ్ర అధ్యయనం జరిపి ప్రణాళికలు రూపొందించాలని హఫీజ్ కాంట్రాక్టర్‌ను కోరారు. చరిత్ర ఆనవాళ్లు చెరగకుండా, వాటిని మరింత ఆధునికంగా టర్కీ దేశ రాజధాని ఇస్తాంబుల్ నగరం స్ఫూర్తిగా హైదరాబాద్ కూడా అంతర్జాతీయ నగరంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచంలోని ప్రతి పౌరుడు తప్పకుండా సందర్శించాలనుకునే నగరాల జాబితాలో హైదరాబాద్ శాశ్వతంగా ఉండిపోవాలని అభిలషించారు. నగర ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా మల్టీ లేయర్ ఫ్లై ఓవర్ల నిర్మాణం జరగాల్సి అభిప్రాయపడ్డారు. గూగుల్ ఎర్త్ సహాయంతో నగరంలో కొత్త కట్టడాల కోసం అనువైన స్థలాలను ఈ సమావేశంలో గుర్తించారు. ఈ సందర్భంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు పలు ప్రతిపాదనలను చేశారు. ఇందిరా పార్కు ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో ‘తెలంగాణ కళా భారతి’ పేరుతో అంతర్జాతీయస్థాయి కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించాలని తెలిపారు. అక్కడే నాలుగు ఆడిటోరియాలు, విశాలమైన పార్కింగ్ స్థలం వచ్చే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించాలని సూచించారు. హైదరాబాద్‌లోని పలు ముఖ్యమైన ప్రాంతాల చారిత్రక నేపథ్యం, సామాజిక పరిస్థితుల ఆధారంగా కొత్త నిర్మాణాలు వైవిధ్యంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే, యాదగిరిగుట్ట, జహంగీర్ దర్గాలను సైతం తీర్చి దిద్దాల్సిన అవసరముందన్నారు. మొజంజాహీ మార్కెట్, చార్మినార్, హుస్సేన్‌సాగర్ జలాశయం, ప్రఖ్యాత సాలార్జంగ్ మ్యూజియం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న కీలక నిర్మాణాలకు మరింత వన్నె తెచ్చే విధంగా అక్కడి ఆవరణలను తీర్చిదిద్దాలని హఫీజ్‌ను కోరారు. సాధారణ సిమెంట్ కట్టడం హైటెక్ సిటీ: కేసీఆర్ చార్మినార్, గోల్కొండ, ఫలక్‌నుమా, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీదు, సాలార్జంగ్ మ్యూజియం, అసెంబ్లీ, హైకోర్టు లాంటి కట్టడాలను అద్భుత నిర్మాణ కౌశలంతో తిర్చిదిద్ది హైదరాబాద్‌కు నిజాం రాజులు ప్రపంచ ఖ్యాతిని తెచ్చి పెట్టారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తర్వాత వచ్చిన పాలకులు ఆ వారసత్వాన్ని కొనసాగించడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి లేకపోవడం వల్ల నగరాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా చూశారన్నారు. చార్మినార్ లాంటి కట్టడాన్ని మరిపించి, హైటెక్ సిటీ పేరుతో నిర్మించిన ఓ సాధారణ సిమెంటు కట్టడాన్ని హైదరాబాద్‌కు సింబల్‌గా చూపించే ప్రయత్నం చేశారని విమర్శించారు. నగర ప్రతిష్టను పెంచేలా నిజాం రాజుల అద్భుత కట్టడాలకు అనుబంధంగా మరిన్ని కట్టడాలను నిర్మించాల్సి ఉందని చెప్పారు.