breaking news
mock Assembly session
-
రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కిన పాలనే ఇది
భారత రాజ్యాంగం ఎంత గొప్పదో తెలిపే భారీ ప్రసంగాలు ఒకవైపు, అదే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న వైనం మరో వైపు ... ఇవి పరస్పర విరుద్దం అయినప్పటికీ, మన పాలకులు అతి చాకచక్యంగా రెండిటిని ఏక కాలంలో చేయగలుగుతున్నారు. అప్పుడప్పుడూ న్యాయ వ్యవస్థ చెక్ పెడుతున్నప్పటికీ, దానిని అతిక్రమించి రాజ్యాంగాన్ని ,తద్వారా ఏర్పడిన చట్టాలను పలుమార్లు పాలకులు దుర్వినియోగం చేస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సరికొత్త రికార్డులను సాదిస్తోందన్న భావన న్యాయ కోవిదులలో కలుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మద్యం స్కామ్ జరిగిందంటూ ఒక కల్పిత కథను సృష్టించి, అందులో పలువురిని ఇరికిస్తూ అరెస్టులు చేయడం, వారికి బెయిల్ వస్తే కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం పెద్ద,పెద్ద లాయర్లను పెట్టి వారిని తిరిగి అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్న తీరు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో చంద్రబాబు పై వచ్చిన కుంభకోణాల కేసులను నీరుకార్చడానికి అన్ని నిబంధనలను తుంగలో తొక్కి, ఫిర్యాదుదారులనే బెదిరించి కోర్టులలో అఫిడవిట్లు వేయిస్తున్న పద్దతి సైతం రాజ్యాంగానికి విఘాతం కలిగించేదిగా అనిపిస్తుంది. రాజ్యాంగ దినోత్సవం నాడు విద్యార్దులతో మాక్ అసెంబ్లీ నిర్వంచి చంద్రబాబు ,ఆయన కుమారుడు మంత్రి లోకేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాజ్యాంగం గొప్పదనం గురించి మాట్లాడారు. కాని చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని పాటిస్తున్నదా?లేక రెడ్ బుక్ పేరుతో కొత్త రాజ్యాంగం అమలు చేస్తున్నదా అంటే రెడ్ బుక్కునే ప్రమాణికంగా తీసుకుంటున్నారన్న అబిప్రాయం సర్వత్రా ఉంది. దానిని ప్రభుత్వ పెద్దలు దాచుకోవడం లేదు.అదే సమయంలో చంద్రబాబు పై వచ్చిన కుంభకోణాల కేసులను నీరుకార్చడానికి అన్ని నిబంధనలను తుంగలో తొక్కి, ఫిర్యాదుదారులనే బెదిరించి కోర్టులలో అఫిడవిట్లు వేయిస్తున్న పద్దతి సైతం రాజ్యాంగానికి విఘాతం కలిగించేదిగా అనిపిస్తుంది. రాజ్యాంగ దినోత్సవం నాడు విద్యార్దులతో మాక్ అసెంబ్లీ నిర్వహించి చంద్రబాబు ,ఆయన కుమారుడు మంత్రి లోకేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాజ్యాంగం గొప్పదనం గురించి మాట్లాడారు. కాని చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని పాటిస్తున్నదా?లేక రెడ్ బుక్ పేరుతో కొత్త రాజ్యాంగం అమలు చేస్తున్నదా అంటే రెడ్ బుక్కునే ప్రమాణికంగా తీసుకుంటున్నారన్న అబిప్రాయం సర్వత్రా ఉంది.దానిని ప్రభుత్వ పెద్దలు దాచుకోవడం లేదు. మద్యం కేసులో రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అధికారి దనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ప్రైవేటు కంపెనీలో పనిచేసే బాలాజి గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. కేసు విచారణను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయలేదన్న భావనతో వీరికి కోర్టు బెయిల్ ఇస్తే ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి దానిని రద్దు చేయించాలని పిటిషన్ వేసింది.దానిపై హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ వేసుకోవాలని, అందువల్ల కోర్టులో తిరిగి లొంిపోవాలని వీరిని ఆదేశించింది. ఆ మీదట వారు సుప్రింకోర్టును ఆశ్రయిస్తే వారికి డిపాల్ట్ బెయిల్ కొనసాగిస్తూ కొన్ని ప్రశ్నలు సంధించింది.నిదితులను సుదీర్గకాలం కస్టడీలో ఉంచి ఏమి సాధిస్తారని సుప్రింకోర్టు చీప్ జస్టిస్ సూర్యకాంత్ ఆద్వర్యంలోని ధర్మాసనం ప్రశ్నించింది.200 మంది సాక్ష్యులను విచారించాలని ప్రభుత్వం చెబుతోందని, ఎంత కాలం ఈ విచారణ సాగుతుందని కోర్టు అడిగింది. దీనికి సిట్ తరపు లాయర్లు జవాబు ఇచ్చే అవకాశం ఉందా?ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. గతంలో లోక్ సభ సభ్యుడు మిదున్ రెడ్డికి ,మరొకరికి ఇదే కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు ఏసీబీ కోర్టు ఈ కేసులో ఆదారాలు ఎక్కడ అని ప్రశ్నించింది.దానిపై కోపం వచ్చిన ప్రభుత్వ తరపు ఢిల్లీ న్యాయవాది ఒకరు ఏకంగా ఆ జడ్జిని బదిలీచేయిస్తామని వ్యాఖ్యానించి బెదిరించారని వార్తలు వచ్చాయి.అయినా నిందితులకు బెయిల్ రానివ్వకుండా ఏదో సాకు చూపుతూ ప్రభుత్వం అడ్డుపడుతున్నదన్న సంగతి అందరికి అర్ధం అవుతూనే ఉంది.ఇదంతా రాజ్యాంగ సమ్మతంగా కనిపిస్తుందా?నిర్టిష్ట ఆధారాలు చూపి కేసు పెడితే ఎవరూ మాట్లాడే అవకాశం ఉండేది కాదు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలు జరిగాయా?లేదా?ఆ వెంటనే పోలీసులు కేసులు పెట్టడం నిత్యంచూస్తూనే ఉన్నాం. ఈ కేసులో హైదరాబాద్ లో 11 కోట్ల రూపాయల నగదు దొరికిందని పోలీసులు కోర్టుకు చెప్పిన తర్వాత, వాటి నెంబర్లతో సహా వీడియో రికార్డు చేయాలని రాజ్ కెసిరెడ్డి కోరగానే పోలీసులు వెంటనే ఆ డబ్బును బ్యాంకులో జమ చేయడం ఏమిటి?అలాగే వెంకటేష్ అనే మరో నిందితుడి ఫోన్ లో డబ్బుల డంప్ వీడియో,ఫోటో దొరికిందంటూ ఎందుకు లీక్ ఇచ్చారు. తర్వాత ఆసలు పోన్ ను ఓపెన్ చేయలేదని ఎందుకు కోర్టుకు చెప్పారు. ఇవన్ని చట్టాన్ని ఇష్టం వచ్చినట్లు చేతిలోకి తీసుకున్నట్లు అనిపించదా? 3500 కోట్ల రూపాయల ముడుపులను ఇచ్చినట్లు ఏ డిస్టిలరీ ఫిర్యాదు చేయకపోయినా దారిపోయే వ్యక్తి తో లెటర్ రాయించి ఇలా కక్ష అరెస్ట చేయిస్తున్నారా?లేదా? పోనీ ఇదే ప్రామాణికం అయితే గతంలో చంద్రబాబు తదతరుల మీద వచ్చిన అవినీతి కేసులను నీరుకార్చడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ రాజ్యాంగం ప్రకారం నైతికంగా కరెక్టు అవుతాయి.ఉదాహరణకు అప్పట్లో స్కిల్ స్కామ్ , ఇసుక, మద్యం, అస్సైన్డ్ భూములు, అమరావతి ఇన్న్ రింగ్ రోడ్డు కుంభకోణం, ఇన్ సైడ్ ట్రేడింగ్ వంటి కేసులను నీరుకార్చుతున్న వ్యవహారంపై వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అప్పట్లో ఈ కేసులో సాక్ష్యాదారాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులతోనే ,ఆధారాలు లేవని అఫిడవిట్లు వేయిస్తున్నారట.ఉదాహరణకు మద్యం స్కామ్ లో చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన వాసుదేవరెడ్డి, అమరావతి కేసుల్లో ఫిర్యాదు చేసిన ఐఎఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ , ఫైబర్ నెట్ అవినీతి కేసులో కంప్లెయింట్ చేసిన మధుసూదన రెడ్డిలను భయపెట్టి ,లేదా ప్రలోభపెట్టో ఆ కేసులపై వ్యతిరేకంగా అఫిడవిట్ లు వేయిస్తున్నారు.ఇది ఏ రాజ్యాంగం, చట్టం అనుమతిస్తుంది?అసలు విచారణ పూర్తి కాకుండానే అధికారం ఉంది కనుక వాటి నుంచి బయటపడడానికి చంద్రబాబు అండ్ కో చేస్తున్న ప్రయత్నాలపై న్యాయపోరాటం చేస్తామని మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి చెబుతున్నారు. ఇది లీగల్ పైట్ కు సంబందించిన విషయం కాదు.ప్రభుత్వం నడిపేవారు పాటించవలసిన విలువలకు సంబంధించినవని చెప్పాలి.తనపై వచ్చిన రోఉపణలను తనే క్లియర్ చేసుకోవడం నైతికంగా సమర్ధనీయమేనా? ఏపీలో తప్ప,దేశంలో మరే రాష్ట్రంలో అయినా ఇలా జరుగుతోందా?వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సర్కిల్ ఇన్ స్పెక్టర్ శంకరయ్య పై ముఖ్యమంత్రి స్థాయి నేత ఒకటికి రెండుసార్లు ఆరోపణలు చేయవచ్చా? విసుగుచెందిన ఆ అధికారి ముఖ్యమంత్రికి లీగల్ నోటీసు పంపితే దానికి జవాబు ఇవ్వకుండా, అతని ఉద్యోగం పీకేస్తారా? శంకరయ్య పోలీసు శాఖకు కళంకం తెచ్చారని ఇలా చేశారట. అంటే పౌరునిగా తన హక్కు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తే కళంకం పేరుతో ఉద్యోగం తీసిస్తేరా? నిండు చట్టసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అసత్యాలు చెబితే మాత్రంం ప్రజాస్వామ్యానికి కళంకం రాదన్నమాట.దానిపై ఎవరూ మాట్లాడకూడదన్నమాట.శంకరయ్య చేసిన ఆరోపణలకు ప్రభుత్వం జవాబు ఇవ్వలేకపోయింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ విచారణకు హాజరుకాకుండా, అమెరికా పంపించివేసి, కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చాక అతనికి బకాయిలతో సహా జీతాలు చెల్లించడం ఏ రకంగా సమంజసం అవుతుంది. అలాగే సోషల్ మీడియా పోస్టుల కేసుల పేరుతో ప్రభుత్వం సాగిస్తున్న అరాచకం మాటేమిటి? నిజంగా తప్పుగా పోస్టులు పెడితే ఎవరూ కాదనరు. తెలుగుదేశం, జనసేనలకు చెందినవారు ఎలాంటి దిక్కుమాలిన పోస్టులు పెట్టినా,వాఖ్యలు చేసినా కేసులు ఉండవా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కోపంతో వైసిపి అధికార ప్రతినిది కారుమూరి వెంకటరెడ్డిని అరెస్టు చేస్తే గౌరవ న్యాయస్థానం రిమాండ్‌ను తిరస్కరించిందే. ఇక ఈ ప్రభుత్వం వచ్చాక పట్టుబడిన నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను ఎలా ఇరికించారు?అసలు పాత్రధారులన్న అనుమానం ఉన్న టిడిపి నేతలపై కేసే ఎందుకు పెట్టలేదు?ఇంకా చిత్రమేమిటంటే ఏపీలో ఆయా ఘటనలలో బాదితులపైనే కేసులు పెట్టే సన్నివేశాలు చూస్తున్నాం.అందువల్లే హిందుపూర్ లో ఒక అధికారి తాను తప్పుడు కేసు పెడుతున్నానని క్షమించాలదని సంబంధిత వ్యక్తికే ఫోన్ చేసి చెప్పారు. దానిని బట్టే చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం రాజ్యాంగ విలువలను పాటించడం లేదన్న సంగతి తేటతెల్లమవుతుంది కదా!అసలు ప్రభుత్వాన్ని నడుపుతున్నది చంద్రబాబు నాయుడా?లేక ఆయన కుమారుడైన మంత్రి లోకేషా?రెడ్ బుక్ పేరుతో లోకేష్ కు చెందిన ఒక టీమ్ జరుపుతున్న అరాచకాలను ఏ రాజ్యాంగం అనుమతిస్తుంది. పైగా పలువురు పోలీసులకు రాజ్యాంగం తెలియదని లోకేష్ తన యువగళంలో తెలుసుకున్నారట. రెడ్ బుక్కే రాజ్యాంగమని తెలుసుకుని మసలుకోకపోతే పోలీస్ అధికారులనే శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగానికే కాదు.ఆయన విగ్రహం ఉన్న స్త్మతి వనానికి కూడా గౌరవం ఇవ్వడం లేదు. ఎంత దురదృష్టం! ఇలాంటి ప్రభుత్వాన్నా ఏపీ ప్రజలు కోరుకున్నది!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చెట్టు కింద సభ
పోటీ అసెంబ్లీ స్పీకర్‌గా దురై మురుగన్ చలోక్తులు, వ్యంగాస్త్రాలతో హాస్యపు జల్లులు నేటికి వాయిదా కోర్టుకు సస్పెన్షన్ వ్యవహారం చెన్నై: జార్జ్ కోట ఆవరణలో శుక్రవారం రెండు రకాల అసెంబ్లీ సమావేశం సాగింది. ఒకటి అన్నాడీఎంకే నేతృత్వంలో సభా మందిరంలో సాగితే, మరొకటి డీఎంకే నేతృత్వంలో ‘సభ’ చెట్టు కిందకు జరిగింది. పోటీ అసెంబ్లీ నినాదంతో సాగిన ఈ సభకు స్పీకర్‌గా డీఎంకే శాసన సభాపక్ష ఉపనేత దురైమురుగన్ వ్యవహరించారు. చెట్టు కింద చలోక్తులు, వ్యంగ్యాస్త్రాలు వెరసి హాస్యపు జల్లుల్ని పండించాయి. ఇక, డీఎంకే సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం మద్రా సు హైకోర్టుకు చేరింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం వ్యవసాయ, పశుసంవర్థక శాఖల కేటాయింపులపై చర్చ జరిగింది. అన్నాడీఎంకే, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తోపాటు సస్పెండ్ వేటు పడని ఐదారుగురు డీఎంకే సభ్యులు మాత్రమే సభలోకి అనుమతించారు. సప్పెన్షన్‌కు గురైన ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌తో పాటుగా ఇతర డీఎంకే సభ్యులు అటు వైపుగా రానివ్వకుండా గట్టి చర్యలే తీసుకున్నా రు. సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలు రాగానే వారిని జార్జ్‌కోట పరిసరాల్లోనే అడ్డుకున్నారు. దీంతో జార్జ్‌కోటలోని ఓ అతి పెద్ద చెట్టు కింద మైక్‌లు, స్పీకర్లు, కుర్చీలు ప్రత్యక్షం అయ్యాయి. అన్నాడీఎంకే ప్రభుత్వానికి పోటీగా, తామూ ఇక్కడ అసెంబ్లీ నిర్వహించనున్నామని ప్రకటించి, చెట్టు కింద సభ వ్యవహారాలను సాగించే రీతిలో తమ నిరసనను డీఎంకే సభ్యులు వ్యక్తం చేశారు. పోటీ సభ : అసెంబ్లీ సమావేశ మందిరంలో స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో సభ ఆరంభం కాగానే, సపెన్షన్ రద్దుకు పట్టుబడుతూ కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ తోపాటు ఆరుగురు డీఎంకే సభ్యులు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అందుకు స్పీకర్ నిరాకరించడంతో సభ నుంచి సదరు పార్టీల సభ్యులు వాకౌట్ చేసి బయటకు వచ్చారు. అదే సమయంలో చెట్టు కింద పోటీ సభ ఆరంభం కాగానే... వారు కూడా ఈ సభలో పాల్గొన్నారు. ఈ పోటీ సభకు డీఎంకే శాసన సభా పక్ష నేత దురై మురుగన్ స్పీకర్‌గా వ్యవహరించారు. సభలో ప్రతి పక్షాల గళం నొక్కడం లక్ష్యంగా ధనపాల్ ఏవిధంగా వ్యవహరిస్తారో దానిని అనుకరిస్తూ దురై మురుగన్ చక్కటి నటనతో అందర్నీ మెప్పించారు. సభలో సభ్యులు ఏ విధంగా ప్రశ్నల్ని సంధిస్తారో, అందుకు మంత్రులు ఏ విధంగా అడ్డు పడుతారో, ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్ లేవగానే, అధికార పక్షం నుంచి వచ్చే అరుపులు కేకల్ని కళ్లకు గట్టినట్టు వివరించారు. అధ్యక్షా..అధ్యక్షా..అంటూ సాగిన ఈ పోటీ సభలో చలోక్తులు, వ్యంగ్యాస్త్రాలు హోరెత్తడంతో చుట్టు చేరిన వారందరికీ పసందైన హాస్యపు విందు లభించినట్టు అయింది. డెంగీ తాండవం గురించి ఓ సభ్యుడు లేవదీసిన ప్రశ్నకు మంత్రిగా నటిస్తూ సమాధానం ఇచ్చిన డీఎంకే సభ్యుడు పొన్ముడి, చివరగా అమ్మ(జయలలిత)ను అడిగి, మందులు పంపిణీ చేస్తామన్నట్టుగా సెటైర్లతో ప్రసంగించారు. చివరకు సభను రేపటికి వాయిదా వేస్తూ పోటీ స్పీకర్ దురై మురుగన్ నిర్ణయించారు. ఎవర్నో కించ పరచాలనో, మరెవర్నో విమర్శించాలనో తాము ఈ పోటీ సభ ఏర్పాటు చేయలేదని ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్ ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక్కడ నిర్వహించిన పోటీ సభను అనేక చానళ్లు ప్రత్యక్ష ప్రసారం కూడా చేసినట్టుగా సమాచారం వచ్చిందన్నారు. దీన్ని బట్టి ఆలోచించండి, అసెంబ్లీ వ్యవహారాల్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా సభ్యులు ఏ మేరకు తప్పులు చేస్తున్నారో అన్నది అందరి దృష్టికి చేరుతుందని చెప్పారు. కోర్టుకు సస్పెన్షన్: డీఎంకే సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. డీఎంకే తరఫున న్యాయవాదులు మోహన్, ఎన్ఆర్ ఇళంగోవన్ ఉదయం ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని బెంచ్ ముందు సప్పెన్షన్ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. అత్యవసర పిటిషన్‌గా విచారించాలని విన్నవించారు. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి ఆక్షేపణ వ్యక్తం చేశారు. షెడ్యూల్ మేరకు ఈ రోజున విచారించిన కేసుల వివరాలను ఇప్పటికే ప్రకటించి ఉన్నామని, పిటిషన్ దాఖలు చేయాలని, సోమవారం విచారణ చేపడుతామని సూచించారు. డీఎంకే సభ్యు ల సస్పెన్షన్‌ను విజయకాంత్ ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతి పక్షంలో ఉన్న తమ గళాన్ని నొక్కే విధంగా వ్యవహరించారని, ఇప్పుడేమో అదే బాటలో ఈ ప్రభుత్వం సాగుతున్నదని మండిపడ్డారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు కాకుండా, మరొకరికి అధికార పగ్గాలు అప్పగించి ఉంటే, పరిస్థితి ఇలా ఉండేదా..? అని పరోక్షంగా ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిర్ణయంలో మార్పు ప్రసక్తే లేదు : ఇక, అసెంబ్లీలో డీఎంకే సభ్యుల సస్పెన్షన్ వ్యవహారంపై స్పీకర్ ధనపాల్ స్పందిస్తూ, తన నిర్ణయంలో ఎలాంటి మార్పులు లేదు అని స్పష్టం చేశారు. ఇక, మంత్రులు తమ ప్రసంగాల్లో కేటాయింపుల గురించి, సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి మమా.. అనిపించారు. ఆ మేరకు మంత్రి సెల్లూరు రాజు తన ప్రసంగంలో అడిగిందీ, అడగనిదీ ఇచ్చే వ్యక్తి తమ అమ్మ అని, అందుకే తన శాఖ అభివృద్ధిలో దూసుకెళుతోందన్నారు. మంత్రి బాలకృష్ణారెడ్డి తన ప్రసంగంలో పశు సంవర్థక శాఖ కేటాయింపులను ప్రస్తావిస్తూ, తిరువళ్లూరు, తిరుప్పూర్‌లలో పశువులకు వచ్చే రోగాలపై పరిశోధనలకు కేంద్రాల ఏర్పాటు గురించి వివరించారు. అలాగే తమిళ సాహసక్రీడ జల్లికట్టు నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక, మదురైలలోని గుంటలు, చెరువుల పరిరక్షణకు రూ. పది హేను లక్షలు ప్రకటించినట్టు మంత్రి ఎడపాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు.


